ఓట్ల కోసమే సబ్‌ప్లాన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓట్ల కోసమే సబ్‌ప్లాన్

ఓట్ల కోసమే సబ్‌ప్లాన్

Written By news on Friday, June 21, 2013 | 6/21/2013

సంక్షేమం మాటల్లో కాదు.. చేతల్లో చూపండి
రెండేళ్లలో ఒక్క పెన్షన్, రేషన్‌కార్డు అయినా ఇచ్చారా?

 రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల కోసమే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తెచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆరోపించారు. దళితులు వైఎస్సార్‌సీపీ వెంట ఉన్నారన్న దుగ్దతో హడావుడిగా ఈ చట్టం తెచ్చారే తప్ప వారిపై ప్రేమతో కాదని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని అప్పుడే మిమ్మల్ని(ప్రభుత్వాన్ని) అభినందిస్తారని అన్నారు. సబ్‌ప్లాన్ కేవలం 10 సంవత్సరాలకే పరిమితి చేయడం ఏమిటని ప్రశ్నించారు. గురువారం శాసనసభలో సంక్షేమ శాఖల పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందే కానీ పథకాల అమలు ఎక్కడా సజావుగా సాగడం లేదని విమర్శించారు. 

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి బడుగు బలహీనవర్గాలను ఆదుకోవడానికి పలు పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం వల్ల వారి హృదయాల్లో దేవుడిగా మిగిలిపోయారని తెలిపారు. ప్రస్తుతం ఎస్సీ/ఎస్టీలకు రావాల్సిన నిధుల్లో 20 నుంచి 30 శాతం కూడా అందడం లేదన్నారు. ఎస్సీ/ఎస్టీ సబ్‌ప్లాన్ తెచ్చినట్లు ఘనంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇది అమలులోకి వచ్చిన తరువాత కొత్తగా ఒక్క రేషన్‌కార్డు, పెన్షన్ మంజూరు చేశారా? అని నిలదీశారు. జనాభా ప్రతిపాదికన నిధులు విడుదల చేయాల్సి ఉన్నా సబ్‌ప్లాన్ చట్టం వచ్చిన తరువాత కూడా బడ్జెట్‌లో నాలుగువేల కోట్ల రూపాయలు కోత పెట్టారని విమర్శించారు. కొత్తగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని, ఎస్సీ/ఎస్టీల ఇళ్ల నిర్మాణానికి అదనంగా లక్ష రూపాయలు ఇస్తామని జీవో ఇచ్చారే తప్ప నిధులు విడుదల కాలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లోనే ఎస్సీ/ ఎస్టీల కోసం నోడల్ ఏజెన్సీని నియమించారని, ఇప్పుడు దాని గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. 

నిధులు మళ్లించేవారిని, తప్పు చేసే అధికారులను శిక్షించాలనే నిబంధన సబ్‌ప్లాన్ చట్టంలో చేర్చాలని తమపార్టీ సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తాను చెప్పే అంశాల్లో అవాస్తవాలు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. పేద ఎస్సీల ఇళ్లకు 50 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని సీఎం కిరణ్ స్వయంగా ప్రకటించినా ఇంతవరకూ దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, దీంతో ఎక్కడా అమలు కావడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దళితులకు ఆత్మహత్యలే శరణ్యం అన్నట్లుగా పరిస్థితులు దాపురించాయన్నారు. ఐదువేల మంది ఎస్సీఎస్టీ విద్యార్థులను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంతమందిని ఎంపిక చేసిందని ప్రశ్నించారు. దళిత విద్యార్థుల కోసం ఇంగ్లిష్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదని జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. వైఎస్ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదని, ఫీజులు సక్రమంగా అందేవని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ సేవల నుంచి 130 జబ్బులను తొలగించారని గొల్ల బాబూరావు అన్నారు. తెనాలిలో ఓ మహిళను నడిరోడ్డుపై హత్యచేస్తే అధికారపక్షం నుంచి ఒక్కరూ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.
Share this article :

0 comments: