జగన్ నివాసానికి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ నివాసానికి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు

జగన్ నివాసానికి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు

Written By ysrcongress on Monday, March 5, 2012 | 3/05/2012

జగన్ నివాసానికి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు
కాంగ్రెస్, టీడీపీ, సీబీఐలపై ఆగ్రహం...వాటికి వ్యతిరేకంగా నినాదాలు 
ఏ తప్పూ చేయని జననేతను ఏ ఆధారం చూపకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్న 
అరెస్ట్ ప్రచారమంతా వదంతులేనని సముదాయించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు 
జగన్ స్వయంగా కనిపించి అభివాదం చేయటంతో శాంతించిన అభిమానులు 
జగన్‌ను అరెస్ట్ చేస్తామని సీబీఐ ఆ పార్టీల నాయకులకు చెప్పిందా? లేక అరెస్ట్ చేయాలంటూ వీరే సీబీఐని ప్రభావితం చేస్తున్నారా? 
అరెస్ట్ వదంతులు వ్యాప్తిచేయటంపై కాంగ్రెస్‌లోని వైఎస్ అభిమాన నాయకుల ప్రశ్న

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఎలాగైనా అరెస్టు చేయించాలని కోరుకుంటున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ నాయకులు.. ఆ మేరకు గత కొద్ది రోజులుగా దుష్ర్పచారం సాగిస్తున్నాయి. గత పక్షం రోజులుగా నాయకులు మాట్లాడుతున్న ప్రతి చోటా ఈ విషయంపైనా విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. కొద్ది రోజులుగా అసెంబ్లీ లాబీల్లో నాయకులు కొందరు.. జగన్ త్వరలోనే అరెస్టవుతారంటూ పదేపదే వదంతులు ప్రచారం చేయటం మొదలుపెట్టారు. గత రెండు రోజులుగా దీన్ని మరింత విస్తృతం చేశారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేమన్న కారణంగా కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ‘‘జగన్‌ను అరెస్టు చేయాలంటే.. ఆయన తప్పుచేశారనటానికి స్పష్టమైన ఆధారాలు ఉండాలి. 

ఏ తప్పూ చేయకుండా, ఎలాంటి ఆధారాలూ లేకుండా అరెస్టు చేస్తారని ఈ నాయకులు ఎలా చెప్పగలరు? ఎలాంటి ఆధారాలు చూపకుండా జగన్‌ను అరెస్టు చేయాలని కాంగ్రెస్, టీడీపీ నాయకులు కోరుకుంటున్నారంటే రాజకీయంగా ఎదుర్కొనలేమనే కదా? అరెస్టు చేస్తారని వదంతులు పుట్టిస్తున్న నేతలు అందుకు తగ్గ ఆధారాలున్నాయని చెప్పకుండా ఒక పథకం ప్రకారం ప్రచారం చేయటం, దాన్నే ఎల్లో మీడియా కథలు కథలుగా రాయటం, ఇదంతా కావాలని సృష్టిస్తున్న గందరగోళం’’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్‌ను అరెస్టు చేయాలని కోరుకుంటున్న కొందరు నేతలు ఆ మేరకు శనివారం ప్రచారం తీవ్రతరం చేయటం.. ఎల్లో మీడియా, ప్రత్యేకించి ఒక చానల్ విశ్వసనీయ వర్గాలు చెప్పాయంటూ ఈ వదంతులను ప్రసారం చేయటంతో పార్టీ కార్యకర్తల్లో కొంత అలజడికి కారణమైందని ఆయన మీడియాతో పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఈ రకమైన ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామునుంచే జగన్ నివాసానికి పార్టీ కార్యకర్తలు చేరుకోవటం ప్రారంభమైంది. ‘అరెస్టు చేయటానికి కనీసం కొన్ని ఆధారాలైనా ఉండాలి.. ఏవీ లేకుండా ప్రజాదరణ కలిగిన నాయకుడిని ఎందుకు అరెస్టు చేస్తారు?’ అని అక్కడికి వచ్చిన అభిమానులు ప్రశ్నించటం ప్రారంభించారు. ఉప ఎన్నికల్లో పాల్గొంటున్న ఒక టీడీపీ నాయకుడు జగన్‌ను అరెస్టు చేస్తున్నారని చెప్పటం, అంతకు ముందు రోజు అసెంబ్లీ లాబీల్లో కృష్ణా జిల్లాకు చెందిన మరో టీడీపీ నాయకుడు ఒకటి రెండు రోజుల్లో జగన్ అరెస్టవుతారని ప్రచారంలో పెట్టటం వంటివన్నీ కావాలని చేస్తున్న దుష్ర్పచారంగా నేతలు కొట్టివేశారు.

నిత్యం ప్రజల్లో ఉంటున్న జగన్‌కు వారి నుంచి విశేష ఆదరణ లభిస్తుంటే చూసి ఓర్వలేక ఇలాంటి ప్రచారానికి ఒడిగట్టారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పలువురు నేతలు అక్కడికొచ్చిన కార్యకర్తలను సముదాయించారు. ‘‘జగన్ అరెస్టు కావటం ఖాయమని పార్టీ సమావేశాల్లో పలుసార్లు చంద్రబాబు పేర్కొనటం, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో కొందరు మంత్రులు సైతం త్వరలోనే అరెస్టు అంటూ ప్రచారం చేస్తుండటాన్ని బట్టి సీబీఐ అధికారుల నుంచి వీరికేమైనా సంకేతాలు వచ్చాయా? లేక ఈ నాయకులే సీబీఐని ఆ విధంగా ప్రభావితం చేయాలన్న కుట్రలో భాగంగానే ఇంతటి నీచానికి ఒడిగట్టారా? లేదంటే గత రెండున్నరేళ్లుగా నిత్యం ప్రజల మధ్య ఉంటున్న నేతను ఎలాంటి ఆధారాలు చూపకుండా అరెస్ట్ చేస్తారని ఎలా చెప్పగలరు?’’ అని వైఎస్‌పై అభిమానమున్న కాంగ్రెస్ నాయకులే ప్రశ్నిస్తున్నారు. 

లోతుగా గమనిస్తే డిసెంబర్ 5 అవిశ్వాస తీర్మానానికి వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు మద్దతు పలికిన రోజు నుంచి ఇలాంటి ప్రచారాన్ని ఎక్కువ చేశారని అంటున్నారు. అరెస్టుకు సంబంధించి పనిగట్టుకుని జరుగుతున్న ఈ ప్రచారాన్ని సహజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, జగన్ అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. శనివారం ఇలాంటి ప్రచారానికి మరింత పదును పెట్టటంతో కార్యకర్తలు ఆందోళనతో తమ నాయకుడి ఇంటికి వేలాది సంఖ్యలో తరలి వచ్చారు. అరెస్టు అంటూ వదంతులతో అసలేమి జరుగుతోందో అర్థం కాక అభిమానులంతా ఉద్వేగానికి లోనయ్యారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే జగన్ అనుకూల నినాదాలు చేస్తూ అక్కడే కూర్చున్నారు. జననేతపై కుట్రలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్, టీడీపీలతో పాటు సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. కార్యకర్తలు, అభిమానుల్లో నెలకొన్న ఈ గందరగోళంతో పలువురు ముఖ్యనేతలు తెల్లవారుజామున జగన్ నివాసానికి చేరుకుని ఇవన్నీ ఉత్తి వదంతులేనని ఎంతగా వారించినా కార్యకర్తలు అక్కడి నుంచి కదల్లేదు. జగన్ ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు అరెస్టు చేస్తారంటూ నేతలు కార్యకర్తలను సముదాయించారు. కొందరు మీడియా ప్రతినిధులు చేసిన హడావుడిపై కూడా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు వారించినావినే పరిస్థితి లేకపోవడంతో జగన్ స్వయంగా బయటకొచ్చి అభివాదం చేయటంతో వారంతా శాంతించి వెనుదిరిగారు.
Share this article :

0 comments: