రాజ్యసభ భయంతో రాత్రికి రాత్రే వేటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజ్యసభ భయంతో రాత్రికి రాత్రే వేటు

రాజ్యసభ భయంతో రాత్రికి రాత్రే వేటు

Written By ysrcongress on Sunday, March 4, 2012 | 3/04/2012

 కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడింది. వైఎస్ అభిమాన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తినా ఉప ఎన్నికల భయంతో సుదీర్ఘకాలం నాన్చుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాత్రికి రాత్రి అకస్మాత్తుగా శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ద్వారా అనర్హత తీర్పు వెలువరించటంలోని ఆంతర్యం 24 గంటలు గడవకముందే బయటపడింది. శనివారం సాయంత్రానికి రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని ముందుగా సమాచారం రావటంతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక రోజు ముందుగా శుక్రవారం వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై అనర్హతను ప్రకటింపచేశారని స్పష్టమవుతోంది. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో అనర్హత నిర్ణయాన్ని స్పీకర్ మనోహర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సరిగ్గా 24 గంటలు గడ వకముందు అంటే శనివారం రాత్రి ఎనిమిది గంటలకు రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. స్పీకర్ శుక్రవారం అనర్హత తీర్పు ప్రకటించకుండా ఉంటే.. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక ఆ నిర్ణయం తీసుకునేందుకు వీలుండేది కాదు. ఒకవేళ తీసుకున్నా న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేవి. పైగా రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలకు ఓటు వేసే అవకాశం దక్కితే అసలుకే మోసం వస్తుందన్న ఆందోళనా సీఎంలో ఏర్పడింది. ఎందుకంటే ప్రస్తుతం అనర్హతకు గురైన 17 మంది, ైవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మతో కలిపి 18 మంది సభ్యులుంటారు. కోవూరు ఉప ఎన్నికలో ప్రసన్నకుమార్‌రెడ్డి విజయం ఖాయమని కాంగ్రెస్ కూడా అంచనా వేస్తోంది. అప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుల సంఖ్యా బలం 19కి చేరుతుంది. టీఆర్‌ఎస్‌కు ప్రస్తుత సభలో 12 మంది సభ్యులున్నారు. 

ఉప ఎన్నికల్లో మరో ఐదు స్థానాలు ఆ పార్టీ గెలిచే అవకాశముందని సర్వే నివేదికలు చెప్తున్నాయి. దాంతో ఆ పార్టీ బలం 17 కు చేరుతుంది. ఇండిపెండెంట్‌గా గెలిచే నాగం జనార్దన్‌రెడ్డి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదే గ్రూపులో చేరే అవకాశముంది. ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టుక ట్టే ఎమ్మెల్యేల బలం 37కు పెరుగుతుంది. ప్రస్తుతం అసెంబ్లీలోని మొత్తం సభ్యుల సంఖ్యను అనుసరించి ఒక రాజ్యసభ సీటు దక్కించుకోవాలంటే 40 మంది ఎమ్మెల్యేల మద్దతుంటే సరిపోతుంది. ఆ లెక్కన ఆ గ్రూపుకు ముగ్గురు మాత్రమే తక్కువగా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు (5), బీజేపీ (2), లోక్‌సత్తా (1) పోరాటం చేస్తున్నాయి. 

ఉప ఎన్నికల్లో వామపక్ష పార్టీలు టీడీపీకి దూరంగా ఉండటంతో రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి మద్దతు ఇచ్చేది అనుమానమే. ఇలా వీరిలో ఎవరో ఒకరు టీడీపీ, కాంగ్రెస్ వ్యతిరేక గ్రూపుతో చేతులు కలిపితే తప్పనిసరిగా రాజ్యసభ స్థానాన్ని గెల్చుకొనే అవకాశముంటుంది. టీడీపీకి ఉన్న బలాన్ని బట్టి రెండు స్థానాలు ఖాయం. ఇక కాంగ్రెస్ పార్టీకి రావలసిన నాలుగింటిలో ఒక స్థానం కోల్పోక తప్పదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలూ కలిపి ఒక ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపితే అసలుకే ఎసరొస్తుందని కాంగ్రెస్ భయపడింది. 

పరపతి, పదవీ పోతుందని... 

ఇదే కాకుండా ఓటింగ్ అంటూ జరిగితే విపరీత పరిణామాలకూ దారితీసే ప్రమాదముందని కిరణ్‌కు భయం పట్టుకుంది. ఇప్పటికే కిరణ్‌కుమార్‌రెడ్డి పైనా, ప్రభుత్వం పైనా సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ భయం కూడా సీఎంను వెంటాడింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రాష్ట్రంలోనే అత్యధికంగా నాలుగు స్థానాలు దక్కుతాయన్న అభిప్రాయం ఆ పార్టీ అధిష్టానంలో ఉంది. అందుకే ఈ నాలుగింటిలో కనీసం రెండింటి ని రాష్ట్రేతర ప్రముఖులకు కేటాయించాలన్న ఆలోచనతో ఉంది. అదే జరిగితే స్థానికంగా రాజ్యసభ స్థానాలపై ఆశలు పెట్టుకున్న రాష్ట్ర నేతలు ఎమ్మెల్యేలను రెచ్చగొట్టే అవకాశమూ లేకపోలేదు. అదే జరిగితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తే అధిష్టానం సూచించే నాయకులు ఓటమి పాలయ్యే ప్రమాదం తప్పదు. ఇలా జరిగితే రాష్ట్రంపై దృష్టి కేంద్రీకరించి ఉన్న కాంగ్రెస్ పెద్దల వద్ద సీఎం కిరణ్ పరపతి కోల్పోక తప్పదు. చివరకు అది తన సీటుకే ఎసరు తెచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన సీఎం రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమాచారాన్ని తెలుసుకుని ఒక రోజు ముందుగా హడావుడిగా అనర్హత వేటు వేయించినట్లు కాంగ్రెస్‌లో విశ్లేషణ సాగుతోంది.
Share this article :

0 comments: