జన హృదయాల్లో జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జన హృదయాల్లో జగన్

జన హృదయాల్లో జగన్

Written By news on Tuesday, June 18, 2013 | 6/18/2013

‘జగన్‌బాబు బయటికి రావాలని ప్రతిరోజూ మేం అల్లాను దువా చేస్తున్నాం. త్వరలోనే బయటికి వస్తాడు. మాలాంటిపేదోళ్లను ఆదుకుంటాడు.’- ఓ అమ్మ మాట

‘వైఎస్ జగన్‌ను జైలులో పెట్టామని ఇయ్యాల కాంగ్రెస్, టీడీపోళ్లు సంబరాలు చేసుకుంటున్నారు.. కానీ ఆయన జన హృదయాల్లో ఉన్నారు. ఆ స్థానం పదిలం ’- ఓ చెల్లి తూటా..


ప్రొద్దుటూరు పట్టణంలోని పద్మశాలీయ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన ‘సాక్షి చైతన్యపథం’లో న్యాయవాదులు, వైద్యులు, విద్యార్థులు, మహిళలు తమ గళం విప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా జైలులో ఉంచడం అన్యాయమని మండిపడ్డారు. సీబీఐ తీరును దుయ్యబట్టారు. జగన్‌పై ఎవరెన్ని కుట్రలు పన్నినా.. ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజాదరణ ముందు అవేవి పని చేయవని తేల్చిచెప్పారు. జగన్‌ను జైలుగోడలు ఎన్నో రోజులు ఆపలేవన్నారు. అధికార కాంగ్రెస్‌కు.. ప్రతిపక్ష టీడీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. 2014లో జగన్‌ను సీఎం చేసి.. విజయమ్మకు కానుకగా అందిస్తామని ప్రతిన బూనారు. 

ప్రజాదరణ ఎప్పుడూ ఉంటుంది

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుం బానికి ప్రజాదరణ ఎప్పుడూ ఉంటుం ది. తప్పుడు ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. 
-డాక్టర్ రాజారామ్మోహన్‌రెడ్డి, ప్రొద్దుటూరు 

నాలుగు నెలల తర్వాత సీబీఐ ఏం చేస్తుంది

జగన్‌ను జైలులో పెట్టి ఏడాది అయింది. ఇప్పటివరకు సీబీఐ ఏ ఒక్క ఆధారం కోర్టుకు చూపలేకపోయింది. మరో నాలుగు నెలలు గడువు కోరిన సీబీఐ కాలయాపనకు తప్ప ఎలాంటి నిరూపణ చేయదు. ఇది కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకం. 
- శ్యాంసుందర్‌రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఓర్వలేకే జగన్‌పై కుట్ర

వైఎస్ మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో వందలాది మంది చనిపోతే వారిని ఓదార్చడానికి జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టారు. అక్కడ లభిస్తున్న ప్రజాదరణను ఓర్వలే కే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, అధిష్టానం కుట్ర పన్ని జగన్‌ను జైల్లో పెట్టారు. గతంలో ఎన్నో పెద్ద కేసుల్లో కూడా నిందితులకు బెయిల్‌లు ఇచ్చారు. కానీ జగన్‌పై ఆరోపణలే ఉన్నాయి. అయినా ఏడాది దాటినా బెయిల్ ఇవ్వకుండా కుట్ర పన్ని అడ్డుకుంటున్నారు.
-సరోజా ఉదయ్‌కుమార్, లయన్ లేడి 

కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లా సీబీఐ పని చేస్తోంది

సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లా పని చేస్తున్నట్లు అనిపిస్తోంది. దేశంలో 2జీ స్పెక్ట్రమ్, కామన్‌వెల్త్ లాంటి ఎన్నో కుంభకోణాలు జరిగాయి. ఇందులో సంబంధిత వ్యక్తులు నేరం చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. అయినా ఆ కేసుల్లో ఉన్న వ్యక్తులకు బెయిల్ వచ్చింది. కానీ ఏమాత్రం సంబంధం లేని కేసులో అరెస్ట్ అయిన జగన్‌కు ఏడాదిగా బెయిల్ రాలేదు. జగన్ లేకపోవడంతో జిల్లాలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. 
- రావుల సుధాకర్‌రెడ్డి, ఎస్టీయూ (డి) రాష్ట్ర అధ్యక్షుడు

జలయజ్ఞంతో సస్యశ్యామలం చేశారు

మహానేత వైఎస్‌ఆర్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా పాలన సాగించారు. జలయజ్ఞం పేరుతో రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములుగా ఉన్న లక్షలాది ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. ఓదార్పు యాత్రతో జగన్‌కు మంచి పేరు వస్తుందనే కాంగ్రెస్ పెద్దలు కుట్ర పన్ని జైలులో పెట్టారు.
- వీరారెడ్డి, రైతు సంఘం నాయకులు, ప్రొద్దుటూరు

ఏడాదిగా జైల్లో ఎలా పెడతారు

ఏడాది నుంచి వైఎస్ జగన్‌ను జైల్లో పెట్టారు. ఇప్పటివరకు ఆయనపై ఒక్క నేరం కూడా నిరూపణ కాలేదు. నిర్దోషిని ఏడాది నుంచి జైల్లో ఎలా పెడతారు. ఆయనను బయటికి రానీయకుండా టీడీపీతో కుమ్మక్కైన కాంగ్రెస్ అన్ని రకాల కుట్రలను పన్నుతోంది. కాంగ్రెస్ అధిష్టానం సీబీఐని శిఖండిలా ఉపయోగించుకుంటోంది. చంద్రబాబు శకుని పాత్ర పోషిస్తున్నాడు. ఎవరెన్ని కుట్రలు పన్నినా జగన్ సీఎం కావడం ఖాయం
-పాములేటి, జానపద కళాకారుడు

దేవుడి కుటుంబానికి అన్యాయం జరిగింది

రాష్ట్రంలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఫించన్లు, వడ్డీలేని రుణాలు తదితర సంక్షేమ పథకాలు పెట్టిన వైఎస్‌ఆర్ అందరికీ దేవుడయ్యాడు. అలాంటి దేవుడి కుటుంబానికి అన్యాయం జరిగింది. అందరి బాగు కోరే జగన్‌ను కాంగ్రేసోళ్లు జైల్లో పెట్టారు. ఆయన తొందరగా బయటికి రావాలని అల్లాను ప్రార్థిస్తున్నాం. జగన్ తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాం. ఆయన బయటికి వస్తేనే మాలాంటి పేదోళ్లకు మేలు జరుగుతుంది. 
-రసూల్‌బీ, ప్రొద్దుటూరు 

జగన్ ఎలాంటి తప్పు చేయలేదు

రాజకీయ దురుద్దేశంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు కుట్రపన్ని జగన్‌ను జైలులో పెట్టాయి. దీనికి సీబీఐని వాడుకున్నాయి. జగన్ ఎలాంటి తప్పు చేయలేదు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 
- సుబ్బిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయి

కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. ప్రజల గుండెల్లో ఉన్న జగన్‌ను ఎవరూ వేరు చేయలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఎత్తుగడలు వేసినా అది వృథా ప్రయాసే. 
- మధుసూదన్, ఆడిటర్ 

అంతా కుట్రలో భాగమే

వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేసినపుడు ఒక ఎఫ్‌ఐఆర్‌కు ఒకే చార్జిషీట్ వేయాలని సీబీఐకి కోర్టు స్పష్టం చేసింది. కానీ సీబీఐ వాళ్లు మాత్రం ఒకదాని తర్వాత మరొకటి చార్‌‌జషీట్ వేస్తూనే ఉన్నారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా సీబీఐ తుంగలో తొక్కింది. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. ఇదంతా కుట్ర వల్లే జరుగుతోందని ప్రజలు భావిస్తున్నారు. 
- లలితాపద్మిని, లేడీస్ హాస్టల్ నిర్వాహకురాలు

జగన్ లేక అభివృద్ధి ఆగిపోయింది

మన ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి లేకపోవడంతో జిల్లాలో అభివృద్ధి ఆగిపోయింది. జిల్లాలో పశువైద్య కళాశాల ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో సీట్లు కూడా రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. జగన్ బయట ఉంటే వీటిపై శ్రద్ధ చూపే వారు. జిల్లాలో విద్యావ్యాప్తికి వైఎస్ ఎంతగానో తోడ్పాటు అందించారు. కాంగ్రెస్ కుట్రల ఫలితంగా జైల్లో ఉన్న జగన్ త్వరగా బయటికి రావాలని కోరుకుంటున్నాం.
- లక్ష్మిరెడ్డి, ప్రొద్దుటూరు

జైలు గోడలు జగన్‌ను ఆపలేవు

కాంగ్రెస్, టీడీపీ కలిసి పన్నుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అమాయకులు కాదు.ఒక వైపు భర్తను పోగొట్టుకొని, మరో వైపు కుమారుడు జైల్లో ఉన్నప్పటికీ విజయమ్మ ఎంతో ధైర్యంగా ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. సీబీఐ నీతివంతంగా విచారణ చేయలేదు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు జగన్ గురించి ఆలోచించే దానిలో ఒక వంతు ప్రజల గురించి ఆలోచించినాప్రజలకు కొంతైనా మేలు జరిగేది. జగన్‌ను జైలు గోడలు ఆపలేవు. విద్యార్థులందరూ ఆయన వెంట ఉన్నారు. 
-పద్మిని, విద్యార్థిని

2014 కోసం ఎదురు చూస్తున్నాం

2014 కోసం ఎదురు చూస్తున్నాం. రాష్ట్ర ప్రజల్లో 90 శాతం మంది జగన్ వెంటే ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఆయన కడిగిన ముత్యంలా బయటికి వస్తాడు. ప్రధాన ప్రతిపక్షమైనప్పటికీ మిత్రపక్షంలా వ్యవహరిస్తున్న టీడీపీకి ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదు. విజయమ్మ, షర్మిలలు జనం మధ్యలో తిరుగుతున్నారు. 2014లో జగన్‌ను సీఎం చేసి విజయమ్మకు గిఫ్ట్‌గా అందిస్తాం. కాంగ్రెస్ కుట్రలు ఇక ఎంతో కాలం పనిచేయవు.
-కొర్రపాటి రవీంద్రనాథ్, వాస్తుపండితులు, కొర్రపాడు

సాక్షుల్ని సృష్టించడానికే జైల్లో పెట్టారు

పచ్చల్లు అమ్ముకుంటున్న వారు, ఒక సాధారణ రిపోర్టర్‌గా గడిపిన వాళ్లు కూడా నేడు కోట్లకు పడగలెత్తారు. అలాంటి వ్యక్తులు నేడు జగన్‌పై నిందారోపణలు చేస్తున్నారు. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్‌తో ఎంతో మంది పేద విద్యార్థులు పెద్ద పెద్ద చదువులు చదువుకోగలుగుతున్నారు. మేమంతా జగన్ వెంటే ఉంటాం. జగన్ బయటికి వస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడని సీబీఐ అధికారులు పదే పదే కోర్టుకు చెబుతున్నారు. అయితే సీబీఐ, కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తుంటే సాక్షుల్ని సృష్టించడానికే జగన్‌ను జైల్లో పెట్టారనిపిస్తోంది.
-భరత్‌తేజ, బీటెక్ విద్యార్థి

మాలాంటి పేదల కోసమైనా జగన్ బయటికి రావాలి

మైనారిటీలకు రాజశేఖర్‌రెడ్డి సారు ఎంతో మేలు చేశారు. మా ఇళ్లల్లో ఆ సారు ఫొటో పెట్టుకున్నాం. ఆయన కొడుకుని అన్యాయంగా జైల్లో పెట్టారు. మాలాంటి పేదోళ్లందరూ జగన్ బయటికి రావాలని ప్రార్థిస్తున్నారు. ఇన్ని రోజులుగా ఎందుకు జైల్లో పెట్టారు. వాళ్లు ఏం పాపం చేశారు. మేమందరం ఆయన కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం.
- బీబీ, ప్రొద్దుటూరు

చట్ట సభలకు పంపించాలి

ప్రజల కష్టాలు తీరుస్తారని ప్రజలు అత్యధిక మెజార్టీతో జగన్‌ని ఎంపీగా గెలిపించారు. ఆరోపణలపై ఏడాదిగా జైలులో ఉంచారు. ప్రజల కష్టాలను తీర్చేందుకు చట్ట సభలకు పంపాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని న్యాయస్థానం గుర్తించాలి. 
- దాదాపీర్, కూరగాయల మార్కెట్ అసోషియేషన్ కార్యదర్శి 

అధికార దుర్వినియోగమే 

ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. జగన్ బయటికి వస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారనే కేవలం ఆరోపణలపైనే జగన్‌ను జైలులో ఉంచారు. సుప్రీంకోర్టు సీబీఐని తప్పుబట్టిందంటే దాని వ్యవహార శైలి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. 
- జింకా విజయలక్ష్మి, న్యాయవాది
Share this article :

0 comments: