అప్పలస్వామి మృతికి విజయమ్మ సంతాపం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అప్పలస్వామి మృతికి విజయమ్మ సంతాపం

అప్పలస్వామి మృతికి విజయమ్మ సంతాపం

Written By news on Sunday, June 16, 2013 | 6/16/2013

కొణతాల మేనమామ అప్పలస్వామినాయుడు మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సంతాపం తెలిపారు. అప్పలస్వామినాయుడు కుటుంబాన్ని విజయమ్మ పరామర్శించారు. వైవి సుబ్బారెడ్డి, జ్యోతులనెహ్రు, సంజయ్‌కృష్ణ రంగారావు, ధర్మాన కృష్ణదాస్, గండిబాబ్జి, బలిరెడ్డి సత్యారావు, వంశీకృష్ణయాదవ్, తదితర వైఎస్ఆర్ సీపీ నేతలు కూడా అప్పలస్వామినాయుడు మృతికి సంతాపం ప్రకటించారు.




కందుకూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో వైఎస్ఆర్ సీపీ నేత దేపా భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది పార్టీలో చేరారు.

సరూర్‌నగర్ మండలం సాయినగర్‌లో ఉచిత కంటివైద్య శిబిరం నిర్వహించారు. కంటి సమస్యలున్న పేదవారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు.





సామర్లకోట: మైనారిటీలో ఉన్న కిరణ్ సర్కారును చంద్రబాబు కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను అన్నివిధాలా వేధించుకు తింటున్న దుర్మార్గపు ప్రభుత్వాన్ని కూల్చకుండా చంద్రబాబు కాపు కాస్తున్నారని ఆమె విమర్శించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్ లో ఈ సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. 

వైఎస్ఆర్ బతికుంటే ఇప్పటికీ 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేవారని అన్నారు. వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఏ ఒక్క ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు అప్పుల పాలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు లేవు, విద్యుత్‌ లేదు, అన్ని ధరలూ పెరిగాయని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లకు గట్టిగా బుద్ధి చెప్పాలని షర్మిల కోరారు.
Share this article :

0 comments: