మరో ప్రజాప్రస్థానంలో మహోజ్వల ఘట్టం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో ప్రజాప్రస్థానంలో మహోజ్వల ఘట్టం

మరో ప్రజాప్రస్థానంలో మహోజ్వల ఘట్టం

Written By news on Sunday, June 23, 2013 | 6/23/2013

మాట ఇస్తే కట్టుబడి ఉండటం అందరికీ అంత ఈజీ కాదు. అది మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికి, ఆయన కుటుంబానికి మాత్రమే ‌సాధ్యం. అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తానని పాదయాత్రలో చెప్పిన వైయస్‌ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ‌ఆ ఫైలు పైనే తొలి సంతకం చేసి శభాష్‌ అనిపించుకున్నారు. జలయజ్ఞం చేపట్టారు. మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. మడమ తిప్పని, మాట తప్పని నాయకుడిగా కోట్లాది జనం గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.



ఆ మహానేత వారసత్వాన్నే అక్షరాలా అందిపుచ్చుకున్నారు వైయస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షు‌డు శ్రీ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సోదరి శ్రీమతి షర్మిల. వైయస్ మరణవార్త తెలిసి గుండె పగిలిన వారి కుటుంబాలను ఓదారుస్తానని నల్లకాలువ ‌సభలో శ్రీ జగన్‌ మాట ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం అడ్డుచెప్పినా‌ వెనుకంజ వేయకుండా ఇచ్చిన మాట కోసం శ్రీ జగ‌న్ ఓదార్పుయాత్ర చేశారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. శ్రీ జగన్‌ ప్రభంజనంలో తమ పునాదులు కదిలిపోతాయని భయపడిన కాంగ్రెస్‌, టిడిపి నాయకులు కుట్రలు, కుతంత్రాలతో ఆయనను జైలు పాలు చేశారు.



Histarical moment in Smt. Sharmila`s walkathon
అయి‌తేనేం..? జననేత ఉదాత్త వారసత్వాన్ని కొనసాగిస్తూ... జగనన్న సంధించిన బాణంలా జనం మధ్యకు వచ్చారు శ్రీమతి షర్మిల. ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ, వైయస్ ఆశయ సాధనే లక్ష్యంగా‌ ఆమె చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఓ చారిత్రక ఘట్టంగా రికార్డులకెక్కుతోంది. ప్రజలతో మమేకమవుతూ ఒక మహిళ మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రకు పూనుకోవడం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకంగా గుర్తించదగిన సందర్భం అని చెప్పక తప్పదు. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో 2500 కిలోమీటర్ల పాదయాత్రను శ్రీమతి షర్మిల తూర్పుగోదావరి జిల్లాలో పూర్తిచేస్తున్నారు.



పది సంవత్సరాల క్రితం మహానేత చేసిన ప్రజాప్రస్థానంలో వెయ్యి కిలోమీటర్ల పూర్తయింది కూడా తూర్పు గోదావరి జిల్లాలోనే అని జిల్లావాసులు, పార్టీ శ్రేణులు గుర్తుచేసుకుంటున్నారు. రెండు మహోజ్వల ఘట్టాలలో స్మరించదగిన మజిలీలు తూర్పు గోదావరి జిల్లా గడ్డపైనే జరగడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



విమర్శకులకు శ్రీమతి షర్మిల నడకే సమాధానం :

2012 అక్టోబర్‌ 18న ఇడుపులపాయలోని మహానేతన డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సమాధి నుంచి ప్రారంభమైన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొండ, కోన, వాగు, వంక, పల్లె, పట్టణాలు, నగరాల మీదుగా కొనసాగుతున్నది. శ్రీమతి షర్మిల మోకాలికి గాయమై శస్త్రచికిత్స జరిగినప్పుడు ఇక పాదయాత్ర ముగిసినట్టేనని ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ఆమె తిరిగి తన నడకతోనే సమాధానం చెప్పారు. రెండు నెలల విశ్రాంతి అనంతరం పాదయాత్రను పునఃప్రారంభించి వైయస్ పంచి ఇచ్చిన రక్తంలోనే ఆ పట్టుదల, వెన్నుచూపని ధీరత్వం ఉన్నాయని చా‌టిచెప్పారు. ఎండయినా, వానయినా ముందుకు సాగుతూనే ఉన్నారు.



వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, గుంటూరు, కృష్ణా, ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొనసాగించారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఆమె పాదయాత్ర చేస్తున్నారు. 187 రోజుల పాదయాత్రలో 91 నియోజకవర్గాలు, 155 మండలాలు, 35 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్‌లు, 1,551 గ్రామాల మీదుగా శ్రీమతి షర్మిల పాదయాత్ర చేశారు.



కాకరాపల్లిలో వైయస్ భారీ విగ్ర‌హం ఏర్పాటు :

అప్పటి చంద్రబాబు ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడేందుకు 2003లో మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలోని ప్రత్తిపాడు వద్ద వెయ్యి కిలోమీటర్లు పూర్తయింది. ఆ సందర్భంగా దివంగత నాయకుడు జక్కంపూడి రామ్మోహనరావు ఆధ్వర్యంలో నిరుపేదలైన వెయ్యి మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అప్పుడే ఏలేరు ప్రాంత రైతాంగం పెద్ద ఎత్తున తరలివచ్చి కాల్వల ఆధునికీకరణ లేక ఎదురవుతున్న ఇబ్బందులను వైయస్‌కు మొరపెట్టుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక వైయస్ ఏలేరు ఆధునికీకరణకు రూ.138 కోట్లు కేటాయించారు.



కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్ ‌ప్రభుత్వం‌ కూడా ఏలేరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్న తీరును మరో ప్రజాప్రస్థానంలో శ్రీమతి షర్మిల స్వయంగా పరిశీలించి జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆధునికీకరణ పూర్తిచేస్తారని రైతులకు భరోసా ఇచ్చారు. తండ్రి ఆశయ సాధనకు పునరంకితమవుతానని చెప్పకనే చెప్పారు. మరో ప్రజాప్రస్థానంలో 2500 కిలోమీటర్ల యాత్ర పూర్తవుతున్న సందర్భంగా తుని నియోజకవర్గం, కోటనందూరు మండలం కాకరాపల్లి వద్ద మహానేత వైయస్ భారీ విగ్రహాన్ని‌ ఆమె ఆవిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా కాకరాపల్లిలోనే భారీ బహిరంగ సభను పార్టీ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. http://www.ysrcongress.com/news/top_stories/histarical-moment-in-smt-sharmilas-walkathon.html
Share this article :

0 comments: