విజయమ్మ దీక్ష అభినందనీయం:దిలీప్‌కుమార్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మ దీక్ష అభినందనీయం:దిలీప్‌కుమార్

విజయమ్మ దీక్ష అభినందనీయం:దిలీప్‌కుమార్

Written By news on Sunday, April 7, 2013 | 4/07/2013

విజయమ్మ తాను పుట్టెడు కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజాసమస్యపై నిరవధిక నిరాహారదీక్షకు పూనుకోవడం అభినందనీయమని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టీయూఎఫ్) నాయకుడు దిలీప్‌కుమార్ అన్నారు. ఆయన శనివారం రాత్రి.. దీక్షలో విజయమ్మను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కలసి మద్దతు ప్రకటించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం తెచ్చిన పథకాలను కిరణ్ ప్రభుత్వం నీరుగారుస్తోందని ధ్వజమెత్తారు. విజయమ్మ దుఃఖాన్ని దిగమింగుకుని చేస్తున్న దీక్షను ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. తాము తెలంగాణవాదులమైనప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతున్న విజయమ్మకు మద్దతు ప్రకటించడం కనీస ధర్మమన్నారు.
Share this article :

0 comments: