మద్యం కేసును మాఫీ చేయించిన సోనియా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మద్యం కేసును మాఫీ చేయించిన సోనియా

మద్యం కేసును మాఫీ చేయించిన సోనియా

Written By news on Wednesday, April 18, 2012 | 4/18/2012

మద్యం ముడుపుల కేసును సోనియాగాంధీ మాఫీ చేయించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లోని అసలు దొంగలు బయటపడతారని సోనియా, గులాంనబీ అజాద్ ద్వారా మద్యం కుంభకోణాల దర్యాప్తును అడ్డుకున్నారన్నారు. ఈ కేసును చిత్తశుద్ధితో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఎస్పీ శ్రీనివాసరెడ్డిని రాత్రికి రాత్రి ప్రభుత్వం బదిలీ చేసిందన్నారు. ఆయన బదిలీపై హైకోర్టు అక్షింతలు వేసినా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించకపోవడం శోచనీయమన్నారు.అధికార పార్టీకి చెందిన రాజకీయ తిమింగలాలు రూ. 90 వేల కోట్ల విలువైన మద్యాన్ని లెసైన్స్ లేకుండా షాపులలో అమ్మేస్తున్నారని ఆరోపించారు.
Share this article :

0 comments: