ప్రజల బాధలు తెలిసిన ప్రజానాయకుడు జగన్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజల బాధలు తెలిసిన ప్రజానాయకుడు జగన్!

ప్రజల బాధలు తెలిసిన ప్రజానాయకుడు జగన్!

Written By news on Monday, June 17, 2013 | 6/17/2013


వృద్ధులకు, వికలాంగులకు, విద్యార్థులకు, మహిళలకు, వితంతువులకు వీరందరికీ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తొమ్మిది కోట్ల తెలుగు ప్రజలహృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ముఖ్యమంత్రి ఒక్క వైయస్సార్ మాత్రమే. ఆయన అకాల మరణం తర్వాత తమకిక అండగా నిలబడే నాయకుడు ఎవరని రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన తనయుడు జగన్‌గారు ఆశాదీపంలా కనిపించారు.

వైయస్సార్‌గారే వై.యస్. జగన్ రూపంలో మళ్లీ ప్రజల మధ్యకు వచ్చినట్లు అనిపించింది. ప్రముఖ రాజనీతి తత్వవేత్త అరిస్టాటిల్ తన ‘పాలిటిక్స్’ గ్రంథంలో ఇలా అంటారు: ‘నిత్యం ప్రజల మధ్య ఉండటం; వారి సమస్యలు, బాధలు తెలుసుకుని పరిష్కరించటమే నిజమైన నాయకుడి ప్రథమ లక్షణం’. ప్రజల కన్నీళ్లు, బాధలు, ఆలోచనలు... ప్రజల మధ్య నుండి వచ్చినవారికే తెలుస్తాయి. కనుకనే జగన్‌గారు ప్రజాబంధువు అయ్యారు. తన తండ్రి మరణవార్త విని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చటానికి ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఆయనకు ఉన్న ప్రజాదరణ ఎంతటిదో ఈ పాలక, ప్రతిపక్షాలకు అర్థమై, భయం పట్టుకుంది. అందుకే ఆ రెండు పార్టీలూ కుమ్మక్కై ఆయన్ని జైలుపాలు చేశాయి. బెయిలు కూడా రాకుండా అడ్డుకుంటున్నాయి.

ఈ కుటిల వ్యూహాలను, స్వార్థ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. అందుకే పాలక పక్షానికి, దాని చెయ్యి అందుకున్న ప్రతిపక్షానికి తగిన బుద్ధి చెప్పటానికి ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. 2014 ఎన్నికలలో జగన్ నాయకత్వంలోని వై.యస్ ఆర్. కాంగ్రెస్‌పార్టీ ఆంధ్రరాష్ర్టమంతా విజయకేతనం ఎగురవేయటానికి సిద్ధంగా ఉంది. అందుకు నిదర్శనం షర్మిలమ్మగారు చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటమే. జగన్‌గారు త్వరలో ప్రజల మధ్యకు రావాలని, ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించా లని కోరుకుంటున్నాం.

- మందా భిక్షంరాజు, శక్తినగర్, ఇబ్రహీంపట్నం, కృష్ణాజిల్లా
Share this article :

0 comments: