మేం అవిశ్వాసం పెడితే మద్దతిస్తారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మేం అవిశ్వాసం పెడితే మద్దతిస్తారా?

మేం అవిశ్వాసం పెడితే మద్దతిస్తారా?

Written By ysrcongress on Sunday, March 10, 2013 | 3/10/2013

బాబు అసెంబ్లీకి రారట.. అవిశ్వాసం పెట్టరట! 
అదేమని అడిగితే... వైఎస్సార్ కాంగ్రెస్‌నే ఆ పని చేయమంటున్నారు
అవిశ్వాసం పెడితే.. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తేలిపోతుంది
కేసుల భయంతోనే కాంగ్రెస్ ముందు చంద్రబాబు మోకరిల్లారు
ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సకాలంలో నీరు రాదు, కరెంటు ఉండదు
గ్యాస్ రేట్లు, ఎరువుల ధరలు, బస్సు, కరెంటు చార్జీలు.. అన్నీ పెరిగాయి
ఈ ప్రభుత్వం మాకొద్దని ప్రజలు నినదిస్తున్నా చంద్రబాబు అవిశ్వాసం పెట్టరట
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’శనివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 86, కిలోమీటర్లు: 1,186.5

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రారట. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయరట. ప్రజలు వద్దనుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టరట. ఇదేమని అడిగితే వైఎస్సార్ సీపీని తీర్మానం పెట్టమంటున్నారు. వైఎస్సార్ సీపీకి ఆ శక్తి ఉండి ఉంటే బాబు లాగా కళ్లప్పగించి చూస్తూ ఊరుకోదు. తగినంత బలం లేకున్నా అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే మీరు మద్దతిస్తారా చంద్రబాబూ?

తమను పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమకొద్దని ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నా.. చంద్రబాబు.. సర్కారుకు పూర్తి అండదండలందిస్తూ రాష్ట్ర ప్రజలను నిలువునా వంచిస్తున్నారు. అవిశ్వాసం పెట్టకుండా తప్పించుకునేందుకు సాకులు వెతుకుతున్నారు.

చంద్రబాబుకు శక్తి ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టరు. ఎందుకో తెలుసా.. ఆయనపై ఉన్న అవినీతి కేసుల్లో అరెస్టవుతారని భయం. అందుకే కాంగ్రెస్‌తో కలిసి పోయి కిరణ్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఆ కుయుక్తులతోనే చీకట్లో వెళ్లి చిదంబరాన్ని కలుస్తున్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తేలిపోతుంది.

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రారట. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయరట. ప్రజలు వద్దనుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టరట. ఇదేమని అడిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తీర్మానం పెట్టమంటున్నారు. చంద్రబాబు గారూ.. వైఎస్సార్ సీపీకి ఆ శక్తి ఉండి ఉంటే మీ లాగా కళ్లప్పగించి చూస్తూ ఊరుకోదు. మీరంటున్నారు కాబట్టి.. తగినంత బలం లేకున్నా అవిశ్వాసం పెట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మేం అవిశ్వాస తీర్మానం పెడితే మీరు మద్దతిస్తారా చంద్రబాబూ?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల... టీడీపీ అధినేతను సూటిగా ప్రశ్నించారు. 

అవిశ్వాస తీర్మానం పెడితే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తేలిపోతుందని ఆమె సవాలు విసిరారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, సర్కారుకు వెన్నుదన్నుగా నిలుస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరికీనిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలంలో సాగింది. గణపవరం బొడ్రాయి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు కుట్రలు, అవిశ్వాసం మీద వారి డ్రామాలపై షర్మిల నిప్పులు చెరిగారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే.. 

ఆ కుయుక్తులతో చీకట్లో చిదంబరాన్ని కలిశారు.

‘‘చంద్రబాబుకు శక్తి ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టరు. ఎందుకో తెలుసా.. ఆయనపై ఉన్న అవినీతి కేసుల్లో అరెస్టవుతారని భయం. ప్రజల ఇబ్బందులను వదిలేసి అదేదో జాతీయ సమస్యయినట్టు ఆయన నా భర్త గురించి మాట్లాడుతున్నారు. ఇంతకంటే నీచ, దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? ఒకే అబద్ధాన్ని వందసార్లు చెబితే దాన్ని నిజమని నమ్ముతారనేది చంద్రబాబు కుయుక్తి. ఇలాంటి కుయుక్తులతోనే ఆయన చీకట్లో చిదంబరాన్ని కలిశారు. తన మీద కేసుల్లో దర్యాప్తు జరగకుండా మేనేజ్ చేసుకున్నారు. చంద్రబాబు అవినీతి అంతా ఇంతా కాదు. కమ్యూనిస్టులు బాబు అవినీతి గురించి చెప్తూ ‘చంద్రబాబు జమానా.. అవినీతి ఖజానా’ అని ఏకంగా పెద్ద పుస్తకమే ప్రచురించారు. ‘నా అల్లుడు అవినీతిపరుడు’ అని ఎన్టీఆరే స్వయంగా ఎన్నోసార్లు చెప్పారు.

కష్టాల సుడిగుండంలో రాష్ట్ర ప్రజలు

ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సకాలంలో నీరు రాదు. కరెంటు అసలుకే ఉండదు. ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. కరెంటు చార్జీలు షాక్ కొడుతున్నాయి. అయినా రైతు ఆరుగాలం కష్టపడి పండిస్తే దానికి గిట్టుబాటు ధర దొరకదు. వైఎస్ ఉన్నప్పుడు మిర్చి క్వింటాలు రూ.11 వేలుండేది. కానీ ఇప్పుడు రూ.5 వేలు కూడా ఇవ్వడం లేదు. అకాల వర్షానికి చేతికొచ్చిన పంట కాస్తా తడిసి నానిపోతే అది కూడా రాదు. లక్షల రూపాయలు అప్పులు చేసి రైతులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు. తీసుకున్న అప్పు తీర్చేందుకు ఆస్తులు, మంగళసూత్రాలు అమ్ముకుని అవి కూడా చాలక కిడ్నీలు కూడా అమ్ముకుంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తోంది తప్పితే అన్నదాతను ఆదుకోవాలన్న ఆలోచన చేయడం లేదు. ఇక రాష్ట్రంలో మహిళల పరిస్థితి చూస్తే మనసు బాధ కలుగుతోంది. ఎక్కడికెళ్లినా ‘అమ్మా మంచినీళ్లు లేవు. లీటరు రూ.10 పెట్టి కొనుక్కుంటున్నాం. రోజంతా పనిచేస్తే మాకొచ్చే కూలీ రూ.100. వాటితో ఇంటి సరుకులు కొనాలా? పిల్లల ఫీజులు కట్టాలా. ప్రభుత్వ చార్జీలు చెల్లించాలా?’ అని ఆడపడుచులు అల్లాడుతున్నారు.

పిల్లలకు చదువుల్లేవు.. చదువుకున్న వారికి ఉద్యోగాల్లేవు

పేద విద్యార్థుల చదువుల కోసం వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అటకెక్కింది. విద్యార్థులకు పాత బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. చదువుకోవాలని ఆరాటపడుతున్న పిల్లలను ప్రభుత్వం చదివించదు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించదు. ఏ పాఠశాలలో చూసినా డ్రాపవుట్లు పెరిగిపోతున్నాయి. పిల్లలు చదువు మానేసి కూలి పనులకు పోతున్నారు.

అన్ని చార్జీలూ పెంచేశారు..

ఒక్క చార్జీ కూడా పెంచబోమని వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పన్నులు ఎలా వేయాలా అనే ఆలోచనలో తలమునకలయ్యారు. కిరణ్ ప్రభుత్వంలో గ్యాస్ ధర పెరిగింది. ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచారు. ఇక కరెంటు చార్జీలయితే అమాంతం పెంచారు. సర్‌చార్జీ పేరిట రూ.32 వేల కోట్ల భారాన్ని ప్రజల నెత్తిన మోపి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇక నిత్యావసరాలు.. వాటిలో ధర పెరగనివే లేవు. ఇవి భరించలేక ప్రజలు..ఈ ప్రభుత్వం మాకొద్దని నినదిస్తుంటే.. చంద్రబాబు అదే ప్రభుత్వంతో కుమ్మక్కై అంటకాగుతున్నారు. అవిశ్వాసం పెట్టనంటున్నారు.

పేదల పెన్నిధి వైఎస్..

పేదల పట్ల వైఎస్ అంతులేని మమకారం ప్రదర్శించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, సాగునీరు, 108, వృద్ధాప్య పింఛన్ లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. జగనన్న ముఖ్యమంత్రి అయితే వైఎస్ సువర్ణయుగం మళ్లీ తెస్తారు. రైతులు, మహిళలు, యువతకు కష్టాలు దూరమవుతాయి. దేవుడు చూస్తున్నాడు. జగనన్న ఏ తప్పూ చేయలేదు కాబట్టి త్వరలోనే బయటకొస్తాడు.

నాడు రైతు.. నేడు వాచ్‌మన్

షర్మిలతో మాట్లాడుతున్న ఈ రైతు పేరు రాగి వెంకటేశ్వర్లు. ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతానికి చెందిన ఈయన ఒకప్పుడు బాగా బతికిన రైతు. ఈయన గురించి గణపవరం సభలో షర్మిల మాట్లాడుతూ.. ‘‘పొద్దున నన్ను ఒక రైతు కలిశాడు. ‘అమ్మా పంటలు వేసుకోవడానికి ఐదెకరాల పొలమైతే ఉందికానీ.. పంట వేసిన ప్రతిసారీ నష్టమే వచ్చింది. సాగునీరు లేదు. కరెంటు రాదు. అప్పటికీ కష్టం ధారపోసి అంతో ఇంతో పండిస్తే పండిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు. వ్యవసాయం ఏమీ లాభం లేదమ్మా. అందుకే మానేశా’నని చెప్పాడు. మరి ఇప్పుడేం చేస్తున్నావు పెద్దాయనా అని అడిగితే.. ‘పత్తి మిల్లులో వాచ్‌మన్‌గా చేస్తున్నా. నెలకు రూ.3 వేలు జీతమిస్తున్నారు. వైఎస్ ఉన్నప్పుడు సకాలంలో పంటకు నీరందేది. మళ్లీ అన్న వస్తేనే ఆ రోజులు వస్తాయి’ అని నా చేయి ముద్దాడి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది ఈ ఒక్క రైతు పరిస్థితేకాదు.. రాష్ట్రంలో ప్రతీ రైతు దుస్థితీ ఇదే’’ అని ఆవేదన వ్యక్తంచేశారు.

నేడు యాత్రకు విరామం

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు ఆదివారం ఒక రోజు విరామం ప్రకటించారు. శివరాత్రి నేపథ్యంలో గుంటూరు జిల్లాలో అత్యంత ప్రాచుర్యం పొందిన కోటప్పకొండ తిరునాళ్లు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఆ ప్రాంత పరిసరాల్లో భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తారు. దీంతో ప్రజలు, పార్టీ కార్యకర్తల కోరిక మేరకు, జిల్లా పోలీసు యంత్రాంగం సూచనల మేరకు పాదయాత్రను ఒకరోజు నిలిపి వేస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, గుంటూరు జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ ప్రకటించారు. సోమవారం యాత్ర యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. 

పాదయాత్ర శనివారం గుంటూరు జిల్లా నాదెండ్ల మండల కేంద్రం శివారు నుంచి ప్రారంభమైంది. జాస్టివారి పాలెం, గణపవరం మీదుగా 9 కి.మీ. మేర సాగింది. గణపవరంలో షర్మిలకు బంతిపూల జల్లుతో స్వాగతం పలికారు. షర్మిల రాత్రి గణపవరం శివారులో ఏర్పాటు చేసిన శిబిరంలో బస చేశారు.
Share this article :

0 comments: