పెద్ద రాష్ట్రాల్లో చిన్నబోయిన కాంగ్రెస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పెద్ద రాష్ట్రాల్లో చిన్నబోయిన కాంగ్రెస్

పెద్ద రాష్ట్రాల్లో చిన్నబోయిన కాంగ్రెస్

Written By ysrcongress on Tuesday, March 6, 2012 | 3/06/2012

 పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ చిన్నబోయింది.అయిదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తున్న ప్రజాతీర్పు ఇదే. ఈశాన్యం మూలనున్న మణిపూర్‌ తప్ప మరెక్కడా కాంగ్రెస్‌కి మంచి వార్తలు లేవు. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్‌, సోనియాల నియోజకవర్గాలైన అమేఠీ, రాయబరేలీలలోనూ కాంగ్రెస్‌ వెనుకంజలో ఉంది. ఉత్తరాఖండ్‌, గోవాలలో కాంగ్రెస్‌, బీజేపీలు నువ్వా నేనా అన్నట్టుండగా, పంజాబ్‌లో బాదల్‌ ఓట్ల వర్షం కురిపించుకున్నారు.

 ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీ, అమేధీల్లో కాంగ్రెస్ వెనుకబడింది. లక్నో కంటోన్మెంట్ స్థానంలో పీసీసీ చీఫ్ రీటా బహుగుణ వెనుకంజలో ఉన్నారు. అలాగే రాయబరేలీలోనూ కాంగ్రెస్ వెనుకబడి ఉంది. రాయబరేలీలో ఎస్పీ-3, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు. కాగా రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేధిలో ఎస్పీ-3, కాంగ్రెస్-1, బీజేపీ-1 స్థానంలో ఆధిక్యంలో ఉండగా, కాగా చర్ఖారీ నియోజకవర్గంలో ఉమాభారతి ముందంజలో కొనసాగుతున్నారు.

అకాలీ బీజేపీ కూటమి స్పష్టమైన విజయం దిశగా పయనిస్తోంది. మొత్తం మీద యూపీలో ఊహించినట్టుగానే సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ ఫలితాల పట్ల నిరాశను వ్యక్తం చేసింది. యువనేత రాహుల్‌ను కాపాడేందుకు తప్పంతా తన నెత్తిన వేసుకునేందుకు యూపీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌చీఫ్‌రీతా బహుగుణ ముందుకొచ్చింది. మొత్తం మీద అయిదు రాష్ట్రాల ఓటర్లు కాంగ్రెస్‌కు చేదు మాత్రను ఇచ్చారు.

లక్నో: 403 సభ్యులు గల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ లెక్కింపులో అధికార పక్షమైన బహుజన సమాజ్ పార్టీ కంటే ప్రధాన ప్రతి పక్షమైన సమాజవాది పార్టీ దాదాపు 130 స్థానాల్లో ముందంజలో ఉంది

యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ సొంత నియోజకవర్గం రాయబరేలీలో కాంగ్రెస్ కు ఎదురుగాలి తగలింది. రాయబరేలీలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వెనకబడి ఉంది. రాహుల్ నియోజకవర్గం అమేథిలోనూ అదే తీరు కొనసాగుతోంది. కాంగ్రెస్ కంచుకోటలో కూడా ఎస్పీ పాగా వేయటంతో రాహుల్ కరీష్మా, ప్రియాంక ప్రచారం హస్తానికి ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పవచ్చు. కాగా మరోవైపు సమాజ్ వాదీ పార్టీ మెజార్టీతో ముందుకు దూసుకుపోతుంది. దాంతో ఎస్పీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు
పనాజి: 40 మంది సభ్యులు గల గోవా శాసనసభ ఎన్నికల్లో తాజా లెక్కల ప్రకారం కమలం వికసిస్తుంది. 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ మూడుస్థానాల్లో తన అధిక్యం కొనసాగుతుండగా, గోవా వికాస పార్టీ (గోవిపా) రెండు స్థానాల్లో ముందంజలో ఉంది.


Share this article :

0 comments: