సముద్రం సంభ్రమపడింది.. తీరంలో జన ఘోష విని కెరటాల కరాలతో కేరింతలు కొట్టింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సముద్రం సంభ్రమపడింది.. తీరంలో జన ఘోష విని కెరటాల కరాలతో కేరింతలు కొట్టింది

సముద్రం సంభ్రమపడింది.. తీరంలో జన ఘోష విని కెరటాల కరాలతో కేరింతలు కొట్టింది

Written By news on Friday, April 20, 2012 | 4/20/2012

గంగపుత్రుల సంతోషం చూసి సంబరాలు చేసుకుంది. పల్లె పరుగు తీసింది. మనసున కొలువైన మారాజు మనింటికి వచ్చాడని ఉల్లాసంతో గంతులేసింది. మత్స్యకారుడి మనసు మురిసిపోయింది. ఆటుపోట్ల బతుకున ఆసరాగా నిలబడతానని సాగరం సాక్షిగా చెప్పిన సాహసిని చూసే అవకాశం దక్కుతోందని ఉద్వేగంతో ఉప్పొంగిపోయింది. నెత్తిన ఎండ మండిపోతున్నా, వడగాడ్పులు జోరున వీస్తున్నా.. బంగారమ్మపాలెం నుంచి రాజయ్యపేట వరకు వాడవాడా ఓపిగ్గా నిరీక్షించింది. కష్టాల కడలిలో సాగే జీవితాల్ని గట్టెక్కిస్తానన్న మాట ఇచ్చే మననేత అతడేనని వేల గళాలతో ఎలుగెత్తింది. 

ఓ అయ్య.. ఓ అవ్వ.. ఓ అక్క.. ఓ అన్న.. అక్కడ చెల్లి.. ఇక్కడ తల్లి.. ఆ మూల కదలలేని నిస్సహాయుడు.. ఆ పక్క నిలబడ్డ వృద్ధుడు.. వారేమిటి? వీరేమిటి? అందరి హృదయాల్లో ఉప్పొంగిన ఆదరణ వరదై, వెల్లువై పల్లెలను ముంచెత్తింది. విశ్వసనీయతకు పట్టం కట్టాలన్న జగన్నినాదం ఎదఎదనా ప్రతిధ్వనించింది. 

విశాఖపట్నం, న్యూస్‌లైన్: కడలి అలలు ఉప్పొంగాయి. జన నేతను కళ్లారా చూసేందుకు మత్స్యకార పల్లెలు పరుగులు తీశాయి. చేపల వేటకు సెలవిచ్చి స్వాగతించాయి. ఉదయం నుంచే రోడ్లపై బారులు తీరాయి. భానుడి భగభగలు.. అభిమాన జనం ముందు చిన్నబోయాయి. జనావాసాలైన ఇళ్లు.. జనాలను నెత్తినెక్కించుకుని సేద తీరాయి. అడుగడుగునా.. అభిమానం అక్కున చేర్చుకుంది. ఎంతగానంటే.. రేవుపోలవరంలో ప్రవేశించాక సభాస్థలికి చేరుకునేందుకు గంటకు పైగా సమయం పట్టేంత..! చిన్న కుర్రాడు.. చాలా కష్టపడుతున్నాడని.. ఓ తాత ఆవేదన.. సల్లగుండు నాయనా.. అంటూ అవ్వ ఆశీర్వాదం.. జగనన్నా నీదే విజయమంటూ.. చెల్లెళ్ల అభిమానం.. నీ వెంట మేమున్నామంటూ ఉరకలెత్తే యువత ఉత్సాహం.. పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఎస్.రాయవరం మండలంలోని మత్స్యకార పల్లెలు అభిమానంతో ముంచెత్తాయి.

పల్లెకు పండుగ : పాయకరావుపేటలోని మత్స్యకార గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన నేతను కళ్లారా చూసేందుకు బంధుమిత్ర సపరివార సమేతంగా ఎదురుచూసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయున్ని అక్కున చేర్చుకుంది. ప్రస్తుతం వేట నిషేధమైనప్పటికీ సంప్రదాయ పడవలకు అలాంటి నిబంధనలేమీ లేవు. 

అయినా.. సంప్రదాయ మత్స్యకార కుటుంబాలు చేపల వేటకు విరామమిచ్చాయి. జై జగన్.. జైజై.. జగన్ అన్న నినాదాలతో మారుమోగాయి. పదం కదిపి.. కదం తొక్కు తూ.. పరుగులెట్టాయి. డప్పుల మేళాలు.. ఆనంద నృత్యాలతో సంబరాల వాతావరణాన్ని ప్రతిబింభించాయి. ఓ దశలో ఉప ఎన్నికల్లో పాయకరావుపేట బరిలో నిలిచిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొల్ల బాబూరావు కూడా జనాలతోపాటే డ్యాన్స్ చేశారు. 

జన నీరాజనం : కశింకోట ఆర్‌ఈసీఎస్ అతిథి గృహం వద్ద పార్టీ గౌరవాధ్యక్షురాలు, దివంగత మహానేత సతీమణి, తన తల్లి అయిన వై.ఎస్.విజయమ్మ 56వ జన్మదిన వేడుకల్లో పాల్గొని బంగారమ్మపాలెం బయలుదేరారు. అక్కడి నుంచి చిన ఉప్పలాం మీదుగా రేవుపోలవరం చేరుకున్నారు. తర్వాత చిన్న పోలవరం, గుడివాడ కూడలి, గుర్రాజుపేట, చినతీనార్ల, పెద తీనార్ల, దొండవాక, రాజయ్యపేట వెళ్లారు. అడుగడుగునా.. జనాలు రోడ్లపై బారులు తీరారు. 

చాలా చోట్ల జనాలతో రోడ్లు కొలువుదీరాయి. జగన్‌తో కరచాలనం చేసేందుకు యువత పోటీపడింది. బైక్‌లు, ఆటోలు, వ్యాన్లు, కార్లలో ఆయనవెంట ఆప్యాయంగా పరుగు తీసింది. బంగారమ్మపాలెంలో మైకందుకుని మరీ వికలాంగుడైన కాశీరావు జగన్‌పై అభిమానం కురిపించాడు. తనలాంటి వికలాంగుల్ని కన్న తల్లిదండ్రులకు భరోసా నీవేనంటూ.. కొనియాడారు.

మిన్నంటిన కరతాళ ధ్వనులు
జగన్ ప్రసంగం అభిమానుల్లోను, పార్టీ శ్రేణుల్లోను ఆనందం వెల్లువెత్తించింది. అవ్వా...తాతా అంటూ ఆయన పలకరింపునకు జనం పులకించిపోయారు. ఉప ఎన్నికల వెనుకనున్న కుట్రలను ఆయన వివరిస్తుంటే.. అధికార, విపక్షనేతల్ని జనం తిట్టుకున్నారు. దివంగత నేత నింగి నుంచి చూసి గర్వపడేలా సువర్ణపాలన అందిస్తానంటే ఈలలు, కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఎంతమంది, ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా.. రానున్న కాలం మనదేనన్న భరోసాను అభిమానుల్లో క లిగించింది. పూల దండలు, పుష్పగుచ్చాలతో జనాలు ఆదరించారు. ఆయన చెప్పే ప్రతి మాటకూ పులకరించారు. తమ పిల్లల బంగరు భవితకు ఆయన అందించనున్న వరాలను తలచుకుని మరీ మురిసిపోయారు.
Share this article :

0 comments: