తండ్రి పథకాలను కొనసాగించే సత్తా...తనయుడొక్కడికే ఉంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తండ్రి పథకాలను కొనసాగించే సత్తా...తనయుడొక్కడికే ఉంది

తండ్రి పథకాలను కొనసాగించే సత్తా...తనయుడొక్కడికే ఉంది

Written By news on Wednesday, June 12, 2013 | 6/12/2013

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డిగారు అంటే మాకు చాలా అభిమానం. ఎనలేని ప్రేమ. ఆయన బడుగు, బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఆయన ఎప్పుడూ పేద ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలి అని తపించేవారు. ఎవరిని చూసినా చిరునవ్వుతో అక్కున చేర్చుకునేవారు. ఆయన హయాంలో అమలయిన ఉపాధి హామీ పథకం, 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్, పావలావడ్డీ ఋణాలు, కిలో రెండు రూపాయల బియ్యం పథకం, రైతులకు ఋణమాఫీ వంటివన్నీ నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు జీవితంపై ఒక భరోసాను ఇచ్చాయి. 

ఒక్కమాటలో చెప్పాలంటే ‘సంక్షేమం’ అనే పదానికి వన్నెతెచ్చిన నేత మన ప్రియతమ నాయకులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిగారు మాత్రమే. అయితే ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ప్రవేశపెట్టిన పథకాలను అన్నింటినీ తుంగలో తొక్కుతోంది. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయి ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ, ప్రజామోదం లేని నిర్ణయాలు తీసుకుంటోంది. ఎంతటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం! ఈ సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా, సమగ్రంగా నిరుపేదలందరికీ అందాలంటే ఆ మహనీయుడి తనయుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిగారు సి.ఎం. అవ్వడమొక్కటే మార్గం. 

అందుకే ఆయన మన ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. ఈ ఆకాంక్షను గమనించిన పాలక, ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలతో జగన్‌గారిని జైలుపాలు చేశాయి. ఏడాది కాలంగా ఆయనకు బెయిలు రాకుండా అడ్డుకుంటున్నాయి. ఈ పన్నెండు నెలల కాలంలోనూ రాష్ట్రప్రజలు నానా విధాలుగా కష్టాలు పడ్డారు. ఇప్పటికీ పడుతున్నారు. ఈ దశలో జగనన్న వదిలిన బాణంలా ప్రజల కోసం షర్మిలమ్మ పాదయాత్ర జరుపుతుండడం ఒక్కటే కారుచీకటిలో కాంతిదీపంలా కనిపిస్తోంది.

రాష్ట్ర ప్రజలు రాజశేఖర్‌రెడ్డిగారి కుటుంబాన్ని తమ సొంత కుటుంబంగా భావిస్తారు. దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం చెందారు. ఆ లోటును తీర్చే నాయకుడు ఒక్క జగన్‌గారేనన్నది అక్షరసత్యం. ఆయన మీద ప్రజలకు అచంచలమైన నమ్మకం ఉంది. తండ్రి ప్రవేశపెట్టిన పథకాలు విజయవంతంగా నడిపిస్తాడన్న ధీమా ఉంది. అందుకే జగన్‌గారు తెచ్చే రాజన్న రాజ్యం కోసం అంతా కన్నులు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 

- కట్టా అప్పారావు, డి.రాజు. పల్లా అప్పారావు, 
ఆర్.బి. కొత్తూరు
పెద్దాపురం మండలం, తూ.గో.జిల్లా
Share this article :

0 comments: