మునుపెన్నడూ ప్రజలు ఇంతగా...ఎన్నికల కోసం ఎదురుచూడలేదు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మునుపెన్నడూ ప్రజలు ఇంతగా...ఎన్నికల కోసం ఎదురుచూడలేదు!

మునుపెన్నడూ ప్రజలు ఇంతగా...ఎన్నికల కోసం ఎదురుచూడలేదు!

Written By news on Thursday, June 13, 2013 | 6/13/2013


2009 లో సాధారణ ఎన్నికలకు ఒక యేడాది ముందు నుండే ఎల్లో మీడియా వైఎస్సార్ పాలన గురించి అభూత కల్పనలు అచ్చువేసి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా... ‘సాక్షి’ మీడియాలో ‘ఏది నిజం’ శీర్షికన ప్రజలకు నిజానిజాలు తెలుస్తూ వచ్చాయి కాబట్టే ఆ ఎన్నికల్లో వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. వైఎస్సార్ ప్రజాసంక్షేమం కోసం ఎన్నో మంచి పనులు చేశారు. అయితే ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగా చెడు ప్రచారం చేసింది. ‘సాక్షి’ ఆ చెడు ప్రచారాన్ని తిప్పికొట్టి, ప్రజలకు వాస్తవాలు తెలియజేసి, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడానికి చాలా దోహదపడింది. అలాంటి మీడియాను, దానిని స్థాపించిన వై.ఎస్.జగన్‌ని... కాంగ్రెస్ పార్టీ వారు టీడీపీతో కుమ్మక్కై ఎంత స్థాయిలో ఇబ్బంది పెట్టగలరో అంత స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు. వైఎస్సార్ సాధించిపెట్టిన అధికారాన్ని అనుభవిస్తూ, ఆయన తనయుడిని సీబీఐ ద్వారా నరక యాతనకు గురిచేస్తున్నారు. విజ్ఞులైన ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు ఎప్పుడొస్తాయా, కాంగ్రెస్, టీడీపీలకు తగిన రీతిలో బుద్ధి ఎలా చెప్పాలా అని గత రెండేళ్ల నుంచి ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రజల కోసం పరితపించే వైఎస్సార్ కుటుంబాన్ని ఇన్ని ఇబ్బందులకు గురిచేసిన ప్రతి ఒక్కరికీ త్వరలోనే తగిన శాస్తి జరిగి తీరుతుంది.

- వై.శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ జిల్లా

రైతులను జగనన్నే ఆదుకోవాలి

నాటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్సార్‌గారు రూపొందించిన అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రైతులకు మంచి చేయాలని ఆలోచనతో ఎం.ఎస్.స్వామినాధన్ కమిటీ సిఫార్సుల మేరకు నియమితులైన ఆదర్శ రైతుల పరిస్థితి నేడు తలకిందులైంది. వైఎస్సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదర్శ రైతులు సమయానికి వేతనాలు పొందేవారు. కాని ఇప్పుడు వారికి వేతనంతో పాటు, గౌరవం కూడా లేకుండా పోయింది. ఈ కిరణ్‌కుమార్ ప్రభుత్వం వారి గురించి నిమిషమైనా ఆలోచించడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో సుమారు యాభై వేల మంది ఆదర్శ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒకరిద్దరు ఆదర్శ రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, కొంతమంది రాజీనామా చేశారు. మిగతావారు వేతనాలు లేక భార్యాపిల్లలను పోషించే స్థితిని కోల్పోయారు. వై.ఎస్.గారు ఉన్నప్పుడు ఇది రైతు ప్రభుత్వం. కాని ఇప్పుడు కాదు. జగనన్న బయటకొచ్చి మా జీవితాలకు ఒక అర్థం పరమార్థం చేకూర్చాలని ప్రార్థిస్తూ మా ఆదర్శరైతుల తరఫున ఈ చిన్న లేఖ.

- అచ్చిన శ్రీకాంత్, ఆదర్శ రైతు, సైదాపురం, నల్గొండ జిల్లా

మాటలు నేర్చిన చిలుక... సీబీఐ

జగన్ బయట ఉంటే సీబీఐ దర్యాప్తు చేయలేదట! ఉన్నత న్యాయస్థానాన్ని సైతం ప్రభావితం చేయడానికి మన సీబీఐ కవిత్వం చెప్పడం చూస్తే, ఇది మాటలు నేర్చిన చిలుక అనిపిస్తోంది. పొరుగువాడు దురాక్రమణ చేస్తే, ఏమీ చేయలేని మన దుస్థితి ఇలా ఉంటే, సీబీఐ ఏదో చేస్తుందని ఎలా అనుకోగలం? కోర్టు చీవాట్లు పెట్టినా, కుర్చీలు అంటిపెట్టుకొని కూర్చుని అనేక రకాల స్కాముల్లో ఇరుక్కున్న ప్రధానమంత్రి, న్యాయశాఖామంత్రులు, సోనియా మొదలగువారిని సీబీఐ ఏమీ చేయలేకపోతోంది ఎందుకుని? వాళ్లను నిర్బంధించటానికి సీబీఐ అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదని, వారి ‘సత్తా’ చూసిన మామూలు ప్రజలకే అర్థమైంది. అలాంటప్పుడు జగన్‌కో న్యాయం, మన్మోహన్‌కో న్యాయమా అని ప్రజలు చెవులు కొరుక్కోవడం సహజమే కదా. అసలు వైఎస్సార్ మరణంపై జరిగిన దర్యాప్తు ఫలితం కూడా ఎవరో ఒకరి చేత ప్రభావితం చేయబడిందని అనుకోవచ్చు కదా. జరుగుతున్న పరిణామాలు చూస్తే, వైఎస్సార్ మరణం సహజం కాకపోవచ్చునని నమ్మే జనం ఆనాటికి ఈనాటికి పదింతలు పెరిగారన్న మాట కచ్చితంగా నిజం. ఏది ఏమైనా, ఈ దేశంలో ప్రజలకు ఎంతో కొంత నమ్మకమున్నది ఒక్క న్యాయవ్యవస్థ పైనే. కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది, న్యాయం చేయాల్సింది ‘సుప్రీం’ మాత్రమే.

- డాక్టర్ బి.జి.రెడ్డి, గోపాలపురం, ప.గో.జిల్లా
Share this article :

0 comments: