రైతుల బతుకులు భారం: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతుల బతుకులు భారం: షర్మిల

రైతుల బతుకులు భారం: షర్మిల

Written By news on Sunday, April 14, 2013 | 4/14/2013

 కిరణ్‌సర్కారు హయాంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సంక్షేమ పథకాలన్ని నిర్వీర్యమైపోయాయని షర్మిల అన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా మైలవరంలో జరిగిన సభలో కిరణ్ సర్కార్ పై షర్మిల నిప్పులు చెరిగారు. మహానేత ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతోమంది ప్రాణాలు నిలబడ్డాయని షర్మిల గుర్తు చేశారు. రాజశేఖర్‌రెడ్డిగారి రెక్కల కష్టం మీద ఈ ప్రభుత్వం వచ్చిందని.. ఈ ప్రభుత్వ హయంలో బతుకు భారమైపోయిందని రైతులు బాధపడుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్లనే విద్యుత్ సమస్య తలెత్తిందని, కేవలం మూడు గంటలు కూడా ఈ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ ఇవ్వలేకపోతోందని షర్మిల అన్నారు. పంటలకు నీరందక రైతులు నష్టపోతున్నారని, కరెంటు ఇవ్వమంటే తలుపులు కిటికీలు తెరిచి పడుకోమంటున్నారు ఈ ముఖ్యమంత్రి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలు కోటలు దాటుతాయని.. కాని ఆయన చేతలు గడపకూడా దాటవన్నారు.

కరెంటు ఇవ్వకుండానే దారుణంగా బిల్లులు వేస్తున్నారని, ప్రజల రక్తం పిండైనా సరే బిల్లుల్ని ఈ ప్రభుత్వం వసూలు చేయాలనుకుంటోందన్నారు. అవిశ్వాస తీర్మానం విషయంలో కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కై.. ప్రజల నమ్మకాన్ని పణంగా పెట్టి కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారన్నారు. ప్రభుత్వం కూలిపోయిఉంటే.. ఈఛార్జీలు ప్రజలనెత్తిన పడి ఉండేవికావని, చంద్రబాబు అడుగుజాడల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి నడుస్తున్నారని షర్మిల విమర్శించారు. 
Share this article :

0 comments: