టీడీపీ అధినేత దన్నుతోనే కిరణ్ సర్కారు బాదుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ అధినేత దన్నుతోనే కిరణ్ సర్కారు బాదుడు

టీడీపీ అధినేత దన్నుతోనే కిరణ్ సర్కారు బాదుడు

Written By news on Thursday, April 11, 2013 | 4/11/2013

* ఆ ధీమాతోనే.. ఏడాదిలో ఎన్నికలున్నా ఎడాపెడా పన్నులు..
* మూడేళ్లుగా ప్రజలపై కనీవినీ ఎరగని స్థాయిలో భారం
* కరెంటు చార్జీల బాదుడే ఏకంగా రూ. 32 వేల కోట్లు!..
* పదేపదే ఆర్టీసీ చార్జీల పెంపు, ప్రతి రంగంపైనా వ్యాట్ వడ్డింపు
* రిజిస్ట్రేషన్ల విలువలూ పెంచేసి ఖజానా నింపుకుంటున్న వైనం
* ఈ నిర్ణయాల వెనుక దాగున్న ధీమా... బాబు మద్దతే..
* ప్రధాన ప్రతిపక్షం అండతో నడుస్తున్న మైనారిటీ సర్కారు
* మూడేళ్ల నుంచి అన్నింటా అంటకాగుతున్న కాంగ్రెస్-టీడీపీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు బదలాయించుకున్న రెండు పార్టీలు
* స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోరులో టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు
* అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ అదే ధోరణి పునరావృతం
* ఎఫ్‌డీఐలపై ఓటింగ్ నుంచి యూపీఏకు మద్దతుగా టీడీపీ గైర్హాజరు
* కాంగ్రెస్ పెద్దలతో ఢిల్లీలో టీడీపీ అధ్యక్షుని చీకటి చర్చలు
* అవిశ్వాస గండం నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించిన బాబు
* ప్రతిగా ఐఎంజీ, ఎమ్మార్ కేసుల నుంచి బాబుకు అభయ‘హస్తం’
* విలువైన అమీర్‌పేట భూములు బాబు అస్మదీయునికి ధారాదత్తం
* వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో కాంగ్రెస్, టీడీపీలకు ముచ్చెమటలు
* మూడో ‘శక్తి’ని అణచేయడమే ఎజెండాగా ఉమ్మడి కుట్రలు
* ఆ క్రమంలో జగనే లక్ష్యంగా కుమ్మక్కు రాజకీయాలు

 రాష్ట్ర శాసనసభకు సాధారణ ఎన్నికలు ఏడాది దూరంలోనే ఉన్నాయి. ఎంతటి కర్కోటక ప్రభుత్వమైనా ఇలాంటి సమయంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేందుకు అంతగా సాహసించదు. కానీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అనునిత్యం అక్షరాలా జనం గోళ్లూడగొడుతున్నారు. అడ్డగోలు పన్నులు, విచ్చలవిడిగా చార్జీల పెంపులతో వారిపై పెను భారం మోపుతున్నారు. వీటి వెనక కిరణ్‌కున్న ధైర్యమేమిటి? ఏ ధీమాతో ఆయన ఇందుకు సాహసిస్తున్నారు? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇదే ఇప్పుడు హాటెస్ట్ టాపిక్‌గా మారింది. బలమైన కారణం లేకుండా ఎవరూ ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోరు. కిరణ్ విషయంలో ఆ ‘బలం’ స్వయానా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడేనన్న వాదన సర్వత్రా విన్పిస్తోంది. బహిరంగంగా, లోపాయకారీగా బాబు అందిస్తున్న పరిపూర్ణ మద్దతు సాయంతోనే కిరణ్ ఇంత ధైర్యంగా ‘ముందుకెళ్తున్నార’న్నది బహిరంగ రహస్యమేనంటున్నారు! చంద్రబాబు సంపూర్ణ సహకారం, ‘తెర వెనక మద్దతు’ కారణంగా ప్రభుత్వం ఇప్పట్లో పడపోయే ఆస్కారం లేదనే ధైర్యమే సీఎం తీసుకుంటున్న ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయంలోనూ ప్రతిఫలిస్తోందంటే అతిశయోక్తి ఏ మాత్రమూ కాబోదు. ఇది పూర్తిగా నిజమని బాబు వ్యవహార శైలి కూడా ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే వస్తోంది. 


Share this article :

0 comments: