దుర్బుద్ధితో ప్రభుత్వం విద్యుత్ సరఫరాను నిలిపివేసిందని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దుర్బుద్ధితో ప్రభుత్వం విద్యుత్ సరఫరాను నిలిపివేసిందని

దుర్బుద్ధితో ప్రభుత్వం విద్యుత్ సరఫరాను నిలిపివేసిందని

Written By news on Thursday, April 19, 2012 | 4/19/2012

జనం తనను చూడకూడదని, టీవీ ల్లో ప్రత్యక్ష ప్రసారమవుతున్న నరసన్నపేట బహిరంగ సభను తిలకించే అవకాశం ఇవ్వకూడదన్న దుర్బుద్ధితో ప్రభుత్వం విద్యుత్ సరఫరాను నిలిపివేసిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కరెంటు లేకపోయినా, నడిరోడ్డు అని తెలి సినా, కష్టమనుకున్నా, రాత్రైనా, అవసరం లేకపోయినా, పిల్లలను సైతం చంకన పెట్టుకుని తన కోసం ఎదురుచూసిన ప్రజల ఆదరాభిమానాలు ఉన్నంతకాలం కుట్రలు, కుతంత్రాలు ఏం చేయలేవని స్పష్టం చేశా రు. నరసన్నపేట ఉప ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన బుధవారం ఈదుల వలస, వెదుళ్లవలస, గాతవలస జంక్షన్, ప్రియాగ్రహారం, పిన్నింటిపేటల్లోను, నరసన్నపేట బహిరంగ సభలోను వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 

దివంగత నేత వైఎస్‌ఆర్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం అడుగడుగునా కుట్రలు, కుతంత్రాలకు దిగుతోందని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ను ప్రజల హృదయాల నుంచి ఎలా తీసేయా లి.. ఆయన్ను ఏ విధంగా అప్రతిష్టపాలు చేయాలన్నదానిపై మంత్రివర్గ సమావేశం లో చర్చించారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చునన్నారు. దివంగత నేత వైఎస్‌ఆర్ పైనుంచి ఇదంతా చూస్తే ఇలాంటి పార్టీ కోసం పనిచేశానా అని ఆవేదన చెందుతారని అన్నారు. గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయా లు సరైనవిగా, చనిపోయిన వైఎస్‌ఆర్ తీసుకున్న నిర్ణయాలు మాత్రం తప్పన్న ధోరణి తో ఈ ప్రభుత్వం ముందుకు వెళుతోందని విమర్శించారు.

చంద్రబాబుకో న్యాయం, దివంగత వైఎస్‌ఆర్‌కు మరో న్యాయమా? అని జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌పై నిందలు వేయడమే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తోందని మండిపడ్డారు. నిరుపేదలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా పట్టించుకోలేదని, ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ఉద్దేశంతో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన ధర్మాన కృష్ణదాస్ గొప్ప నాయకుడని కొనియాడారు. నిజాయతీ రాజకీయాల కోసం, రాజకీయాలకు విలువలు తీసుకొచ్చేందుకు, రైతులకు అండగా నిలిచేందు కు, పేదలకు తోడుగా ఉండేందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా పదవి కోల్పోయిన కృష్ణదాస్‌ను రానున్న ఎన్నికల్లో గెలిపించుకోవాలని కోరారు. ఉప ఎన్నికల్లో వేసే ఓటు పేదలు, రైతులకు వేసేదవుతుందని వివరించారు.

అధికారంలోకి వస్తే పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం
అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాల లన్నింటిలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని ఎన్నికల ప్రచారంలో తనను కలి సిన మహిళలతో మాట్లాడుతూ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పిల్లల్ని చదివించి ఇంజినీర్లు, డాక్టర్లుగా చేస్తామని, అమ్మ ఒడి పథకం ద్వారా ఆడపిల్లకు రూ.500 చొప్పున తల్లులకు అందజేస్తామ ని, వికలాంగులకు రూ.1000, వృద్ధులకు రూ.700 చొప్పున పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు.
Share this article :

0 comments: