బాబుపై విచారణ జరపడం లేదేం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » బాబుపై విచారణ జరపడం లేదేం?

బాబుపై విచారణ జరపడం లేదేం?

Written By news on Friday, June 21, 2013 | 6/21/2013

ఐఎంజీ ఉదంతంలో బాబుపై విచారణ జరపడం లేదేం?
కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నందుకే కాదా?
కిరణ్, బాబులకు వైఎస్సార్‌సీపీ ప్రశ్నలు

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరస్పర అవగాహనతో ముందుకు సాగుతున్నందుకే వేల కోట్ల అవినీతి జరిగిన ఐఎంజీ భూ కేటాయింపులపై విచారణ జరగడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ఈ కుంభకోణంపై ఆధారాలున్నాయని గతంలో చీఫ్ విప్‌గా ఉండగా చెప్పిన కిరణ్, ఇప్పుడు దానిపై విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించింది. అవిశ్వాసం సమయంలో తటస్థంగా ఉండటం ద్వారా ప్రభుత్వాన్ని కాపాడినందుకే కిరణ్ ఇలా కృతజ్ఞత చెల్లించుకుంటున్నారా అని ప్రశ్నించింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఎ.అమరనాథరెడ్డి, పి.రామకృష్ణారెడ్డి గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. కిరణ్, చంద్రబాబులకు ఈ సందర్భంగా వారు 20 ప్రశ్నలు సంధించారు...

1.టీడీపీతో కాంగ్రెస్ రాజకీయ ఫిక్సింగ్ చేసుకోకపోతే, ఐఎంజీ భూ కేటాయింపులపై విచారణ ఎందుకు జరపడం లేదు?

2.ఐఎంజీ భూ కేటాయింపుల్లో అక్రమాలపై విచారణ జరపాలని గతంలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉండగా విలేకరుల సమావేశంలో, అసెంబ్లీలో డిమాండ్ చేసిన కిరణ్, ఇప్పుడు అధికారం చేతిలో ఉన్నా ఎందుకు విచారణ జరపడం లేదు? అవిశ్వాసం సమయంలో టీడీపీ తటస్థంగా ఉన్నందుకేనా?

3.ఐఎంజీ భూ కేటాయింపులపై సీబీఐ దర్యాప్తు జరగాలని 2012 అక్టోబర్ 9న సీఎం హోదాలో అద్దంకిలో అన్న మీరు దర్యాప్తుకు ఎందుకు ఆదేశించలేదు?

4.ఐఎంజీ భూ కేటాయింపులపై లండన్ కోర్టుకైనా వెళ్లి పోరాడతానంటూ ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి, ఇప్పుడు అధికారం చేతిలో ఉన్నా దర్యాప్తుకు ఎందుకు చొరవ చూపడం లేదు?

5.ఐఎంజీ భూ కేటాయింపుల్లో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని తెలిసిన మీరు, దానిపై దర్యాప్తు కోరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసినట్టు?

6.టీడీపీతో, కాంగ్రెస్ మిలాఖత్ రాజకీయాలు నడుపుతుండటం వాస్తవం కాదా? అందులో భాగంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పరస్పరం సహకరించుకున్న విషయం వాస్తవం కాదా?

7.అవిశ్వాస తీర్మానం సందర్భంగా టీడీపీ తటస్థం సాకుతో మద్దతివ్వకుంటే ఐఎంజీ భూ కేటాయింపులపై బాబుపై దర్యాప్తు జరుపుతామంటూ బ్లాక్‌మెయిల్ చేయడం వాస్తవం కాదా?

8.టీడీపీ, కాంగ్రెస్ రహస్య మిత్రులని ఇండియాటుడే ప్రచురించిన వార్త నిజం కాదా?

9.కాంగ్రెస్‌లోని ప్రత్యర్థులపై ఆగమేఘాలపై విచారణలకు ఆదేశిస్తున్న మీరు చంద్రబాబుపై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?

10.2014లో జరిగే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలిసి మాయకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరు ఢిల్లీ స్థాయిలో చొరవ చూపుతున్నారని రాష్ట్ర ప్రజానికం కోడై కూస్తోంది? ఇది నిజంం కాదా?

11.2004-09 మధ్య కేవలం 46 మంది ఎమ్మెల్యేలే ఉన్నా కూడా ఒకసారి వైఎస్ సర్కారుపై, మరోసారి అప్పటి స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిపై అవిశ్వాసం పెట్టిన టీడీపీ... ఇప్పడు దాదాపు 80 మంది ఎమ్మెల్యేలుండి, అన్ని విపక్ష పార్టీలూ అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చినా కూడా మీరు మాత్రం దానికి మద్దతివ్వకుండా విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడినట్టు?

12.దివంగత వైఎస్ హయాంలో కిరణ్‌ను స్పీకర్‌గా నియమిస్తే టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. మరిప్పుడు అదే కిరణ్ సీఎంగా ఎలా అర్హుడో ఆ పార్టీయే సమాధానం చెప్పాలి.

13.అధికార కాంగ్రెస్‌తో రాజకీయ ఫిక్సింగ్ చేసుకోకపోతే, 2013 మార్చి 16న అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేసి, వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని స్పీకర్‌కు, ఈసీని టీడీపీ తరఫున ఎందుకు డిమాండ్ చేయలేదు? వారిపై స్పీకర్ నిర్ణయం తీసుకునే దాకా వేచి చూశారేం?

14.కాంగ్రెస్‌తో రాజకీయ ఫిక్సింగ్ చేసుకోకపోతే... పార్టీపరంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను ముందే జరపాలని టీడీపీ గానీ బాబు గానీ ఎందుకు డిమాండ్ చేయడం లేదు?

15.2005లో పార్టీపరంగా మున్సిపల్ ఎన్నికలు జరిగి వాటి కాలపరిమితి 2010తో ముగిసింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు 2006లో పార్టీ పరంగా జరిగి వాటి కాలపరిమితి 2011లో ముగిసింది. పార్టీ పరంగా అదే క్రమంలో ముందుగా మున్సిపల్, మండల, జిల్లా పరిషత్, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదు?

16.కిరణ్, ఆయన సోదరులు అవినీతికి పాల్పడుతున్నారని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని పాదయాత్రలో, మహానాడులో, మీడియా సమావేశాల్లో ఆరోపణలు చేసిన చంద్రబాబు... కిరణ్ సర్కారును ఎందుకు కాపాడుతున్నట్టు?

17. కిరణ్, ఆయన సోదరులు అవినీతికి పాల్పడుతుండటంపై ఇప్పటిదాకా బాబు గానీ, టీడీపీ నేతలు గానీ గవర్నర్‌కో, దర్యాప్తు సంస్థలకో ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు?

18. బాబును ‘నడక మిత్రుడు’ అని అవిశ్వాస తీర్మానం సందర్భంగా కిరణ్ తన ప్రసంగంలో సంబోధించినా బాబు, ఆయన పార్టీ నేతలు ఇప్పటివరకు దాన్ని ఎందుకు ఖండించలేదు?

19.కళంకిత మంత్రులను తొలగించాలంటూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన టీడీపీ... కిరణ్, ఆయన సోదరుల అవినీతి, అక్రమాలపై ఏ దర్యాప్తు సంస్థలకూ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?

20.వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పత్రిక, టీవీ చానల్ ప్రారంభిస్తే నానాయాగీ చేస్తున్న టీడీపీ.. కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స టీవీ చానళ్లు ప్రారంభిస్తే వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఈ వ్యవహారాలపై ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు?
Share this article :

0 comments: