షరతులు లేకుండా హెల్త్‌కార్డులివ్వాలి: వైఎస్సార్‌సీఎల్పీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షరతులు లేకుండా హెల్త్‌కార్డులివ్వాలి: వైఎస్సార్‌సీఎల్పీ

షరతులు లేకుండా హెల్త్‌కార్డులివ్వాలి: వైఎస్సార్‌సీఎల్పీ

Written By news on Wednesday, April 10, 2013 | 4/10/2013

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు షరతులు లేకుండా హెల్త్‌కార్డులు జారీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే హెల్త్‌కార్డుల ద్వారా అవుట్ పేషేంట్ సౌకర్యం కల్పించాలని, రూ.2లక్షల వ్యయ పరిమితిని ఎత్తివేయాలని కోరింది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి, కార్యదర్శి తెల్లం బాలరాజు, కార్యవర్గసభ్యులు గొల్ల బాబురావు లు సంయుక్తంగా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా హెల్త్‌కార్డుల పథకాన్ని అమలుచేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు హామీ ఇచ్చి, అందుకు భిన్నంగా ఈ పథకానికి తూట్లు పొడ వడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. 

మెరుగైన విద్య, వైద్యం ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రభుత్వ పథకాలను సక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకే నిబంధనల సాకుతో అందించకపోవడం శోచనీయమని విమర్శించారు. ఉద్యోగులకే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందనేది అర్థమవుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులలో రోగనిర్ధారణ పరీక్షలు చేయడానికి తగిన సౌకర్యాలు లేవని, కనుక వాటికి తగినన్ని నిధులిచ్చి ఆధునిక సౌకర్యాలు కల్పించి, ఖాళీగా ఉన్న వైద్యుల నియామకం భర్తీ చేసిన తర్వాతనే ఉద్యోగులను ప్రభుత్వాసుపత్రులకు అవుట్‌పేషెంట్ సేవలను సిఫార్సు చేయాలని అప్పటివరకు ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి పట్టుదలకు వెళ్లి తెలుగువారికి ప్రీతిపాత్రమైన ఉగాది పండుగను చేదుగా మిగల్చవద్దని విన్నవించారు. ఉద్యోగులకు జారీచేస్తున్న హెల్త్‌కార్డులపై ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు నిబంధనలను సడలించకపోతే... ఉద్యోగులు చేసే న్యాయమైన ఆందోళన కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతునిస్తుందని వారు తెలిపారు.
Share this article :

0 comments: