జగన్‌ని నిర్బంధించిన తీరు...ఎమర్జెన్సీని గుర్తుచేస్తోంది! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ని నిర్బంధించిన తీరు...ఎమర్జెన్సీని గుర్తుచేస్తోంది!

జగన్‌ని నిర్బంధించిన తీరు...ఎమర్జెన్సీని గుర్తుచేస్తోంది!

Written By news on Wednesday, June 19, 2013 | 6/19/2013


‘చట్టం ముందు అందరూ సమానులే’ అంటారు. కానీ, నిజ జీవితంలో అది నూటికి నూరుపాళ్లు తప్పు అని ఎన్నో సంఘటనలు నిరూపించాయి. ‘ఎంతమంది అపరాధులు అయినా తప్పించుకోవచ్చు గానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు’ అంటోంది న్యాయం. కాని ఇక్కడ సచ్చీలుడైన ఒక యువకుడు, ప్రజలకు సేవ చేయాలని తపన పడుతున్న ఒక నాయకుడు, అత్యధిక మెజారిటీతో గెలిచిన పార్లమెంటు సభ్యుడు, ఒక పార్టీకి అధ్యక్షుడు అయిన జగన్‌ని గత పన్నెండు నెలలుగా అన్యాయంగా జైలులో పెట్టడం చూస్తుంటే న్యాయం అన్నది చట్ట నిర్వచనాలలో తప్ప ఆచరణలో లేదని స్పష్టమవుతోంది.

జగన్‌కు జరుగుతున్న అన్యాయంపై ప్రతి ఒక్కరు స్పందించాల్సిన తరుణమిది. అంత శక్తిమంతమైన నాయకుడే అసహాయంగా అన్యాయం కోరల్లో చిక్కితే ఇక సాధారణ పౌరుల సంగతేమిటి? సమాజంలో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లు కూడా ఎంతోమంది భవంతులు కట్టి హాయిగా జీవిస్తున్నారు. అలాగనివాళ్లంతా అక్రమంగా సంపాదించినవాళ్లా? నేటి రాజకీయ నాయకుల పోకడలు చూస్తుంటే 1975 ఎమర్జెన్సీనాటి రోజులు గుర్తుకువస్తున్నాయి. అందరూ ఒక్కటై, అధికార దుర్వినియోగంతో వై.ఎస్.ఆర్. కుటుంబ సభ్యులను వేధించడమే తమ రాజకీయ అజెండాగా ముందుకు సాగుతున్నారు తప్ప, ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదు.

ఈ కుటిల నేతలు రాజశేఖరరెడ్డిగారి కుటుంబం మీద ఎన్ని అభాండాలు వేసినా ప్రజలు నమ్మరు కాగ నమ్మరు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పరిశ్రమలను పెట్టేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు వై.ఎస్.ఆర్.గారు రాయితీలు ఇవ్వడం ఎలా నేరం అవుతుంది? కొన్ని రాష్ట్రాలు భూముల్నే ఉచితంగా ఇస్తున్నాయి కదా. ఒకవేళ అలా ఇవ్వడం తప్పయితే జాతీయ స్థాయిలో మార్పు తేవాలి. అంతే తప్ప ఒకే విధానాన్ని పాటిస్తున్న వారిలో ఏ ఒక్కరినో తప్పు పట్టడం సరికాదు. తన కుటుంబం పట్ల ఎంతో విశ్వాసంతో మెలిగిన రాజశేఖర్‌రెడ్డిగారి కుటుంబాన్ని ఇబ్బందులు పాలు జేయడంలో సోనియా ఉద్దేశం ఏమిటో కూడా అర్థంకాదు.

ఒక్క ఎంపీ సీటు కూడా సాధించలేని రోశయ్యగారిని, కిరణ్‌కుమార్ రెడ్డిగారిని ముఖ్యమంత్రులను చేసి, తన కుమారుడిని ప్రధానిని చేయగల సత్తా ఉన్న నాయకుడైన జగన్‌ని జైల్లో పెట్టించి ఆమె ఏమి ప్రయోజనం ఆశించినట్లు! ఇక చంద్రబాబుగారు! కాంగ్రెస్ వాళ్లతో ఆయన కుమ్మక్కయ్యారని అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం వచ్చినా ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో ఆయన ఆలోచన ఏమిటన్నది ఎవరిని అడిగినా చెబుతారు. అలాగే పార్లమెంటులో ఎఫ్.డీ.ఐ బిల్లు పెట్టినప్పుడు ముగ్గురు టీడీపీ ఎంపీలు ఓటింగులో పాల్గొనక పోవడంలో ఆంతర్యమేమిటి? కాంగ్రెస్ నుంచి ఏవో హామీలు పొందారనే కదా.

సీబీఐ పైన కూడా చంద్రబాబు ఇంతవరకు ఒక్క విమర్శా చేయలేదు. సీబీఐ అంటే నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని కూడా అనుకోవలసి వస్తోంది. ఏనాడూ సొంత ఇమేజ్‌తో గెలవని చంద్రబాబును ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మరు. 45 డిగ్రీల మండుటెండల్లో పాదయాత్ర చేసిన దివంగత మహానేత రాజశేఖరెడ్డిగారి పాదయాత్రతో చంద్రబాబు గారి పాదయాత్రను ఏ విధంగానూ పోల్చలేం. చంద్రబాబుది అధికార దాహయాత్ర.

సత్యమేవ జయతే అన్నారు. సత్యమే జగన్‌ని గెలిపిస్తుంది. త్వరలోనే జగన్‌గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. అప్పుడు ఈ స్వార్థరాజకీయ నాయకులు చరిత్రలో కలిసిపోతారు.
- జి.భారతి, ఆముదాలవలస
Share this article :

0 comments: