కిరణ్ కేబినెట్‌లోకి చంద్రబాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కిరణ్ కేబినెట్‌లోకి చంద్రబాబు

కిరణ్ కేబినెట్‌లోకి చంద్రబాబు

Written By news on Friday, March 15, 2013 | 3/15/2013


కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెద్ద దించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద శుక్రవారం ఉదయం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు అయ్యాయని ఆయన ఆరోపించారు.చంద్రబాబు, కిరణ్ కలిసి రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని కేటీఆర్ జోస్యం చెప్పారు. 

కాంగ్రెస్‌లో టీడీపీ విలీనానికి బాబు మానసికంగా సిద్ధమయారన్నారు. విపక్షాలు ఏకమై అవిశ్వాసం పెడితే చంద్రబాబు ఎందుకు ముందుకు రావడంలేదు అని ఆయన ప్రశ్నించారు. అవిశ్వాసం తీర్మానం కిరణ్‌పైనే కాదు చంద్రబాబుపైన కూడా అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. త్వరలో జరిగే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో చంద్రబాబుతోపాటు ఆయన అనుచర గణం కూడా చేరనున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్ వేరువేరు కాదని ఈ రోజు స్పష్టమైందని కేటీఆర్ తెలిపారు. 
Share this article :

0 comments: