దొంగదెబ్బ తీయడం కూడా వీరత్వమేనా!? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దొంగదెబ్బ తీయడం కూడా వీరత్వమేనా!?

దొంగదెబ్బ తీయడం కూడా వీరత్వమేనా!?

Written By news on Monday, June 10, 2013 | 6/10/2013


లక్షల కొలదీ కుళ్లిపోయిన మృతదేహాల్ని ఒక్క చోట రాశిగా పోస్తే వచ్చే భయానక దుర్గంధం నేటి కాంగ్రెస్ వాళ్లు చేస్తున్న కుటిల రాజకీయాల ముందు దిగదుడుపే. ప్రతి తెలుగింటి గుండెలో కొలువు తీరిన జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఏ దారీ కనపడక తమ కనుసన్నలలో నడిచే దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుని, న్యాయస్థానాల్ని తమ తప్పుడు అభియోగాలతో తప్పుదోవ పట్టిస్తున్న ఢిల్లీ హస్తం పెద్దల దిగజారుడు రాజకీయం బహుశా ప్రపంచంలో మరే ఇతర నిరంకుశ పరిపాలకులకు సాధ్యం కాదేమో! మొక్కై వచ్చినవాడు మహావృక్షమైతే తమకు పుట్టగతులుండవని తెలుసుకున్న సదరు కాంగీయులు ఆఖరుకు తమ జీవితకాల శాశ్వత రాజకీయ శత్రువులుగా చెప్పుకునే పచ్చచొక్కా పార్టీవారితో కూడా జగనన్నను కుంగదీసే ప్రయత్నంలో తమతో చీకటి కరచాలనాలకు నాంది పలికారు.

వందేళ్లకుపైగా చరిత్ర చెప్పుకునే వీరికి రెండేళ్ల పసికూన వై.ఎస్.ఆర్. సీపీని చూస్తే ఎందుకు ముచ్చెమటలు పోస్తున్నాయో నడకరాని పసిగుడ్డును అడిగినా చెప్పేస్తాడు. రాజకీయ కక్ష సాధింపు చర్యకు చక్కని నిర్వచనం నిఘంటువులో ఏమైనా ఉన్నదీ అంటే అది జగన్‌పట్ల కాంగీయులు ప్రదర్శిస్తున్న తీరుగా ఘంటాపథంగా చెప్పవచ్చు. అయితే ఒక్కటి నిజం... ఇది ఘోరం, ఇది దారుణం అని మనం గొంతు చించుకోనక్కరలేదు. పైనుండి ఆ దేవుడు చూస్తున్నాడు... ఏం చేయాలో చేస్తాడు, కుటిల రాజకీయాల కుళ్లు కడిగే కాంతిపుంజాన్ని నిర్దోషిగా నిరూపిస్తాడు, కోట్లప్రజల గుండె చప్పుడుకు ప్రతినిధిగా మనముందు నిలబెడతాడు. అంతవరకూ వేయి కనులతో వేచి చూద్దాం.

- పక్కి (బలివాడ) పద్మశ్రీ, విశాఖపట్నం


దొంగదెబ్బ తీయడం కూడా వీరత్వమేనా!?

ఏదో సామెత చెప్పినట్టు రాజకీయాల్లో బాబుగారు ‘బొంకే గొంతు’ ఒకటి సంపాదించుకున్నారు. ఆ ‘గొంతు’ వినిపించడానికి కొన్ని పత్రికలు, ఛానెళ్లని కూడా సంపాదించారు. అవి బాబుగారికి అనుకూలంగా మాట్లాడటమే కాదు, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి ‘గొంతు’ నొక్కడానికి కూడా పని చేస్తాయి. జగన్‌గారు ‘సాక్షి’ని ప్రవేశపెట్టాక పాపం, ఈ వెసులుబాటు బాబుగారికి లేకుండా పోయింది. దాంతో తమ గుత్తాధిపత్యానికి గండి పడిందని బాబుగారు ఆ ‘గ్రహించి’ ‘సాక్షి గొంతు’ నొక్కాలని సంకల్పించారు. అందులో భాగంగానే చిదంబరంతో కలిసి సాక్షి ఆస్తుల జప్తుకు సహకరించారు. శత్రువులను దొంగదెబ్బ తీయటం వీరత్వమనిపించుకోదు. ఏది ఏమైనా జగన్‌ని అడ్డుకోవడం కాంగ్రెస్, టీడీపీలకే కాదు, హరిహరాదులకి కూడా సాధ్యం కాదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుంది. అందాకా జగన్‌కి ఈ కాలపరీక్షలు, సత్యశోధన తప్పవేమో! ఒక గిరిజన మహిళ తనకి జరిగిన అన్యాయానికి ‘మౌనపోరాటం’ చేసి గెలిచింది. వైఎస్ భారతి తమ హక్కుల కోసం ఏ పోరాటం చేసినా ఆమె వెంట ఉండటానికి ఎంతోమంది మహిళలు కదిలి రావడానికి సిద్ధంగా ఉన్నారు.

- కోన పద్మావతి, మంటాడ, కృష్ణాజిల్లా

మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: