వైఎస్ఆర్ సీపీ నేతలు,కార్యకర్తలపై లాఠీఛార్జ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ నేతలు,కార్యకర్తలపై లాఠీఛార్జ్

వైఎస్ఆర్ సీపీ నేతలు,కార్యకర్తలపై లాఠీఛార్జ్

Written By news on Monday, June 10, 2013 | 6/10/2013

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలపై మరోసారి పోలీసులు విరుచుకుపడ్డారు. సోమవారం ఉదయం అసెంబ్లీకి పాదయాత్రగా బయలుదేరిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన నేతలు, కార్యకర్తలపై పోలీసులు తమ జులుం ప్రదర్శించారు. నేతలు, కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టారు.

జై జగన్‌ అంటూ నినాదాలు చేస్తున్న కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పాదయాత్ర చేస్తున్న తమ ఎమ్మెల్యేలకు మద్దతు తెలపడానికే వచ్చామని చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. ప్రభుత్వ అణచివేత ధోరణిని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు ఖండించారు.
Share this article :

0 comments: