నాలుగు రోజుల పాటు పోలవరం నియోజకవర్గంలో రోడ్‌షో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాలుగు రోజుల పాటు పోలవరం నియోజకవర్గంలో రోడ్‌షో

నాలుగు రోజుల పాటు పోలవరం నియోజకవర్గంలో రోడ్‌షో

Written By news on Saturday, April 21, 2012 | 4/21/2012

 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి శనివారం నుంచి మలి విడత జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల మొదటివారంలో ఆయన నర్సాపురం నియోజకవర్గంలో మూడు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాలుగు రోజుల పాటు పోలవరం నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. పోలవరం మండలంలోని గూటాల నుంచి ఆయన రోడ్ షోను ప్రారంభించనున్నారు. 24వ తేదీ వరకూ పోలవరం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఆ తర్వాత 25, 26 తేదీల్లో నర్సాపురం నియోజకవర్గంలో మిగిలిపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తారు. జగన్‌మోహన్ రెడ్డి ఉప ఎన్నికలు జరగనున్న ఈ రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన కన్నా ముందుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రెండు రోజులు అక్కడ విస్తృతంగా పర్యటించారు. 

జగన్ పర్యటన నేపథ్యంలోనే పూర్తిగా నీరుగారిపోయిన కాంగ్రెస్ క్యాడర్‌కు కొంతైనా ఊపునిచ్చేందుకు గురువారం ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వాయలార్ రవి కొయ్యలగూడెంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికలు జరిగే ఈ రెండు నియోజకవర్గాల్లో పరిస్థితి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బెంబేలెత్తుతున్నాయి. పైకి గెలుస్తామని మేకపోతు గాంభీర్యంతో చెబుతున్నా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను ఎలా అడ్డుకోవాలో తెలియక ఆ పార్టీ నేతలు సతమతమవుతున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఆందోళన చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోంది.

ఆయన రెండు రోజుల పర్యటనలో జగన్‌మోహన్‌రెడ్డ్డిపైనా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపైనా గతంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఆయన తిట్ల దండకాన్ని చూసి తెలుగుదేశం పార్టీ నేతలే అవాక్కయ్యారు. ఆయన రోడ్ షోల్లో హడావుడి, ఆర్భాటం తప్ప జనం స్పందన పెద్దగా కనిపించలేదు. దీంతో బాబులో అసహనం మ రింత పెరిగిపోయింది. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మంత్రి వచ్చినా పోలవరం నియోజకవర్గంలో ఆ పార్టీలో చలనం కనిపించలేదు. జనమంతా జగన్ వెంటే వెళతున్నారని ఆ పార్టీ సమావేశానికి వచ్చినవారే స్పష్టంగా చెబుతుండడంతో కాంగ్రెస్ నేతలు ఇబ్బందిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఈ నేపథ్యంలో శనివారం నుంచి జగన్‌మోహన్‌రెడ్డి ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పర్యటించనుండడంతో ఆయా పార్టీల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. తొలి విడత పర్యటనలో రాజకీయ ఉద్ధండుడు చేగొండి హరిరామజోగయ్య, మాజీ ఎమ్మెల్యేలు అల్లు వెంకట సత్యనారాయణ, కూనపురెడ్డి రాఘవేంద్రరావు (చినబాబు), కీలక నేతలు తోట గోపి, శ్రీరామ్‌రెడ్డితోపాటు అనేక మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా జరగనున్న పర్యటనలో కూడా పలువురు కీలక నేతలు ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. కాగా శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో జిల్లాలోకి ప్రవేశించిన జగన్‌మోహన్‌రెడ్డికి కొవ్వూరు వద్ద పార్టీ నాయకులు సాదర స్వాగతం పలికారు. 12 గంటల సమయానికి పోలవరం మండలం గూటాల చేరుకుని సింహాద్రి వీరభద్రరావు ఇంట్లో బస చేశారు.
Share this article :

0 comments: