నిజాలంటే చంద్రబాబుకు భయం: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిజాలంటే చంద్రబాబుకు భయం: షర్మిల

నిజాలంటే చంద్రబాబుకు భయం: షర్మిల

Written By news on Thursday, June 13, 2013 | 6/13/2013

కాకినాడ: నిజాలంటే చంద్రబాబుకు భయం. క్షమించరాని ద్రోహాలు చేశాడు. చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు. పులిని చూసి నక్కవాతలుపెట్టుకున్నట్టు వైఎస్ అమలుచేసిన పథకాలన్నీ నేను చేస్తానంటున్నాడు. నీవు సీఎంగా ఉండగా తొమ్మిదేళ్లు ఏం చేశావు? వాతలు పెట్టుకున్నా నక్క నక్కే, పులి పులే. మీ పాపం పండే రోజు దగ్గర పడింది. పాపాలపుట్ట పగిలి బయటకు వచ్చే విషసర్పాలు వేటాడి, తరిమి, తరిమి కొట్టే రోజు దగ్గర్లోనే ఉంది’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు కుతంత్రానికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో సాగింది. కాకినాడ జగన్నాథపురంలో అశేష జనవాహినిని ఉద్దేశించి షర్మిల మాట్లాడారు.
Share this article :

0 comments: