జగన్‌దే అంతిమ విజయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌దే అంతిమ విజయం

జగన్‌దే అంతిమ విజయం

Written By news on Friday, June 14, 2013 | 6/14/2013

* జగన్ సీఎం అయితేనే మళ్లీ వైఎస్ యుగం
* తప్పు చేస్తున్న అల్లుడిని కాపాడుతున్న సోనియా కూడా నేరస్తురాలే
* కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు అధికారం వైఎస్ భిక్షే
* ‘సాక్షి చైతన్య పథం’లో భగ్గుమన్న హిందూపురం ప్రజలు

‘జగన్ సొంత పార్టీ పెట్టుకుంటున్నారంటే ఏదోలే అనుకున్నారు. తీరా పార్టీ పెట్టి.. ప్రభంజనం సృష్టిస్తోంటే అటు సోనియా నుంచి ఇటు చంద్రబాబు వరకు దిమ్మ తిరిగిపోయింది. జననేతను అణచకపోతే తమకు మనుగడ లేదని టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యి.. సీబీఐని అడ్డుపెట్టుకుని ఎల్లో మీడియా సహకారంతో ఎన్ని విధాలా వేధించొచ్చో అన్ని విధాలా ఇక్కట్లు పెడుతున్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో, చెరగని చిరునవ్వుతో అందరికీ ధైర్యం చెబుతున్న జగన్‌దే అంతిమ విజయం’ అని జనం ఎలుగెత్తి చాటారు.

హిందూపురం అర్బన్, న్యూస్‌లైన్ : ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి కాంగ్రెస్ అధిష్టానం ఓర్వలేకపోతోంది. అందుకే ఆయనపై కక్ష కట్టింది. టీడీపీ, ఎల్లో మీడియా, సీబీఐతో కలిసి కుట్ర పన్ని జననేతను జైలు పాలు చేసింది. వారందరికీ పోయేకాలమొచ్చే ఈ విధంగా తెగబడ్డార’ని వక్తలు దుయ్యబట్టారు. గురువారం హిందూపురం పట్టణంలోని కంచి కామాక్షి కల్యాణ మండపంలో ‘సాక్షి చైతన్య పథం’ నిర్వహించారు. వ్యాఖ్యాతగా స్వప్న వ్యవహరించిన ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు, మహిళలు, యువత తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కేంద్రం చెప్పినట్లు వింటే బెయిలు ఇస్తారని, లేదంటే జైలు చూపిస్తారని మండిపడ్డారు. 

న్యాయవాది గంగాధరప్ప మాట్లాడుతూ ప్రపంచంలో 186 రాజ్యాంగాలు ఉన్నాయని, ఎందులోనూ మానవ హక్కులకు భంగం కలిగించే అంశాలు లేవని స్పష్టం చేశారు. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత మొదటిసారిగా జగన్ విషయంలో తాను చీకటి యుగాన్ని చూస్తున్నానన్నారు. ‘అసలు ఆయన చేసిన తప్పేంటి? ముందస్తుగా ఆదాయపు పన్ను కట్టడం నేరమా? అలా ట్యాక్స్ కట్టిన వ్యక్తిని అభినందించాల్సింది పోయి ఇలా వేధించడం తగునా? సీబీఐ కర్కశంగా వ్యవహరిస్తోంద’ని మండిపడ్డారు. జగన్‌కు ఏమైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలన్నారు. ఉపాధ్యాయుడు సుబ్రమణ్యం మాట్లాడుతూ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రధానిగా మన్మోహన్, యూపీఏ అధ్యక్షురాలిగా సోనియా ఉన్నారని గుర్తు చేశారు. అప్పుడు జగన్ తప్పు చేసినట్లయితే దాన్ని చూస్తూ ఊరుకున్న మన్మోహన్ , సోనియా కూడా నేరస్తులేనని స్పష్టం చేశారు. 

జగన్ ఆర్థిక ఉగ్రవాదని అంటున్న ‘ఆనం’ అసలైన రాజకీయ ఉగ్రవాది అని అభివర్ణించారు. 2004 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఏ ఒక్క నేత దిక్కు లేకపోతే మహానేత వైఎస్ భారాన్నంతా భుజాన వేసుకుని పార్టీని రెండు సార్లు అధికారంలోకి తెచ్చారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి చిరంజీవి కుమార్తె ఇంట్లో దొరికిన రూ.35 కోట్ల బ్లాక్‌మనీ విషయాన్ని ఎందుకు తొక్కిపెట్టారో సీబీఐ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్‌ను హింసించాలనే ఇదంతా చేస్తున్నారన్నారన్నారు. న్యాయవాది రిజ్వాన్‌ఖాన్ మాట్లాడుతూ కేంద్రం ఎలాగైనా జగన్‌ను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు. అందుకోసమే సీబీఐని ఉసిగొల్పుతోందన్నారు. గతంలోనూ ములాయం, మాయావతి, కరుణానిధి, స్టాలిన్ తదితరుల విషయంలో సీబీఐని ఇలాగే ఉసిగొల్పిందని గుర్తు చేశారు. అయితే... జగన్ భయపడే నాయకుడు కాదన్నారు. 

డాక్టర్ అశ్వర్థరెడ్డి మాట్లాడుతూ జగన్ పుట్టుకతోనే కోటీశ్వరుడని, ఆయన అక్రమాలు చేసే స్థితికి దిగజారలేదని స్పష్టం చేశారు. ఒక కోటీశ్వరుడు వ్యాపారం చేస్తే తప్పు అయినప్పుడు పాత్రికేయుడిగా వేల కోట్లు సంపాదించిన వేమూరి రాధాకృష్ణ సచ్చీలుడా అని ప్రశ్నించారు. ‘రెండెకరాల ఆసామి చంద్రబాబు రాత్రికి రాత్రే లక్షల కోట్లు సంపాదించింది ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఎందుకు కన్పించలేదు? గతంలో వైఎస్ వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఉంటే చంద్రబాబు ఈ పాటికి చంచల్‌గూడ జైల్లో ఉండేవారు. కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ కుటుంబాన్ని ఇలా రోడ్డు మీద నిలబెట్టడం దారుణం. భర్తను పోగొట్టుకుని విజయమ్మ పుట్టెడు దుఃఖంలో ఉంటే.. ఇప్పుడు కుమారుడిని కూడా జైల్లో పెట్టి మానసికంగా హింసిస్తున్నార’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ టీచర్ నారాయణస్వామి, రైతు రామకృష్ణ, మరికొందరు వక్తలు మాట్లాడుతూ.. సోనియా అల్లుడు అక్రమంగా సంపాదించుంటుంటే చూస్తూ ఊరుకున్న సోనియా కూడా నేరస్తురాలేనన్నారు. చట్టాన్ని తప్పుదోవపట్టిస్తున్న టీడీపీ, కాంగ్రెస్, సీబీఐ, ఎల్లో మీడియాకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Share this article :

0 comments: