రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డివైపే ఉన్నారని నిరూపిస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డివైపే ఉన్నారని నిరూపిస్తాం

రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డివైపే ఉన్నారని నిరూపిస్తాం

Written By ysrcongress on Sunday, March 4, 2012 | 3/04/2012

అనర్హతకు గురైన ఎమ్మెల్యేలమంతా ఉప ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డివైపే ఉన్నారని నిరూపిస్తాం. రైతులు, రైతు కూలీల పక్షాన నిలబడి రాష్ట్రప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించినందుకు మమ్మల్ని అనర్హులుగా ప్రకటిస్తారని ఊహించాం. 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల నోటిఫికేషన్ తరువాతే మాపై అనర్హత వేటేస్తారని భావించాం. ఆ ప్రకారమే స్పీకర్ నిర్ణయం ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశానుసారమే స్పీకర్ ఇలా చేశారని అనుకుంటున్నాం. 

రైతు సంక్షేమం కోసమే అవిశ్వాసానికి ఓటు
పిల్లి సుభాష్‌చంద్రబోస్ (రామచంద్రపురం)

వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమంకోసం ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. రైతు వ్యతిరేక పాలన సాగిస్తుండటంతో ప్రభుత్వంలో ఇమడలేకనే మేము రైతుసంక్షేమాన్ని కాంక్షించి అవిశ్వాసానికి ఓటేశాం. వేటుపడిన ఎమ్మెల్యేలందర్నీ ఉప ఎన్నికల్లో వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలే భారీ మెజారిటీతో గెలిపిస్తాయి.

టీడీపీ, కాంగ్రెస్‌ల అడ్రస్ గల్లంతే
శోభానాగిరెడ్డి (ఆళ్లగడ్డ)

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలపక్షాన ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రైతుల పేరిట కాంగ్రెస్, టీడీపీలు అవిశ్వాస తీర్మాన సమయంలో డ్రామాలు ఆడితే జగన్‌వర్గ ఎంఎల్‌ఏలు పదవులు లెక్కచేయకుండా రైతుల పక్షాన నిలిచారు. రాష్ట్రంలో 2004 ముందునాటి పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది. ఉపఎన్నికల తర్వాత టీడీపీ, కాంగ్రెస్ పార్టీల అడ్రస్ గల్లంతవుతుంది.

దురుద్దేశంతోనే సాగదీత
గడికోట శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి)

మా శాసనసభ్యత్వాలను రద్దుచేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సమష్టిగా స్వాగతిస్తున్నాం. రైతు సమస్యల పరిష్కారం కోసం మా పదవులను సైతం త్యజించేందుకు సిద్ధపడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేశాం. మమ్మల్ని అనర్హులుగా ప్రకటించడంలో ప్రభుత్వం తీవ్రస్థాయిలో రాజకీయాలకు పాల్పడింది. వెంటనే వేటువేయకుండా, ఇంతకాలం సాగదీస్తూ రావడం దురుద్దేశంతోనే. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు మాపై స్పీకరు అనర్హత వేటువేశారు.

బానిస సంకెళ్ల నుంచి బయటపడ్డాం
కె.శ్రీనివాసులు (రైల్వేకోడూరు)

ఇప్పుడు మేమంతా బానిస సంకెళ్ల నుంచి బయటపడ్డాం. వైఎస్ రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం ద్వేషంతో ఆ కుటుంబంపై చేస్తున్న కక్ష సాధింపు చర్యలను ప్రజలకు వివరిస్తాం. వైఎస్ భిక్ష ద్వారా పదవులు పొందిన మంత్రులు అసెంబ్లీలో విజయమ్మపై అవహేళనగా మాట్లాడటాన్ని చూసి సభ్యసమాజం తలదించుకుంటోంది. 

కాంగ్రెస్-టీడీపీ కుయుక్తులను ఎండగడ్తాం
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల)

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు రైతులు, రైతు కూలీల పక్షాన నిలిచినందుకు తృప్తిగా ఉంది. 1994 నుంచి వైఎస్ కుటుంబం ఆశీస్సులతో రాజకీయాల్లో కొనసాగుతున్నా, ఇకముందూ ఆ కుటుంబాన్ని వెన్నంటి ఉంటా. కాంగ్రెస్-టీడీపీ కుయుక్తులను ప్రజలకు వివరిస్తాం. ఉప ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో బంపర్ మెజార్టీతో అసెంబ్లీలో అడుగుపెడతాం.

రైతుల పక్షాన నిలిచినందుకు గర్వపడుతున్నా
మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)

అన్నం పెట్టే రైతన్నకోసం ఎమ్మెల్యే పదవి వదులుకున్నందుకు గర్వపడుతున్నా. అవిశ్వాసానికి మద్దతుగా ఓటేస్తే పదవులు పోతాయని తెలిసే అన్నదాతకు అండగా ఉన్నాం. పదవిని ఎందుకు కోల్పోవాల్సి వచ్చిందో ప్రజల్లోకి వెళ్లి వివరిస్తాం. మేమంతా తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతాం.

ప్రజలు ఎవరిపక్షమో తేలిపోతుంది
చెన్నకేశవరెడ్డి (ఎమ్మిగనూరు)

స్పీకర్ నిర్ణయానికి ధన్యవాదాలు. రైతులు, రైతు కూలీలకు మద్దతుగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుస్తాం. 2014కు ముందు జరిగే ఈ ఎన్నికలు మంచి శుభపరిణామం. దీనిద్వారా ప్రజలు ఎవరివైపు ఉన్నారనేది స్పష్టమవుతుంది. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు.

ప్రభుత్వం కళ్లు తెరిపిస్తారు
టి.బాలరాజు (పోలవరం)

కష్టాల్లో ఉన్న రైతులు, రైతు కూలీల పక్షాన నిలబడి ఎమ్మెల్యేగా అనర్హత వేటుకు గురైనందుకు గర్విస్తున్నా. పదవిని కాపాడుకునేందుకు ఏమైనా చేసే ఈ రోజుల్లో మేం ప్రజలకోసం పదవిని త్యజించినందుకు తృప్తిగా ఉంది. ఇలా రైతుల, కూలీల పక్షాన నిలబడి దేశ చరిత్రలో పదవులు పోగొట్టుకున్నవారు ఇప్పటివరకూ ఎవరూ లేరు. ప్రజలు సమయంకోసం ఎదురు చూస్తున్నారు. ఉప ఎన్నికల్లో వారు ప్రభుత్వం కళ్లు తెరిపిస్తారు.

ఆనందంగా ఉంది
మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి)

నాకు ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం. ప్రజలే నాకు శ్రీరామరక్ష. ప్రతిపక్ష పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా రైతు సమస్యలకోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాం. రైతు వ్యతిరేక ప్రభుత్వాలు ఎక్కువకాలం మనలేవు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా త్వరలో కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం.

జగన్‌కు వెన్నుదన్నుగా నిలుస్తా
ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట)

స్పీకర్ చర్య సంతోషాన్నిచ్చింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసినప్పుడే నేనూ ఆ పార్టీని వీడాలని భావించా. కొన్ని కారణాలతో ఆగాను. రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకోసం జగన్‌కు వెన్నుదన్నుగా నిలుస్తా. జగన్‌ను సీఎం చేయడం ద్వారా పేదలకు మేలు చేసే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తాం. నరసన్నపేట ఉప ఎన్నికల్లో ఘనవిజయంతో మా జైత్రయాత్రను ప్రారంభిస్తాం. 

వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకెళతా
గొల్ల బాబూరావు (పాయకరావుపేట)

ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కాలుపెడతా. రైతు, రైతుకూలీల పక్షాన నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఎమ్మెల్యేగా సభ్వత్వాన్ని కోల్పోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వ మొండివైఖరి నుంచి విముక్తి పొందా. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. వైఎస్ జగన్‌కు రాష్ర్టంలోని అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి.
Share this article :

0 comments: