హెరిటేజ్ పాలతో కేన్సర్ ముప్పు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హెరిటేజ్ పాలతో కేన్సర్ ముప్పు!

హెరిటేజ్ పాలతో కేన్సర్ ముప్పు!

Written By news on Tuesday, April 9, 2013 | 4/09/2013

వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు ఆరోపణ
హెరిటేజ్ పాల వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కేరళ ప్రభుత్వం హెచ్చరించింది
దానిపై మన రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఈగ వాలకుండా ఈ ప్రభుత్వం కాపలా కాస్తోంది


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ కంపెనీ పాలల్లో విషపూరితమైన రసాయనాలున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు ఆరోపించారు. హెరిటేజ్ సంస్థ అమ్మేది పాలు కాదని, విషమని, వాటి ద్వారా కేన్సర్ వస్తుందని కేరళ ప్రభుత్వం నిరూపించి, ఒక గెజిట్ కూడా విడుదల చేసిందని ఆయన వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హెరిటేజ్ పాలల్లో ఫార్మాలిన్ అనే కేన్సర్ కారక కెమికల్‌ను కలుపుతున్నట్లు కేరళ ఫుడ్ సేఫ్టీ సంస్థ నిర్ధారిస్తూ 2012 ఆగస్టు 24న నోట్ విడుదల చేసిందని, దాని ఆధారంగా 2012 సెప్టెంబర్ 18న హెరిటేజ్ పాలను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం గెజిట్ జారీ చేసిందన్నారు. కేరళ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను జూపూడి మీడియాకు అందజేశారు. హెరిటేజ్ పాల ప్రధాన కార్యాలయం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆ పాలు మంచివా లేక కేన్సర్ కలిగించేవా అన్న విషయంలో ఎందుకు విచారణకు ఆదేశించడంలేదని ప్రశ్నించారు.

రెండువైపులా దోచుకుంటున్నారు..ఫార్మాలిన్ అనే విషం కలిపిన పాలను రెండు దశాబ్దాలకు పైగా హెరిటేజ్ అమ్మడం వల్ల రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది కేన్సర్ బారిన పడ్డారన్నది లెక్క తేలాల్సి ఉందని జూపూడి పేర్కొన్నారు. హెరిటేజ్ విష పాల ద్వారా కేన్సర్ సోకిన వారికి చికిత్స నిమిత్తం బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి రెండు వైపులా దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు కంపెనీ సురక్షితమైన పాలను అమ్ముతుందని తేలే వరకూ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లో హెరిటేజ్ పాలను నిషేధించాలని కోరారు. హెరిటేజ్ పాలపై రాష్ట్రంలోని ఫుడ్ సేఫ్టీ అథారిటీకి త్వరలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ప్రజల కోసం వైఎస్ ఆరోగ్యశ్రీ పెడితే.. బాబు తన వ్యాపారం కోసం కేన్సర్‌శ్రీ పెట్టారని జూపూడి ఎద్దేవా చేశారు. 

హెరిటేజ్‌లో పనిచేసే కార్మికులకు భద్రత కూడా ఉండదని, విశాఖలోని ఆ సంస్థ శీతల గిడ్డంగిలో పనిచేస్తున్న ముగ్గురు కాంట్రాక్టు కార్మికులు మృత్యువాత పడ్డారని చెప్పారు. తమను ఆదుకోవాలని బాధితుల బంధువులు యాజమాన్యం వద్దకు వెళితే రాష్ట్ర ప్రభుత్వం హెరిటేజ్‌కు రక్షణ కవచంగా పోలీసులను ఉంచి కార్మికులను తరిమికొట్టించిందన్నారు. చంద్రబాబుపై ఈగ వాలకుండా ప్రభుత్వం తన ముద్దుబిడ్డగా చూసుకుంటోందని, అందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాబు తన భుజాలపై మోస్తున్నారని ఆరోపించారు. వీరిద్దరూ లాలూచీ పడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: