అధికారంలోకి వ చ్చాక ప్రాజెక్టులన్నీ సాధ్యమైనంత త్వరగా పూర్తి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధికారంలోకి వ చ్చాక ప్రాజెక్టులన్నీ సాధ్యమైనంత త్వరగా పూర్తి

అధికారంలోకి వ చ్చాక ప్రాజెక్టులన్నీ సాధ్యమైనంత త్వరగా పూర్తి

Written By news on Thursday, June 13, 2013 | 6/13/2013

వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ
- రైతులకు కరువు కాటకాల నుంచి విముక్తి కలిగించాలని వైఎస్ కృషి చేశారు
- 70, 95 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులపైనా శ్రద్ధ లేదు
- పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై కనీస స్పందన లేదు

సాక్షి, హైదరాబాద్: జలయజ్ఞం ద్వారా రైతులకు కరువు కాటకాల నుంచి విముక్తి కల్పించేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత విజయమ్మ దుయ్యబట్టారు. ప్రాణహిత - చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టుల జాతీయ హోదాపై చర్చకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఉదయం శాసన సభలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. ఈ అంశంపై చర్చకు స్పీకర్ అనుమతించలేదు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి విజయమ్మ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.

‘‘కోటి ఎకరాలకు సాగు నీరందించే 86 ప్రాజెక్టులకు దాదాపు రూ.56 వేల కోట్లు ఖర్చుచేసి 70 శాతం పనులు పూర్తిచేశారు. కొన్నింటి పనులు 95 శాతం వరకు పూర్తయ్యాయి. మిగిలిఉన్న కొద్దిపాటి పనులు పూర్తి చేసి, ప్రాజెక్టులను వినియోగంలోకి తేవడానికి ప్రభుత్వం చొరవ చూపడంలేదు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు అన్ని అనుమతులు తీసుకొచ్చినా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలను గెలిపించినందుకు రాష్ట్రంలోని పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, దేవాదుల, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి గట్టి కృషి చేశారు.

ప్రధాని మన్మోహన్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీని కూడా ఒప్పించారు. అందుకు తగ్గట్లు పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టులకు అన్ని అనుమతులు తీసుకొచ్చారు. పెట్టుబడి వ్యయానికి ప్లానింగ్ కమిషన్ కూడా అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా ఏఐబీపీ (సత్వర సాగునీటి ప్రయోజన పథకం) కింద రూ.250 కోట్ల గ్రాంటును కూడా కేంద్రం నుంచి రాజశేఖరరెడ్డి సాధించారు. పోలవరం పూర్తయితే విశాఖ నగర ప్రజల దాహార్తితో పాటు 960 మెగావాట్ల విద్యుత్తు కూడా ఉత్పత్తి అయ్యేది. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్రం కూడా అంగీకరించింది. ఈ ప్రభుత్వం గట్టిగా కృషి చేసినట్లయితే ఈపాటికి పూర్తయ్యేది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారంగా జాతీయ హోదా సైతం రద్దయింది. తాజా నిబంధనల ప్రకారం అనుమతి సాధించేందుకు ఎటువంటి ప్రయత్నాలూ చేయడంలేదు.

పోలవరం కోసం జగన్ పాదయాత్ర చేసినా ప్రభుత్వంలో చలనంలేదు. పోలవరం నిర్వాసితులకు దేశంలోనే అత్యుత్తమ ప్యాకేజీ అందించాలని రాజశేఖరరెడ్డి ప్రయత్నించారు. అయితే ఆయన మరణం తర్వాత అదీ పూర్తిగా మరుగున పడింది’’ అని చెప్పారు. ‘‘ప్రాణహిత-చేవెళ్ల ద్వారా తెలంగాణ ప్రాంతంలోని 17 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని వైఎస్ సంకల్పించారు. 1975 అక్టోబర్ 6న కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య ‘సంయుక్త అంతర్ రాష్ట్ర సంఘం’ ఏర్పాటు కావాలి. దానిని 30 ఏళ్లకు పైగా ఎవ్వరూ పట్టించుకోలేదు. రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టును తిరిగి వెలుగులోకి తెచ్చారు. 2008లో శంకుస్థాపన చేశారు. దీంతో తెలంగాణ ప్రజల్లో ఆశలు చిగురించాయి. వ్యవసాయంపై రైతుల్లో మక్కువ పెరిగింది. వైఎస్ ప్రాణహితను తెలంగాణ మణిహారంలా భావించారు. ఈ ప్రాజెక్టు ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తి కావాల్సి ఉంది. అయినా, ఈ ప్రభుత్వం కనీసం స్పందించడంలేదు’’ అని అన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుల వ్యయం రోజురోజుకు పెరిగిపోతోందని చెప్పారు. వ్యవసాయం దండగ అని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలనకు కొనసాగింపులా ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందని విజయమ్మ విమర్శించారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో నీటి ప్రాజెక్టులకు రూ.10 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, ఆయన హయాంలో కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులను ఎత్తు పెంచుతున్నా పట్టనట్లు వ్యవహరించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వ చ్చాక ప్రాజెక్టులన్నీ సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తామని విజయమ్మ స్పష్టం చేశారు.
Share this article :

0 comments: