జగనన్న..పేట! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగనన్న..పేట!

జగనన్న..పేట!

Written By news on Thursday, April 19, 2012 | 4/19/2012



నరసన్నపేట.. కాదు కాదు.. ఈ ఒక్కరోజు కు అది జగనన్నపేటే.. ఆ పేటను జగన్నామస్మరణ హోరెత్తించింది.. అశేష జన సందోహం ముంచెత్తింది. ఉదయం నుంచీ అన్ని మార్గాలు పేటవైపే. మెల్లగా మొదలైన జనప్రవాహం.. క్రమంగా వరదలా మారింది. సాయంత్రానికి పట్టణం జనసంద్రమైంది. ఎటు చూసినా.. ఏ రోడ్డు చూసినా.. జనం.. అందరి నోటా జగన్. వృద్ధులు, పిల్లలు, మహిళలు అన్న తేడా లేకుండా అన్ని వర్గాలు పేటను ముట్టడించాయి. జగన్ రాక రెండు గంటలు ఆలస్యమైనా ఏమాత్రం సహనం కోల్పోలేదు. విద్యుత్ సరఫరా నిలిపివేసి పట్టణాన్ని చీకట్లలోకి నెట్టినా ఏమాత్రం వెనక్కితగ్గలేదు. రెట్టించిన ఉత్సాహంతో ఉప్పొంగిన జన కెరటమే విద్యుత్ తరంగమైంది. అభిమాన వెలుగులతో కుతంత్రాల చీకట్లను చీల్చిచెండాడారు. అభిమాన నేతను తమ నుంచి ఎవరూ దూరం చేయలేరని ఘనంగా చాటారు. నరసన్నపేట గుండెల్లో ఎప్పటికీ కొలువుంటారని ఢంకా బజాయించారు. నాలుగురోజుల ప్రచార యాత్రకు ఘనాతిఘనమైన ముక్తాయింపునిచ్చారు.
నరసన్నపేట, శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ఇసుక వేస్తే రాలనంతగా...చీమైనా దూరనంతగా.. కిక్కిరిసిపోయిన నరసన్నపేట బహిరంగ సభ జననేత జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు రోజుల ప్రచార యాత్రకు ఘనమైన ముగింపునిచ్చిం ది. ప్రజాభిమానం ముందు ప్రచండ సూరీడు కూడా చిన్నబోయాడో.. ముచ్చటపడ్డాడో గానీ కాస్త పక్కకు తప్పుకొని చల్లదనానికి చోటివ్వడంతో జగన్‌మోహన్‌రెడ్డి సభకు జనం పోటెత్తారు. గంటల తరబడి నిరీక్షించి మరీ ఘన స్వాగతం పలికారు. నాలుగోరోజు బుధవారం యాత్ర ఆద్యంతం ప్రజల నీరాజనాల నడుమ ఆసక్తికరంగాసాగింది. త్వరలో ఉపఎన్నికలు జరగనున్న నరసన్నపేట నియోజకవర్గంలో ఈ నెల 15న మొదలైన జననేత ప్రచార యాత్ర బుధవారం రాత్రి నియోజకవర్గ కేం ద్రంలో జరిగిన భారీ బహిరంగ సభతో ముగి సింది. చివరి రోజైన బుధవారం మబగాంలో ప్రారంభమైన రోడ్‌షో కిళ్లాం, ఈదువలస, రాళ్లపాడు, ఈదులవలస మీదగా కింజరాపువారిపేట వరకు సాగింది.

అక్కడ నుంచి తోటాడ, కొండలక్కవలస, వెదుళ్లవలస, వెదుళ్లవలస జంక్షన్, మొగలిపేట, గంగివలస, చల్లవలస, అంబీరుపేట, గాతలవలస జంక్షన్ మీదగా సుసరాం, ప్రియాగ్రహారం, బెలమర, సత్తరపుపేట, పిన్నింటిపేట వరకు సాగింది. ఆ తర్వాత గాతలవలస, పేరువాడ, పాత జాడూరు, చిన జాడూరు మీదగా నరసన్నపేటకు చేరుకుంది. పార్టీ అభ్యర్థి ధర్మాన రాందాస్ అత్తవారి గ్రామమైన ఈదులవలసతోపాటు వెదుళ్లవలస జంక్షన్, సుసరాం, ప్రియాగ్రహారం, పిన్నింటిపేటల్లో ప్రజలనుద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. అడుగడుగునా ప్రజలను పలకరిస్తూ, కష్టసుఖాలు తెలుసుకుంటూ, అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బెలమర గ్రామ పొలిమేరలో పొలంలో దుక్కి దున్నుతున్న చింతు సీతారాం వద్దకు వెళ్లి వ్యవసా యం గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడే జగన్‌మోహన్ రెడ్డి హలం పట్టి కాసేపు పొలం దున్నడం స్థానికులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.

సుసరాం గ్రామంలో రోడ్డుపక్క నిలబడ్డ సుమారు 40 మంది విద్యార్థుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరికి ముద్దుపెట్టి ఆశీర్వదించారు. జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు రోజుల పర్యటనలో ఇటువంటి అపురూప దృశ్యాలు.. అద్భు త అనుభవాలు ఎన్నో. మహిళలు, వృద్ధులు, వికలాంగులు, ఉపాధి కూలీలు, రైతులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థులతో మమేకమైన జగన్‌మోహన్‌రెడ్డి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఎండలు మండిపోతున్నా .. దారిపొడవునా తన కోసం ఎదురుచూసినవారందరినీ ఆప్యాయంగా పలకరిం చారు. వృద్ధులను అక్కున చేర్చుకున్నారు. వికలాంగుల వెన్నుతట్టి ఆర్థిక సాయం చేసి భరోసా ఇచ్చారు. ఆయన హామీలతో ఉబ్బితబ్బిబ్బైన ప్రజలు చివరికంటా అండగా ఉంటామని మాటిచ్చారు.

ఈ నాలుగు రోజుల్లో సుమారు 300 కిలోమీటర్ల పరిధిలోని 60 పంచాయతీల్లో ప్రచారం చేశారు. పలు గ్రామాల్లో పార్టీ పతాకావిష్కరణలు, వైఎస్‌ఆర్ విగ్రహావిష్కరణలు చేశారు. జననేతను చూసి పల్లెలు పులకించా యి. ఆయనలో దివంగత రాజన్నను చూసుకుని మురిసిపోయాయి. ఆయ న వెంట పోటీ పడి పరుగులు తీశా యి. ప్రతిచోటా తిలకం దిద్ది, హారతులిచ్చి నీరాజనాలు పట్టాయి. నాలుగు రోజుల పర్యటనకు ప్రధానంగా మహిళల నుంచే విశేష ఆదరణ లభించింది. జగన్‌మోహన్‌రెడ్డితో కరచాలనం చేసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించేందుకు వృద్ధులతో సహా మహిళలు పోటీ పడ్డారు. కాగా తొలిరోజు వందలాది మోటారు సైకిళ్లతో మడపాం గ్రామం వద్ద జననేతకు యువకులు ఘన స్వాగతం పలికిన రీతిలోనే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోనూ స్వాగత సత్కారాలు లభించాయి.

పారని ప్రత్యర్థుల పాచికలు
ఇప్పటికే విజయంపై ధీమాతో ఉన్న నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు జగన్‌మెహన్‌రెడ్డి పర్యటన దిగ్విజయం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తున్నా యి. అందరిలోనూ అదే విశ్వాసం తొణికిసలాడుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు పట్టున్న గ్రామాల్లోనూ జననేత పర్యటన ఊహించని దానికంటే విజయవంతమైంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పట్టున్న కిళ్లాం గ్రామంలో ప్రజల స్పందన అనూహ్యం. నరసన్నపేటతో పాటు జలుమూరు, పోలాకి, సారవకోట మండలాల్లో జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలు కురిపించిన ఆదరణ ఆ రెండు పార్టీలను ఇరకాటంలో పడేసింది. నిరంతరం అవినీతి ఆరోపణలతో మభ్యపెట్టేందుకు తెలుగుదేశం చేస్తున్న ప్రయత్నాలు, అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ చూపే ప్రలోభాలు ప్రజలను ఏమాత్రం ఏమార్చలేకపోయాయి. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సాగుతున్న సమయంలోనే రెండు రోజుల క్రితం ప్రభుత్వం దీపం గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయగా, ఒకటి కాదు నాలుగు కనెక్షన్లు ఇచ్చినా మా ఓటు జగన్‌మోహన్‌రెడ్డికే అని పలువురు బాహటంగా చెప్పడం విశేషం. జననేత పర్యటనకు జనం హాజరుకాకుండా అదుపు చేసేందుకు ప్రత్యర్థి పార్టీలు చేసిన ప్రయత్నాలన్నీ నీరుగారిపోయాయి.
Share this article :

0 comments: