స్త్రీజాతికి ప్రథమ శత్రువు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్త్రీజాతికి ప్రథమ శత్రువు!

స్త్రీజాతికి ప్రథమ శత్రువు!

Written By ysrcongress on Wednesday, March 13, 2013 | 3/13/2013

అంతర్జాతీయ మహిళా సంవ త్సరం సందర్భంగా తను చేసిన తప్పులన్నీ మరిచిపోయి టీడీపీ అధినేత నారా చంద్రబాబు మహిళల కోసం అనేక వరాలు గుప్పించాడు. తన ప్రభుత్వం వస్తే మహిళలకు న్యాయం చేస్తా నని ఊదరగొట్టాడు. మరొక పక్క షర్మిల మీద, ఆమె భర్త మీద అనేక నిందలు వేయిస్తున్నాడు. అతని పార్టీ నాయ కులు సంస్కారాన్ని పక్కనబెట్టి వ్యక్తిగత ఆరోపణలకు దిగజారుతున్నారు.

మొదటి నుంచి బాబు తన రాజకీయ జీవితంలో మహిళల సహకారంతోనో, వాళ్లను విమర్శిస్తూనో పబ్బం గడుపుతూ వచ్చాడు. ఎమర్జెన్సీ అనంతర కాలంలో ఇం దిరా కాంగ్రెస్‌లో చేరి ఇందిరాగాంధీ ప్రభంజనంలో కొట్టు కుని వచ్చి శాసనసభలో పడ్డాడు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వీడి 1983లో మామ స్థాపించిన టీడీపీలో చేరాడు. ముఖ్యనేతలంతా అతన్ని పార్టీలో చేర్చుకోవడా నికి అభ్యంతరం చెప్పారు. భార్య భువనేశ్వరి ద్వారా ఎన్టీఆర్‌ను ఒప్పించి దొడ్డిదారిన పార్టీలోకి వచ్చాడు. అంజయ్య కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకోవడానికి ఎన్నో అడ్డదారులు తొక్కాడని కాంగ్రెస్ నేతలు కథలు కథలుగా చెబుతుంటారు.

టీడీపీలోకి ఇతడు వచ్చాక ముఖ్యులైన నాయకులం దరూ బయటికి వెళ్లిపోకతప్పని పరిస్థితి కల్పించాడు. అలా వెళ్లిన వారిలో నాదెండ్ల భాస్కరరావు, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, పర్వతనేని ఉపేంద్ర, వసంతనాగేశ్వరరావు వంటి వారెందరో ఉన్నారు. ఇలా వెళ్లిపోయిన వారంతా చంద్రబాబు నీచరాజకీయాలను బాహాటంగానే ఎండగ ట్టారు. పార్టీలో తన స్థానాన్ని సుస్థిరపరచుకోవడానికి ఆనాటి నుంచి పత్రికాధిపతులతో, కొంత మంది పాత్రికే యులతో సత్సంబంధాలు పెట్టుకున్నాడు. తనకు గిట్టనివారిపై అబద్ధపు రాతలు రాయించి వాళ్లంతట వాళ్లే పార్టీని వీడే పరిస్థితి కల్పించాడు.

1995 ఆగస్టు సంక్షోభంలో అదే అతనికి కలిసివచ్చిం ది. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేముందు కూడా ఈ తోక పత్రికలే అతనికి అండగా నిలిచాయి. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతిని రాజ్యాంగేతర శక్తిగా చూపించడానికి ప్రతిరోజూ ఆమెకు వ్యతిరేకంగా వార్తలు వచ్చేవి. ఎన్టీఆర్ వాటిని ఖండించిన ప్రతిసారీ ఆయన భార్యకు దాసుడయ్యాడనే నీచమైన కార్టూన్లు ఆ రెండు పేపర్లలో పుంఖానుపుంఖా లుగా వచ్చేవి.

ఈ రోజు వైఎస్ కుటుంబం మీద జరుగుతున్న ‘ఎల్లో’ దాడులే ఆ రోజు ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి మీద కూడా జరిగాయి. వక్రమార్గాలకు అలవాటుపడ్డ ఎల్లో బృందం సభ్యులు ప్రజాస్వామ్యవ్యవస్థకే పెనుముప్పుగా పరిణమించారు. వీళ్ల అధికార దాహానికి ఎన్టీఆర్‌ను బలిచేసి, లక్ష్మీపార్వతిని నిందితురాలిని చేసి తాత్కాలిక విజయం సాధించారు. వీరు చేసిన అవమానాలకు తట్టు కోలేక ఆయన మరణిస్తే ఆ నింద కూడా ఆమె మీదే వేసి ఆమెపై ఓ వర్గంలో వ్యతిరేకతను పెంచారు. మహిళలు వంటిల్లు దాటి బయట కాలుపెట్టరాదని శాసించారు. పత్రికారంగాన్ని ఫక్తు వ్యాపారంగా దిగజార్చి నైతిక విలు వలకు గండికొట్టారు. ఒకవైపు తండ్రీ బిడ్డల్ని వేరు చేసి కుటుంబ వ్యవస్థకే మచ్చతెచ్చారు. మామా అల్లుళ్ల బంధా న్ని క్షుద్రమైనదిగా పరిమార్చిన ఖ్యాతి బాబుకే దక్కుతుంది. 

ఇతని అధికార దాహానాకి వ్యవస్థలన్నీ కళంకితమ య్యాయి. స్పీకర్, గవర్నర్, న్యాయవ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ వంటివన్నీ అప్రదిష్టపాలవడానికి ఇతడు, ఇతని రాజగురువు రామోజీలే కారణం. రాజకీయాల్లో అవినీతి పరాకాష్టకు చేరింది కూడా చంద్రబాబు కాలంలోనే. యావత్ సమాజ వ్యవస్థకు ఇతడు శత్రువు ఎలా అయ్యాడో చెప్పటానికి చాలా నిదర్శనాలే ఉన్నాయి. తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే ద్రోహిగా ఎన్టీఆర్ చేసిన విమర్శ మరిచిపోకూడదు.
ఇదంతా మళ్లీ ఎందుకు చెప్పుకోవాల్సివస్తుందంటే ఇతని రాజకీయ విధానాలు ఎప్పుడూ సూటిగా ఉండవు. అధికారం వస్తుందంటే గాంధీయే మళ్లీ తన రూపంలో పుట్టాడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడడు. కుక్కను చంపాలంటే ముందుగా దాన్ని పిచ్చిదని ముద్రవేయాలి. అప్పుడే నలుగురికి అనుమానం రాకుండా చంపేయ వచ్చు. ఇదే ఇతని ఎల్లో బృందం ఉపయోగించే రాజనీతి.

2004 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెలతిరక్కుండానే చంద్రబాబు ‘పసుపు కూటమి’ ముఖ్యమంత్రి మీద శరపరంపరగా దాడికి పూనుకుంది. అధికార యంత్రాంగం మీద పట్టులేకపోవడంవల్ల ఉన్న తాధికారులు రాష్ట్రాన్ని ఏలుతున్నారని విమర్శలకు లంకించుకున్నారు. ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి ఉందనే కథనాలు, ప్రభుత్వం మీద కేసులు, చేసిన ప్రతి మంచి పనిని చెడుగా చూపించే ప్రయత్నాలు, చివరకు హత్యా రాజకీయాలకు ముడిపెట్టే కుటిల పన్నాగాలు... ఇవన్నీ వీరి క్షుద్ర రాజకీయాలకు సాక్ష్యం పలుకుతాయి. 1983, 1995, 2004లో ఒకే మార్కు రాజకీయాన్ని ఈ బృందం నడిపింది. 2009లో మళ్లీ ప్రజలు ఓడిస్తే చిరం జీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ వల్లే ఓడిపోయానని అబద్ధాలు పుక్కిటపట్టి తిరిగాడు. ప్రజాభిమానాన్ని కోల్పోయిన ఈ ఎల్లో దళానికి ప్రజానేతలైన ఎన్టీఆర్, వైఎస్ ఆగర్భ శత్రువులు.

2010లో మహానేత వైఎస్ హఠాన్మరణంతో ఊపిరి పీల్చుకున్న టీడీపీ అధినేత ఇక అధికారం తనదేనని పగటి కలలు కంటున్న సమయంలో హఠాత్తుగా రాజకీయ యవనికపైకి యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప సమ్మోహనశక్తితో చిచ్చరపిడుగులా దూసుకురావడం అత నికి నిరాశే మిగిలింది. రాష్ట్రమంతా అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలు జగన్ పర్యటనలకు బ్రహ్మరథం పట్టడం తో మళ్లీ కుట్ర రాజకీయాలకు ఈ కూటమి తెరతీసింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు ద్వారా కోర్టుకు లెటరు రాయించి వెంటనే ఇంప్లీడ్ పిటిషన్ ద్వారా వాళ్ల పార్టీ నాయకుల్ని రంగంలోకి దించాడు. రిటైర్ అవబోతున్న చీఫ్ జస్టిస్ కేసును ఆఘమేఘాలపై సీబీఐ విచారణకు ఆదేశించి పదవీ విరమణ చేశాడు. వెంటనే ఆ న్యాయ మూర్తిని ప్రజలంతా విమర్శిస్తున్నా కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై మానవ హక్కుల కమిషనర్‌గా నియమించ డంతో వీరి కుట్ర బట్టబయలైంది. నాటి నుంచి కాంగ్రెస్- టీడీపీల బంధం నానా విధాలుగా కొనసాగుతూనే ఉంది.

జగన్‌ను జైలుకు పంపించిన దరిమిలా రాజకీయంగా ఇకపై అడ్డంకులు ఉండబోవని భావిస్తున్న తరుణంలో షర్మిల పాదయాత్రకు బయలుదేరడం, ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అలవాటైన రాజకీయాస్త్రాన్ని మరోమారు సంధిం చారు. వీళ్లు చెబితే నమ్మరని బీజేపీ నాయకుడిని రంగంలోకి దించారు. ప్రతిరోజూ ఆమె మీద, ఆమె భర్త అనిల్‌కుమార్ మీద పుక్కిటి పురాణాలను పోలిన సత్యదూరమైన కట్టుకథలల్లి దాడులకు పాల్పడుతున్నారు. ఒకటికి పదిమార్లు అంటూ పోతుంటే మేక కుక్క అవుతుందన్న సామెతను వ్యవహారంలో ప్రయోగిస్తు న్నారు. చంద్రబాబు కుటిల రాజకీయాలకు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ వేదికగా మారింది. రోజురోజుకు ఆ పార్టీకి ఆదరణ తగ్గిపోతున్నదంటే అందుకు కారణం అతని కుత్సిత విధానాలే! 

‘మీ కోసం వస్తున్నా’ పేరిట చేపట్టిన పాదయాత్ర అసలు ఉద్దేశం రాబోయే 2014 ఎన్నికల్లో తన కొడుక్కు అధికారం కట్టబెట్టడమే! అందు కోసం మహిళ అని కూడా చూడకుండా షర్మిలపై ఒకపక్క సంస్కారహీనమైన వ్యాఖ్యలు చేస్తూ మరోపక్క మహిళలకు న్యాయం చేస్తానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి వాళ్లను తన రాజకీయానికి పావులుగా వాడుకున్న సంగతి అందరికీ తెలిసిందే! మహిళలకు అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు కారుస్తున్న ఇతడు ఎన్టీఆర్ ఆడపడుచుల శ్రేయస్సు కోరి అమలు చేసిన మద్యనిషేధాన్ని ఆరు నెలల్లోనే తొలగించి, లక్ష బెల్టు షాపులకు అనుమతి ఇచ్చి వారి సంసారాలను గుల్ల చేసిన ఘనుడు!

1997-2002 మధ్యకాలంలో ఆడశిశువు పుట్టగానే ఆ శిశువు పేర రూ,5 వేలు బ్యాంక్‌లో జమచేసి ఆమె పెద్ద య్యాక చేతికి రూ.30 వేలు అందించే ‘బాలికా సమృద్ధి యోజన’ అనే కేంద్ర పథకాన్ని రాష్ట్రంలో సరిగా అమలు చేయకపోవటంతో కేంద్రం ఆ పథకాన్ని ఉపసంహ రించుకుంది. ఆ విధంగా ఆడ పిల్లలకు ఉపయోగపడే ఓ మంచి పథకాన్ని నీరుగార్చి వారి నోట్లో మట్టికొట్టిన ఘనుడూ ఇతడే!

వైఎస్ వచ్చాక అదే పథకాన్ని ‘బాలికా శిశు సంరక్షణ’ అని పేరు మార్చి రూ.30 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచి సమర్థంగా అమలు చేశారు. పావలా వడ్డీకే కోట్లాది రూపాయల రుణాలిప్పించి కోట్లాది మంది మహిళలకు ఉపాధి కల్పించారు. ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలు ఎక్కువ శాతం అట్టడుగు వర్గాల మహిళలకే ఉపయోగపడ్డాయి.

వీటన్నిటినీ పక్కదారి పట్టించడానికి తను చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవటానికి చంద్రబాబు, అతని తోక పత్రికలు పదే పదే షర్మిల మీద, ఆమె కుటుంబం మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇతరుల చేత చేయిస్తున్నారు. ఆడవాళ్లపై ఎంత మాత్రం గౌరవం లేని ఇతనికి రేపు జరిగే ఎన్నికల్లో మహిళా ఓటర్లు తిరిగి కోలుకోలేని విధంగా బుద్ధి చెబుతారు. మహిళలను అడ్డం పెట్టుకుని పైకి ఎదిగి ఆ మహిళలనే అణగదొక్కే పురుషాహంకారి చంద్రబాబు. ఒప్పులన్నీ తనవని, తప్పులన్నీ ఇతరులవని తెల్లవారి లేచింది మొదలు... ఎవరూ నమ్మని మాటలను తన తోక పత్రికల పతాక శీర్షికల్లో అచ్చొత్తించి ఊరేగుతున్న ఇతని రాజకీయ జీవితాన్ని ఒక మహిళే సమాధి చేయబోతున్నది. ఇది తిరుగులేని సత్యం! 
Share this article :

0 comments: