జగన్‌కు అండగా మేమున్నాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌కు అండగా మేమున్నాం

జగన్‌కు అండగా మేమున్నాం

Written By news on Friday, June 14, 2013 | 6/14/2013

‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004కు ముందు పాదయాత్ర చేసి అప్పటి వరకు నిర్జీవంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. 2009 ఎన్నికల్లో కూడా పార్టీ గెలిచినా.. ఓడినా తనదే బాధ్యత అంటూ ముందుకుసాగి ఒంటిచేత్తో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకే ఆ మహానేత చనిపోయాడని తెలియగానే వందలాది మంది గుండెలు ఆగిపోయాయి. ఆ కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ కుమారుడు జగన్ ‘ఓదార్పుయాత్ర’ చేపడితే సోనియాగాంధీ అడ్డుపడింది. ఆ తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీని వీడేలా చేశారు.

ప్రజలకిచ్చిన మాట కోసం కష్టాలెదుర్కోవడానికి సిద్ధపడ్డారు. సొంతంగా పార్టీని స్థాపించి పోరాడారు. ప్రజల్లో అతడికి వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై అక్రమంగా కేసుల్లో ఇరి కించాయి. సీబీఐని అడ్డుపెట్టుకుని జైల్లో పెట్టించాయి. జగన్‌ను జైల్లో పెట్టినంత మాత్రాన ఏమౌతుంది? ఆయన మంచివాడని మా అందరికీ తెలుసు. ఎవరు ఏమనుకున్నా జగన్‌కు అండగా మేముంటాం’’ అంటూ మహిళలు, యువకులు స్పష్టం చేశారు. గురువారం హిందూపురంలో నిర్వహించిన ‘సాక్షి చైతన్యపథం’ సదస్సుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి వైఎస్ కుటుంబంపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. ఒక్కడిని ఎదుర్కోవడానికి ఇంత మంది ఏకం కావాలా? అని ప్రశ్నించారు.
 
- న్యూస్‌లైన్ నెట్‌వర్క్, హిందూపురం 

మహిళాగళం
జగన్ భయ్యా సీఎం కావాలి 
జగన్ భయ్యా మనకు సీఎం కావాలి. ఎందుకంటే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ఎంతో భరోసా ఉండేది. మా పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చేది. ఇప్పుడు పిల్లలను చదివించడానికి కష్టాలు పడుతున్నాం. మా ఇంట్లో ముసలి వాళ్లకు పింఛన్ అందడం లేదు. బతుకు భారంగా ఉంది. జగన్ ముఖ్యమంత్రి అయితే అవి సక్రమంగా అందుతాయనే నమ్మకం ఉంది. 
- రిహానా, గృహిణి 

ఎవరు లబ్ధిపొందలేదో చెప్పండి 
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ కుటుంబం ఆయన నుంచి లబ్ధిపొందలేదో చెప్పండి. పేదవారికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద మా బంధువుకు ఆపరేషన్ చేశారు. లక్షల విలువ చేసే వైద్యాన్ని ఒక్క రూపాయి కూడా లేకుండా చేయించారు. వైఎస్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయడం దారుణం. మహిళలంతా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. 
- అయీషాబాను, గృహిణి 

జగన్ మా గుండెల్లో ఉన్నారు 
జగన్‌ను జైల్లో పెట్టారని కుట్రదారులు అనుకుంటే వారి పొరపాటే. జగన్ జైల్లో కాదు... మా గుండెల్లో ఉన్నా రు. ఆయన్ను మా నుంచి దూరం చేయాలని ఎన్ని కుట్రలు పన్నుతున్నారో పేపర్లు, ఛానల్స్ చూస్తుంటే అర్థమౌతోంది. వారి కుటుంబ బాధను ఒక్కరైనా అర్థం చేసుకున్నారా? ఏ ఛానలైనా ఒక దివంగత ముఖ్యమంత్రి భార్య పడుతున్న కష్టాలను చూపిస్తోందా? ఇవన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి. వారందరికీ బుద్ధి చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయి. 
- వెంకటలక్ష్మి

త్వరలోనే బయటకొస్తాడు
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను వేధిస్తోంది. మహిళలు బాగుపడాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. త్వరలో జైలు నుంచి ఆయన బయటకు వస్తారు. అప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.
- ఫర్జానా, గృహిణి, ధర్మపురం 


నోటికాడి పింఛన్ లాగేశారు 
రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు మాకు పింఛన్ వచ్చేది. నాతో పాటు మా కాలనీలో వంద మందికి పైగా పింఛన్ అందుకుంటున్నారు. ఇప్పుడు హిందూపురంలోనే వందలాది పింఛన్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఎంత వరకు న్యాయం? రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత ప్రభుత్వం పేదలపై ఇలాంటి చర్యలకు పూనుకోవడం దారుణం. ఈ కష్టాలన్నీ తీరాలంటే జగన్‌అధికారంలోకి రావాల్సిందే. 
- లలితమ్మ, గృహిణి

దుర్మార్గులంతా ఏకమయ్యారు 
పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువు అందని ద్రాక్షగా ఉండేది. దాన్ని మాకు దగ్గర చేసిన దేవుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సారే. అటువంటి మహానేత కుటుంబాన్ని ఇప్పుడు దుర్మార్గులంతా ఏకమై ఇబ్బంది పెడుతున్నారు. యువత మొత్తం వైఎస్ జగన్ వెంటే ఉంటుంది. ఆయనను సీఎం చేసే బాధ్యత యువతదే. 
- సుభాషిణి, విద్యార్థిని 

వైఎస్ ఉన్నప్పుడే రైతులకు మేలు 
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతులకు అన్ని విధాలా మేలు జరి గింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తండ్రి ఆశయాలు నెరవేర్చడానికి జగన్ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. దీంతో అతడికి ప్రజాదరణ పెరుగుతోందన్న అక్కసుతో కాంగ్రెస్, టీడీపీలు కుట్రపన్ని జైల్లో పెట్టించాయి. అయినా జగన్ తొందరలోనే నిర్దోషిగా బయటకు వస్తాడు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతాడు. 
- జగన్నాథరెడ్డి, రైతు, సడ్లపల్లి

ప్రజాదరణ చూడలేకే ఈ కుట్రలు 
జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొన్ని రాజకీయ పార్టీలు ఆయన్ని జైల్లో పెట్టించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెట్టి ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించిన ఘనత మహానేత వైఎస్‌ది. అలాంటి నేత చనిపోయాక ఎంతో మంది గుండె ఆగి ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలను పరామర్శించడానికి జగన్ ఓదార్పుయాత్ర చేపడితే సోనియాగాంధీ అరెస్ట్ చేయించింది. జైలు పాల్జేసింది. ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్ బయటకు వస్తాడు. 
- నాగేంద్రరెడ్డి, వ్యాపారి 

ఓట్లతో బుద్ధిచెబుతాం 
2014లో జరిగే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించి జగన్‌ను నిర్దోషిగా నిరూపిస్తాం. కాంగ్రెస్, టీడీపీలకు ఓటుతో బుద్ధిచెబుతాం. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అన్ని వర్గాల వారు ఏదో ఒకరకంగా లబ్ధిపొందారు. అలాంటి మహనీయుడి తనయుడు కొత్త పార్టీ పెడితే ఆ రెండు పార్టీలు జీర్ణించుకోలేక కుట్ర పన్ని జగన్‌ను జైల్లో ఉంచా యి. బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నాయి. 
- నాగరాజు, మేస్త్రీ, కోడూరు

మాటకు కట్టుబడడం తప్పా? 
వైఎస్ మరణం తర్వాత ఆ బాధ తట్టుకోలేక చనిపోయిన వారి కుటుం బాలను పరామర్శిస్తానని జగన్ అప్పుడే చెప్పారు. ఓదార్పుయాత్ర తన వ్యక్తిగతమని కూడా అన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా ఇబ్బందులకు గురి చేస్తోంది. 
- గోపాల్, విశ్రాంత తహశీల్దార్

ప్రజాకోర్టులో విజేత జగనే 
జగన్ బయట ఉంటే తాము విజ యం సాధించలేమని కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై సీబీఐని అడ్డుపెట్టుకుని లేనిపోని కేసు లు పెట్టారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిగుంటే ఎప్పుడో బెయిల్ వచ్చేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజాకోర్టులో జగన్ విజేతగా నిలిచి బయటకు వస్తారు. 
- మహమ్మద్ రఫీక్

జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టకూడదా? 
రాజకీయ వేత్త అయినంత మాత్రాన జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టకూడదా? ఇలాంటి పరిణామాలతో పెట్టుబడులు పెట్టాలంటేనే అందరూ జంకుతున్నారు. ఎవరైనా సరే లాభాపేక్షతోనే వ్యాపారాలు చేస్తారు. అదే తరహాలోనే జగన్ కంపెనీల్లోకి రాంకీ, దాల్మియా, మాట్రిక్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఆ లెక్కలు సైతం బహిర్గతం చేశారు. ఇందులో ఎక్కడా దాపరికం లేదు. కేవలం తమ మాట వినడం లేదనే జగన్‌ను క్విడ్‌ప్రోకో పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. అక్రమ కేసులు బనాయించి జైల్లో నిర్బంధించారు. సాక్షుల్ని ప్రభావితం చేస్తారన్న సాకుతో బెయిల్ ఇవ్వకపోవడం సమంజసం కాదు. 
- నరేంద్రనాథ్, ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 

ఇంత చీకటి రోజులు ఎప్పుడూ చూడలేదు 
నా జీవితంలో ఇప్పటి వరకు ఇలాంటి చీకటి రోజులను చూడలేదు. రాజకీయ నాయకుడి కంటే ముందు జగన్ ఒక వ్యాపారి. ఆయన ఎప్పుడూ సెక్రటేరియట్‌కు వెళ్లింది లేదు. అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్నే బెదిరించి లబ్ధిపొందారని సీబీఐ చెప్పడం సిగ్గుచేటు. 26 జీవోలు ఇచ్చిన మంత్రులు నిజాయితీపరులని ముఖ్యమంత్రి కిరణ్ చెబుతున్నప్పుడు.. వాటితో ఎలాంటి సంబంధమూ లేని జగన్‌ను జైల్లో పెట్టడం దారుణం. 
- సిద్దిఖ్‌సేఠ్

వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే
ఒక వ్యక్తిపై ఏదైనా కేసు నమోదైతే 90 రోజుల తర్వాత బెయిల్ మంజూరవుతుంది. కోర్టే బెయిల్ ఇస్తాం... జామీనుదారులను తీసుకుని రమ్మంటుంది. అయితే జగన్ విషయంలో ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఒక వ్యక్తి జీవితంలో ఏడాది కాలం ఎంతో విలువైంది. జగన్‌ను ఏడాదిగా రిమాండ్‌లో ఉంచడం దారుణం. ఇది వ్యక్తిగత, భావ స్వేచ్ఛలను హరించడమే. 
- రిజ్వాన్ ఖాన్, లాయర్

ఇదంతా రాజకీయ కుట్ర 
ఒక వ్యక్తి స్వేచ్ఛ, భావ హక్కులను హరించాలన్నది ఏ దేశ రాజ్యాంగంలోనూ లేదు. ప్రపంచంలో ఎక్కడా ఇలా హక్కులకు భంగం కలిగించరు. జగన్ విషయంలో మాత్రమే చేస్తున్నారు. ఒక వ్యాపారి పెట్టుబడులు పెట్టడం తప్పని చట్టంలో ఎక్కడైనా ఉందా? ఇది జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న రాజకీయ కుట్రే. 
- గంగాధరప్ప, లాయర్

ప్రజలంతా గమనిస్తున్నారు 
జగన్ విషయంలో రాజ్యాంగాన్ని పాలకులు తుంగలో తొక్కుతున్నారు. దేశంలోనే అతి పెద్ద స్కాం అయిన 2జీ స్పెక్ట్రంలో కూడా రాజాకు బెయిల్ వచ్చింది. అభియోగాలు మాత్రమే ఎదుర్కొంటున్న జగన్‌ను మాత్రం రిమాండ్‌లో సంవత్సరం పాటు పెట్టడం తీవ్రమైన అంశం. కాంగ్రెస్ అధిష్టానం, టీడీపీ, ఎల్లో మీడియా, సీబీఐ ఒక్కటై జగన్‌ను హింసించాలని చూస్తున్నాయి. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. ఎప్పటికైనా న్యాయమే నిలబడుతుంది. 
- నారాయణస్వామి

అధికారం వైఎస్ భిక్షే 
2004, 2009లో ప్రజల చేత ఎన్నుకోబడి అధికారంలోకి వచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు.. ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో గుండెల మీద చేయివేసుకుని చెప్పాలి. 2004కు ముందు రాష్ర్టంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? చావుబతుకుల్లో ఉన్న ఆ పార్టీని వైఎస్ పాదయాత్ర చేసి అధికారంలోకి తెచ్చారు. 2009లోనూ ఒంతిచేత్తో గెలిపించా రు. ఇలా రెండు సార్లు కాంగ్రెస్‌కి అధికారం రావడం వైఎస్ భిక్షే. అలాంటి మహానేత కుటుంబాన్నే ఇప్పుడు రోడ్డుమీదకు తెచ్చార ని ప్రజలు బాధపడుతున్నారు. 
- సుబ్రమణ్యం, ఉపాధ్యాయుడు

అభిమానం పెరుగుతుందే కానీ... తరగదు 
వైఎస్ కుమారుడిగా జగన్‌కు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు వచ్చాయి. అటువంటి నేతను ప్రజల నుంచి దూరం చేయాలని చూడడం అవివేకం. జగన్‌ను జైల్లో పెట్టడం వల్ల అభిమానం ఇంకా పెరుగుతుందే కానీ తరగదు. ఒక సాధారణ విలేకరిగా ఉన్న వేమూరి రాధాకృష్ణకు అన్ని వేలకోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 
- డాక్టర్ అశ్వర్థరెడ్డి

సీబీఐతో బెదిరిస్తోంది 
కాంగ్రెస్ అధిష్టానం జగన్‌ను బెదిరించి ప్రజల నుంచి దూరం చేయడానికి సీబీఐను ప్రయోగిస్తోంది. ఆయ న్ను అణచివేస్తే తమకు ఎలాంటి అడ్డంకీ ఉండదని విర్రవీగుతోంది. రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్న చంద్రబాబు లక్షల కోట్లు సంపాదిస్తే సీబీఐకి కన్పించలేదా? జగన్ ఒక్కడే కనిపిస్తున్నారా? 
- రామకృష్ణ, రైతు
Share this article :

0 comments: