వైఎస్ పథకాలు నిర్వీర్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ పథకాలు నిర్వీర్యం

వైఎస్ పథకాలు నిర్వీర్యం

Written By ysrcongress on Friday, March 9, 2012 | 3/09/2012

* ఇప్పటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోతే.. విద్యార్థుల గతేంకావాలి?
* ఇప్పటికిప్పుడు వేలకు వేలు తేవాలంటే తల్లిదండ్రులేమైపోవాలి?
* ఆరోగ్యశ్రీ, 108, 104 అస్తవ్యస్తం
* రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయపడుతున్నారు

కోవూరు నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు చేరాలని వైఎస్ ఆలోచన చేస్తే.. ఆ పథకాలన్నింటినీ ఎలా నిర్వీర్యం చేస్తే.. ప్రజల మది నుంచి మహానేతను పూర్తిగా తొలగించగలమన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. కోవూరు ఉప ఎన్నికల ప్రచారం నాలుగోరోజు గురువారం ఆయన ఇందుకూరుపేట, కొడవలూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. అడుగడుగునా స్వాగతం పలికిన అభిమానులకు అభివాదం చేస్తూ,కరచాలనం చేస్తూ రోడ్‌షో నిర్వహించారు. పలుచోట్ల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

విద్యార్థులను ఇబ్బందుల్లో పడేస్తున్నారు
పేదల పిల్లలు సైతం ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులు చదువుకోవాలని దివంగత నేత భావించారు. అందుకే ఉన్నత చదువుల కోసం అయ్యే ఫీజును ప్రభుత్వమే భరించేలాఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం కళాశాలల యాజమాన్యాలకు బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందుల్లో పడేస్తోంది. పరీక్షల సమయానికి రూ.30 వేలో, రూ.70 వేలో కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వబోమని యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పటికిప్పుడు తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి తేగలరన్న స్పృహ ప్రభుత్వానికి లేక పోయింది.

ఆరోగ్యశ్రీ అస్తవ్యస్తమైపోయింది..
గతంలో నిరుపేదలకు గుండె, క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులు వస్తే మెరుగైన చికిత్స చేయించుకోలేక ఇబ్బందులు పడేవారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ అలాంటి వారిని ఆదుకునేది. అనేక మంది అపరేషన్లు చేయించుకుని ప్రాణాలను నిలుపుకోవడానికి దోహదపడింది. లక్షలు ఖర్చుపెట్టి ఆరోగ్యంగా చిరునవ్వుతో ఇంటికి సాగనంపేందుకు దివంగత నేత ఈ పథకాన్ని ప్రవేశ పెట్టా రు. అలాంటి పథకం నేడు అస్తవ్యస్తమైపోయింది. ప్రమాదం సంభవించినపుడు అత్యవసరమైన చికిత్స కోసం 108కు ఫోన్ చేస్తే కుయ్.. కుయ్..అంటూ 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేది. ప్రస్తుతం ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందో.. రాదో తెలియదు. ఫోన్ చేస్తే.. ఈ రోజు మా అంబులెన్స్ రిపేరులో ఉందని, డీజిల్ లేదని సమాధానం వస్తోంది. 104 పథకం పరిస్థితి దారుణంగా ఉంది. 104 సిబ్బందికి ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియని పరిస్థితి.

రచ్చబండలో భిక్షం వేస్తున్నారు
మహానేత రాజశేఖరరెడ్డికి ఒక స్వప్నం వచ్చింది. దానికి రచ్చబండ అని పేరు పెట్టారు. ఈ రచ్చబండ ద్వారా గ్రామాల్లోకి రావాలని ఆ గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయో తెలుసుకోవాలని భావించారు. గ్రామానికి వెళ్ళిన తరువాత అక్కడ రచ్చబండపై నిలబడి.. ఇక్కడ అర్హులై ఉండీ.. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, ఇళ్లు, ఫీజురీయింబర్స్‌మెంట్ అందనివారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఒక్క చేయి కూడా పైకి లేవకూడదనేది దివంగత నేత స్వప్నం. అంతలా కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు చేరాలన్నది ఆ నేత ఆలోచన.

ఈ రోజు ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమంలో గ్రామాలకు వెళ్లే ధైర్యం చేయడం లేదు. కష్టసుఖాలు వినడానికి మనస్సూ రాదు. మండల కేంద్రాల్లో మీటింగులు పెట్టి భిక్షం వేసినట్లుగా పెన్షన్లు, ఇళ్లు పంపిణీ చేస్తున్నారు. అది కూడా అధికార పార్టీకి చెందిన వారైతేనే ఇస్తున్నారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో ప్రతిపక్షమైనా తమ తరఫున పోరాటం చేస్తుందని ప్రజలు ఆశగాచూస్తే రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబు అధికార పక్షంతో కుమ్మక్కైపోయారు.

రైతుల గోడు పట్టడం లేదు
ఇప్పుడు రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయపడుతున్నారు. వ్యవసాయం చేయకపోతే పరువు పోతుందేమోనన్న ఆందోళనతో అప్పులు చేసి పంట వేస్తుంటే.. ఈ ప్రభుత్వ నిర్వాకంతో రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. పరువు పోతుందని మొహమాటానికి పోతే ప్రాణాలే ఆగిపోయే పరిస్థితులు తలెత్తాయి. వరి రైతు పంట కోసేటపుడు రూ.700కు తగ్గిపోతున్న ధాన్యం ధర.. మిల్లర్ల చేతికి వెళ్లిన తరువాత రూ.900 పలుకుతోంది.
Share this article :

0 comments: