ఇప్పుడు వయలార్ ‘పంచకర్మ వైద్యం’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇప్పుడు వయలార్ ‘పంచకర్మ వైద్యం’

ఇప్పుడు వయలార్ ‘పంచకర్మ వైద్యం’

Written By news on Saturday, April 21, 2012 | 4/21/2012

18 స్థానాల్లో ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు ‘పెద్దకర్మ’ తథ్యం 
వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు

గుంటూరు, న్యూస్‌లైన్: ‘కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో పార్టీని బతికించడానికి పరి శీలకునిగా కేంద్రమంత్రి వయలార్ రవిని పంపిందంట! అసలు ప్రస్తుతం ఆ పార్టీ ఇంకా బతికేఉందా? దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణం తోనే కాంగ్రెస్ జీవం కోల్పోయింది.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు చెప్పారు. ఆయన గుంటూరులో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. నేడు రాష్ట్రంలో అవసానదశలో ఉన్న కాంగ్రెస్ సమర్థ నాయకత్వాన్ని కోల్పోయిందని.. ఈనేపథ్యంలోనే అధిష్టానం వయలార్ రవిని పంపినట్లు చెప్పారు.ఆయన వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్నాయన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతోందంటే.. ఆనాడు వైఎస్ పాదయాత్ర, బస్సుయాత్రల ద్వారా కష్టపడి తెచ్చిపెట్టిన భిక్షేనని గుర్తుచేశారు. ఆయన హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం వైఖరికి క్షోభపడి.. ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొన్న తర్వాతనే జగన్ ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చారని అంబటి వివరించారు. వాయలార్ రవి లాంటి సీనియర్లు ఎంతమంది వచ్చినా.. కాయకల్ప, పంచకర్మ వైద్యాలు చేసినా ప్రయోజనం లేదని విమర్శించారు. రానున్న 18 స్థానాల్లో ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెద్దకర్మ పెట్టడం తథ్యమని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ పెద్దలకు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధం..

ఉప ఎన్నికల్లో పోటీచేసే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు ఎందుకు రాజీనామాలు చేయాల్సివచ్చిందో అడగాలని ఇటీవల రాష్ట్ర పర్యటనలో వయలార్ రవి పిలుపు నివ్వడం దారుణమన్నారు. భవిష్యత్‌లో అవే నియోజకవర్గాల్లోకి వెళ్లిన కాంగ్రెస్ పెద్దల్ని మీరెందుకు వైఎస్‌ను విమర్శిస్తారంటూ? ప్రజలు నిలదీసి బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ‘సాక్షి’ ఛానెల్‌తో వయలార్ మాట్లాడేటప్పుడు పక్కనే ఉన్న మంత్రి ఒకరు అడ్డుకోవడం సిగ్గుమాలినచర్యగా పేర్కొన్నారు. ఒకప్పుడు అదే ‘సాక్షి’పత్రిక, చానెల్ కాంగ్రెస్‌ని అధికారంలోకి తేవడంలో కీలకపాత్ర పోషించాయన్న సంగతి మరిచారని దుయ్యబట్టారు. 

బాబు చీకటి బతుకులు అందరికీ తెలుసు..

ఓ హోటల్‌లో వాయలార్ రవిని జగతి పబ్లికేషన్ ఆడిటర్ విజయసాయిరెడ్డి కలిశారని టీడీపీ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణ ఆరోపించడంలో అర్థం లేదని అంబటి కొట్టిపారేశారు. చీకట్లో ఢిల్లీ వెళ్లి అహ్మద్‌పటేల్, ప్రణబ్‌ముఖర్జిని కలిసి వాపోయిన ఘనత తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. బాబు చీకటి రాజకీయ బతుకులు అందరికీ తెలిసినవేనని.. గాలి, బొజ్జలకు పచ్చకామెర్లు వ్యాధిసోకినట్లు అంబటి అనుమానం వ్యక్తంచేశారు.
Share this article :

0 comments: