రాజ్యాంగ సంస్థల నోటా రామోజీ రాగం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజ్యాంగ సంస్థల నోటా రామోజీ రాగం

రాజ్యాంగ సంస్థల నోటా రామోజీ రాగం

Written By news on Saturday, April 20, 2013 | 4/20/2013

http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=61090&Categoryid=1&subcatid=1

*అప్పట్లో ఉప ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డిపై ‘ఈనాడు’ అశ్శరభ శరభ
*టీడీపీ ప్రెస్‌మీట్‌ను ఫుల్‌పేజీ వండిన రామోజీ పత్రిక
*అందులో చేసిన వ్యాఖ్యలనే ప్రాధికార సంస్థ ముందు యథాతథంగా వల్లించిన ఈడీ.. రాంకీ పెట్టుబడుల విషయంలో సీబీఐ బాటలోనే ఈడీ వాదనలు
*అసలు దోషి బాబును వదిలిపెట్టి దర్యాప్తు సంస్థల డ్రామాలు.. జగతి పెట్టుబడిదారుల్లో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందని వారు లేనే లేరన్న ఈడీ.. ఉన్నారంటూ గతంలో సీబీఐ చార్జిషీట్.. వారిని మోసగించి పెట్టుబడి పెట్టించారంటూ వాదన
*జగనే లక్ష్యంగా సీబీఐ, ఈడీ దర్యాప్తు.. వాస్తవాల్ని ‘సాక్షి’ పరిశోధించి చెప్పినా పట్టించుకోని వైనం
*చట్టం ముందు తమ వాదనలు నిలవవని తెలిసే... దిగజారుడు కథనాలు..
*రామోజీ చెబుతారు... దాన్నే బాబు చెప్పిస్తారు. 
*బాబు చెప్పిస్తారు... దాన్నే రామోజీ ప్రచురిస్తారు.
*మళ్లీ దాన్ని ఎల్లో బాబులంతా అందుకుంటారు. 
*ఇదో సైకిల్. ఇదో విష వలయం.

కానీ ఈ సైకిల్ ఇక్కడితో ఆగటం లేదు. ఇపుడు రామోజీ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్నే కాకుండా... సీబీఐ ఆఫీసును, ఆఖరికి ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ కార్యాలయాన్ని కూడా చుట్టబెట్టేస్తోంది. ఫలితం... బాబు ద్వారా రామోజీ ప్రవచించి, ప్రచురించిన విషపు రాతల్నిపుడు ఈ ఏజెన్సీలు సైతం వల్లిస్తున్నాయి. పెట్టుబడుల కేసులో అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిన వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని... వర్గ శత్రువుగా చూస్తున్నాయి. న్యాయాధికారుల ముందు కూడా ఆయనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నాయి. వాటిని మళ్లీ రామోజీ విషపుత్రిక ‘ఈనాడు’, దాని తోకపత్రిక పతాక శీర్షికల్లో ప్రచురిస్తున్నాయి. అందులో భాగమే.. ‘జగన్.. ఓ గజనీ’ అంటూ న్యాయ ప్రాధికార సంస్థ ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ వాదించటం... దాన్ని ‘ఈనాడు’, తోకపత్రిక అచ్చేయటం. పది నెలల కిందట... అంటే గతేడాది జూన్ 8న తెలుగుదేశం తమ్ముళ్ల చేత పనిగట్టుకుని చెప్పించిన అసత్యాలను రామోజీ తన ‘ఈనాడు’లో ఇదే శీర్షికన అచ్చువేశారు!! అదే విచిత్రం.

విచారణ కూడా ఇంకా మొదలుకాలేదు. కోర్టులకు పూర్తి వాదనలు తెలియనే లేదు. కానీ నాణేనికి ఒకవైపునే చూపించే ఏకపక్ష వాదనల్ని పతాక శీర్షికల్లో ప్రచురిస్తున్నారు. దర్యాప్తు సంస్థలైతే ఎంపిక చేసుకున్న మీడియాకు మాత్రమే లీకులిస్తున్నాయి. దర్యాప్తు అధికారులు సైతం ఒక వర్గం మీడియాతోనే ఫోన్లు చేసి మరీ మాట్లాడుతున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబ పరువుప్రతిష్టల్ని దిగజార్చాలనే ఏక సూత్ర ఎజెండాతో చెలరేగిపోతున్నారు. ఎవరిచ్చారు వీళ్లకి ఆ అధికారాన్ని? న్యాయాన్యాయాల విచక్షణ అనేది వీళ్లకి ఉందా? ఇదెక్కడి న్యాయం?

చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పోవాలి కూడా!!. ఆ చట్ట పరిధిలోని ఏజెన్సీలు కూడా వాటి పని అవి చేసుకుపోవాలి. ఒక వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పైనో, మరొకరిపైనో వ్యక్తిగతంగా అవి కక్ష పెంచుకోవాల్సిన పనిలేదు. 

ఆ కక్షతో రాజకీయ ప్రత్యర్థుల మాదిరిగా అవి మాట్లాడాల్సిన పని కూడా లేదు. కానీ ఏడాది కిందట తెలుగుదేశం చెప్పగా రామోజీ ప్రచురించిన మాటలనే ఈడీ అధికారులు బుధవారం యథాతథంగా తిరిగి వల్లించారంటే రామోజీ, బాబు కలిసి పెంచిన మొక్కలు ఎక్కడెక్కడ వేళ్లూనుకుని పోయాయో అనే భయం కలుగకమానదు. ప్రతిసారీ మౌఖిక ఆరోపణలు చేస్తున్నారే తప్ప ఆ ఆరోపణలకు తగ్గట్టుగా ఎలాంటి వాస్తవ నివేదికలూ సమర్పించటం లేదని, తక్షణం ఆ నివేదికలు సమర్పించాలని ఈడీ అధికారులపై ప్రాధికార సంస్థ ఆగ్రహం చూపిన అంశాన్ని మాత్రం ‘ఈనాడు’ కావాలనే రాసీ రాయనట్టుగా వదిలిపెట్టింది. మరోసారి మౌఖిక వాదనలకు అవకాశమివ్వకుండా... అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా సమర్పించాలని ప్రాధికార సంస్థ ఇచ్చిన ఆదేశాలను కూడా అది పట్టించుకోలేదు. జగన్‌మోహన్ రెడ్డిని ‘గజనీ’తో పోలుస్తూ... ఈడీ అధికారులు చేసిన వ్యాఖ్యల్ని, వారి వాదనలను మాత్రమే పతాక శీర్షికల్లో ప్రచురించింది. మరి ఈ వాదనల్లో నిజమెంత? పస ఎంత? సీబీఐ మాదిరే ఈడీ కూడా ఈ వ్యవహారంలో చంద్రబాబును ఎందుకు వదిలిపెట్టింది? రాంకీ సంస్థకు సింగిల్ టెండరుపై హడావుడిగా భూములు కట్టబెట్టిన దగ్గరి నుంచి గ్రీన్‌బెల్ట్‌పై మినహాయింపులిచ్చేదాకా నాటి సీఎం చంద్రబాబునాయుడి పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు అటువైపు చూడటం లేదు? అసలు ఈ వ్యవహారంలో ‘‘ఏది నిజం?’’

ముందుగా ఈడీ అధికారులు చేసిన వాదనల్లోని అంశాలను పరిశీలిద్దాం. 

అవెంత డొల్ల వాదనలో చెప్పటానికి పెద్దగా న్యాయ పరిజ్ఞానం అవసరం లేదు. కాస్త కామన్‌సెన్స్ ఉంటే చాలు!! 

1.వ్యాపార రంగంలో ఏమాత్రం విజయం సాధించని, లాభాలొస్తాయో రావో తెలియని సంస్థల్లో తెలివైన వారెవరూ పెట్టుబడులు పెట్టరు

ఇదీ ఈడీ వాదన. ఇదే నిజమైతే మరి అప్పుడే ప్రారంభమయ్యే సంస్థలకు (స్టార్టప్) నిధులెలా వస్తాయి? ఎస్‌కేఎస్ మైక్రోఫైనాన్స్ వంటి ఊరూపేరూ లేని సంస్థల్లో(అప్పటికి) ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి వంటి వ్యక్తులు ఎందుకు పెట్టుబడి పెట్టారు? తరవాత వారికి లాభాలెలా వచ్చాయి? బోర్డు కూడా పెట్టని బోల్డన్ని స్టార్టప్ కంపెనీల్లో విదేశీ వెంచర్ క్యాపిటలిస్టులు ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? ఒక చక్కని ఆలోచన ఉంటే... అది విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంటే పెట్టుబడిదారులు ముందుకొస్తారనే సంగతి ఈడీలాంటి ఏజెన్సీకి కూడా తెలియదనుకోవాలా? ఆంధ్రప్రదేశ్ పత్రికా రంగంలో ‘ఈనాడు’కు పోటీగా మరో పత్రికను తెస్తే సక్సెస్ అయ్యే అవకాశాలను జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించటం అబద్ధమా? పత్రిక తేవటం దగ్గర్నుంచి సర్క్యులేషన్ వరకూ ఇప్పటిదాకా ఆయన అంచనాలన్నీ నిజం కాలేదా? మున్ముందు ‘సాక్షి’ పబ్లిక్ ఇష్యూకు వెళ్లే పరిస్థితి వస్తే.. దీన్లో పెట్టుబడి పెట్టినవారికి లాభాలు రావా? అంతెందుకు!! ‘ఈనాడు’ విలువ రూ.10 వేల కోట్లుగా లెక్కించినపుడు దాంతో సమానంగా సర్క్యులేషన్ ఉన్న ‘సాక్షి’కి అందులో సగమైనా విలువ రాదా? ఆ ప్రకారం చూసుకున్నా ‘సాక్షి’ ఇన్వెస్టర్లకు ఇప్పటికే లాభాలొచ్చినట్టు కదా? దీన్నెందుకు ఈడీ గుర్తించదు. ఈ నిజాలేవీ వారికి అవసరం లేదా? అంతెందుకు! జీవితంలో లాభమంటే ఎరుగని... నిండా అప్పుల్లో, నష్టాల్లో మునిగిన తన కంపెనీలో ఒకో వాటాను ఏకంగా రూ.5 లక్షల 28 వేల పైచిలుకు మొత్తానికి విక్రయించిన రామోజీకి... ‘సాక్షి’పై అభాండాలు వేసే నైతికార్హత ఉందా?

2. జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.10 విలువైన వాటాలను కొందరు వ్యక్తులు, సంస్థలు రూ.350 ప్రీమియంతో కొన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారు తప్ప వేరెవరూ ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టలేదు. 


ఇదో అడ్డగోలు వాదన. ఎందుకంటే జగతిలో పెట్టుబడులు పెట్టినవారిలో ప్రభుత్వం నుంచి పైసా కూడా లబ్ధి పొందని వారూ ఉన్నారు. ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేనివారూ ఉన్నారు. వీరి పెట్టుబడులకు సంబంధించి సీబీఐ ఒక ప్రత్యేక చార్జిషీటు కూడా దాఖలు చేసింది. దాన్లో ఏమని చెప్పిందో తెలుసా? జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన ఆడిటర్ విజయసాయిరెడ్డి కలిసి వారిని మోసం చేశారని. వారికి తప్పుడు మాటలు చెప్పి వారిచేత పెట్టుబడులు పెట్టించారని. అంటే... ఇన్వెస్టర్లలో ప్రభుత్వపరంగా ప్రాజెక్టులేవైనా పొందిన వారుంటే... వారు అలా లబ్ధి పొందారు కనకే పెట్టుబడి పెట్టారనే వాదన. ఒకవేళ వారికి ఏ లబ్ధీ కలగకపోతే... వారిని తప్పుడు మాటలతో మోసం చేశారన్న వాదన. పెపైచ్చు ఈ రెండు వాదనలూ ఒకే కేసులో!! ఎంత చిత్రం. ఇంతకన్నా ఘోరమైన తీరేమైనా ఉంటుందా? సీబీఐ వేసిన చార్జిషీట్లను యథాతథంగా తీసుకుని... ఆస్తుల్ని జప్తు చేయాలంటూ పోతున్న ఈడీకి ఈ వాదనల్లోని మర్మం అర్థంకాలేదా? లేక తానూ ఆ తానులో ముక్కనే కనక అర్థంకానట్లు నటిస్తోందా? 

3. జగన్ 2003-04 ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఆదాయాన్ని రూ.9.9 లక్షలుగా చూపించారు. 2009 ఎన్నికల అఫిడవిట్లో మాత్రం తన ఆస్తి రూ.77 కోట్లుగా పేర్కొన్నారు. 2004- 2009 మధ్య తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా ఆస్తులు సంపాదించారనడానికి ఇదే సాక్ష్యం. 

ఇదండీ... ఈడీ చూపిన మరో సాక్ష్యం...!!! అసలు ఆదాయానికి, ఆస్తికి తేడా ఉంటుందనే విషయం ఈడీకి గానీ, గతంలో ఇవే ఆరోపణలు చేసిన టీడీపీకి గానీ... వాటిని చేయించి, ప్రచురించిన రామోజీకి గానీ తెలియదనుకోవాలా? ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం వచ్చిందంటే దానర్థమేంటి? అంతటి ఆదాయాన్నిచ్చే ఆస్తులు ఉన్నాయనేగా! 2004 నాటికి ఏడాదికి 10 లక్షల ఆదాయం రావాలంటే ఆస్తులెన్ని ఉండి ఉండాలి? అయినా జగన్‌మోహన్ రెడ్డి కుటుంబానికి ఆయన తాత రాజారెడ్డి నాటినుంచీ సొంత వ్యాపారాలున్నాయి. సొంత ఆడిటర్‌తో పాటు ఆదాయపు పన్ను చెల్లించిన చరిత్ర ఉంది. అలాంటి కుటుంబానికి చెందిన జగన్‌కు 2004 నాటికే 10 లక్షల ఆదాయం ఉందని ఈడీ కూడా చెబుతోంది. మరి 2009 నాటికి ఆస్తి 77 కోట్లకు చేరటం ఎందుకంత చిత్రంగా కనిపిస్తోందనేది అర్థంకాని విషయం.

4. జగతి పబ్లికేషన్స్ విలువ లెక్కింపు మోసపూరితంగా జరిగిందనేది ఈడీ వాదన. ఈ విలువను నిర్ధారించటం కోసం జగదీశన్, డెలాయిట్ కంపెనీల నుంచి పొందిన నివేదికలు రెండూ మోసపూరితమైనవని, వాటి ఆధారంగానే పెట్టుబడులు వచ్చాయనేది దాని మాట. 

ఒకవైపేమో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందినవారు దానికి ప్రతిఫలంగా ‘క్విడ్ ప్రో కో’ రూపంలో పెట్టుబడులు పెట్టారంటారు. మరోవైపేమో మోసపూరిత నివేదికల ఆధారంగా వారిచేత పెట్టుబడులు పెట్టించారంటారు. ఇవి రెండూ ఎలా సాధ్యం? ఒకవేళ నిజంగానే ‘క్విడ్ ప్రో కో’గా పెట్టుబడులు పెడితే వారికి విలువ నిర్ధారించే నివేదికలు అవసరమా? ఈ నివేదికలేవీ లేకుండానే పెట్టుబడి పెడతారుగా? మరి డెలాయిట్ వంటి సంస్థల చేత విలువను నిర్ధారించాల్సిన అవసరమేమొచ్చింది. ఎవ్వరూ నిర్ధారించకపోయినా నోటికొచ్చిన లెక్క చెబితే వారే పెట్టుబడి పెడతారుగా? దీనర్థం ఈ పెట్టుబడులేవీ సీబీఐగానీ, ఈడీగానీ చెబుతున్నట్టు క్విడ్ ప్రో కో కావనేగా? అంతర్జాతీయ ఆడిట్ సంస్థలిచ్చిన నివేదికలు చూశాకే పెట్టుబడి పెట్టారంటే దానర్థం ఇన్వెస్టర్లు దాన్ని కూడా ఒక ఇతర ఇన్వెస్ట్‌మెంట్లలో భాగంగానే భావించారని అర్థంకాదా? లాభాలకోసమే పెట్టుబడి పెట్టారని అర్థంకాదా? అంతర్జాతీయ సంస్థల చేత ఆడిట్ చేయించి ఇన్వెస్ట్‌మెంట్లు అభ్యర్థించారంటే దానర్థం జగతి ప్రతినిధులు పత్రికారంగంలో ఒక నిజమైన ప్రత్యామ్నాయం కోసం, లాభాలు తెచ్చే ఒక సంస్థ కోసం శ్రమించారని అర్థంకాదా? దీన్లో క్విడ్.. ప్రో...కో... ఏమైనా ఉందా?

5. జగతి పబ్లికేషన్స్ అధీనంలో యంత్రాలు మాత్రమే ఉన్నాయి. అది తన అనుబంధ సంస్థ పేరిట భూముల్ని, భవనాల్ని పెట్టింది. తెలివైన వారు ఆ కంపెనీల్లో పెట్టుబడి పెడతారు తప్పితే జగతిలో పెట్టుబడి పెట్టరు.

ఈడీ చేసిన ఈ వాదన కూడా సత్యదూరమే. ఎందుకంటే భూములు, భవనాల్ని కలిగి ఉన్న జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి సంస్థలోనూ ఇదే ఇన్వెస్టర్లలో కొందరు పెట్టుబడి పెట్టారు. జగతి పబ్లికేషన్స్ అనేది ‘సాక్షి’ని ముద్రించే ఫ్లాగ్ షిప్ కంపెనీ. మున్ముందు పబ్లిక్ ఇష్యూకు వెళితే గనక లాభం వచ్చేది దీన్లోని ఇన్వెస్టర్లకే. ఇక్కడ ఈడీ విస్మరించినదేమిటంటే జననిలో కూడా కొందరు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారనేది. ఎందుకంటే గతంలో మొదటి ఛార్జిషీటుపై అటాచ్‌మెంట్ ఉత్తర్వుల కోసం వాదించినపుడు ఇదే సంస్థ జనని గురించి కూడా ప్రస్తావించింది. ఇపుడేమో ఆ సంస్థ గురించి తెలియనట్టు వాదించటమే విచిత్రం. 

రాంకీపై ఆది నుంచీ అబద్ధాలే...

నిజానికి బుధవారం న్యాయ ప్రాధికార సంస్థ ముందు వాదనలు జరిగింది రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో. విశాఖలో ఫార్మాసిటీని పొందిన ఈ సంస్థకు వైఎస్ హయాంలో గ్రీన్‌బెల్ట్ విషయమై మినహాయింపులిచ్చారని, అలా మినహాయింపునిచ్చినందుకే అది జగతి పబ్లికేషన్స్‌లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందనేది గతంలో సీబీఐ, ఇపుడు ఈడీ చేస్తున్న వాదన. నిజం చెప్పాలంటే ఈ ఫార్మాసిటీ వ్యవహారం జరిగింది చంద్రబాబు హయాంలో. టెండర్లు పిలవటం నుంచి టెంకాయ కొట్టడం వరకు అంతా బాబు కనుసన్నల్లోనే నడిచింది. గ్రీన్‌బెల్ట్ రూపంలో ఆ సంస్థ ఎంత భూమిని వదలాలనేదీ బాబే నిర్ణయించారు. దానికి ఇవ్వాల్సిన మినహాయింపులూ ఇచ్చారు. కాకుంటే వైఎస్ అధికారంలోకి వచ్చాక ఆ గ్రీన్‌బెల్ట్‌ను పెంచితే బాగుంటుందని భావించారు. అధికారులతో చర్చించారు. అది కష్టమని అధికారులు అనటం, రాంకీ సంస్థ ప్రతినిధులు తాము నష్టపోతామని చెప్పటంతో ఆ ఆలోచన ఉపసంహరించుకున్నారు. బాబు నిర్ణయించిన గ్రీన్‌బెల్ట్‌నే కొనసాగించమన్నారు. కానీ సూత్రధారి బాబును వదిలేసిన సీబీఐ, ఈడీలు.. ఎంతసేపూ వైఎస్సార్, జగన్ చుట్టూ తిరుగుతుండటమే విచిత్రం. 

ఇదీ... రాం‘కీ’ కథ

హైదరాబాద్ కాకుండా ఇతర ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేయాలని 1999లో భావించిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం... విశాఖపట్నంలో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తావంటూ 18-7-2000న జీవో ఎంఎస్ నంబరు 381ని విడుదల చేసింది. పరవాడ పారిశ్రామిక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. కాలుష్యం దృష్ట్యా పరవాడ సరికాదని అభ్యంతరాలు వచ్చినా బుట్టదాఖలు చేశారు. పరవాడను ఖరారు చేస్తూ 24-9-2001న జీవో ఎంఎస్ నంబరు 501ని విడుదల చేశారు. బాబు యథాప్రకారం ఫార్మా పార్కు టెండర్ల ప్రక్రియను నడిపించే బాధ్యతను ఎల్‌అండ్‌టీకి అప్పగించారు. టెండర్లు ఆహ్వానిస్తూ 2002 అక్టోబర్ 31న, డిసెంబర్ 17న ప్రకటనలొచ్చాయి. రాంకీ ఎన్విరో ఇంజినీర్స్, రాంకీ సహా 13 సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి. కానీ ప్రతిపాదన దశలో రాంకీ సహా ఏడుగురే మిగిలారు. చివరకు 3 కంపెనీలే ప్రతిపాదనలు సమర్పించాయి. మారిషస్‌కు చెందిన క్రిస్సన్‌తో కలిసి వేసిన జూమ్ డెవలపర్స్ ఒక్కటే అర్హత పొందింది. అయితే ఏపీఐఐసీ ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వలేదనే కారణంతో జూమ్ ప్రతిపాదనను కూడా రద్దు చేశారు. 

‘బూట్’ మార్చిన బాబు...

టెండర్ల ప్రక్రియ రద్దవటంతో చంద్రబాబు కొత్త ఆలోచన చేశారు. 2003 జూన్ 28న సమావేశమై... బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బూట్) పద్ధతి మార్చారు. బిల్డ్ ఆపరేట్ ఓన్ ప్రాతిపదికన దీన్ని చేపట్టాలని నిర్ణయించారు. నిర్మించి, నిర్వహించి ప్రభుత్వానికి అప్పగించే బదులు... ఇక సదరు ప్రయివేటు సంస్థ హస్తగతం చేసుకోవటమన్న మాట. ఆ తరవాత నెలరోజులకే అంటే... 2003 జూలై 31న రాంకీ ఇన్‌ఫ్రా ముందుకొచ్చింది. ఏపీఐఐసీకి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన సమర్పించింది. దానిపై నేరుగా చంద్రబాబుతో ఇన్‌ఫ్రా సబ్ కమిటీ చర్చించింది. 

చివరికి 2003 నవంబర్ 14న... రాంకీతో చర్చలు జరిపే అధికారాన్ని ఏపీఐఐసీకే అప్పగిస్తూ చంద్రబాబు స్వయంగా ఒక నోట్‌ను ఆమోదించారు. రెండు నెలల్లో అంతా రెడీ. ప్రాజెక్టును అప్పగించటం.. ఎంఓయూ కుదుర్చుకోవటం అంతా పూర్తి. అప్పటికే బాబు ప్రభుత్వం ఆపద్ధర్మంలో పడింది. కానీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆయన ఎంఓయూ కుదుర్చుకున్నారు. చివరికి ‘రాంకీ ఫార్మా సిటీ’ సంస్థను 2004 మార్చి 11న... అంటే ఎన్నికలకు రెండు నెలల ముందు రిజిస్టరు చేశారు. 24 గంటలు కూడా తిరక్క ముందే... 2003 మార్చి 12న రాంకీతో కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిప్రకారం ఈ సంస్థలో రాంకీకి 89 శాతం, ఏపీఐఐసీకి 11 శాతం వాటా ఉంటాయి. ఏపీఐఐసీ తన వాటా మేరకు భూమిని సమకూరుస్తుంది. దీంతో పాటు అమ్మకం పన్ను, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల్ని పూర్తిగా మినహాయించటం... ప్రభుత్వానికి, ఉడాకు చెల్లించాల్సిన చార్జీలేమైనా ఉంటే వాటిని తగ్గించటానికైనా, పూర్తిగా రద్దు చేయటానికైనా ఏపీఐఐసీ రికమెండ్ చేయటం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే రాయితీలూ ఇవ్వటం వంటి అంశాలన్నీ ఈ కన్సెషన్ ఒప్పందంలో చేర్చటం విశేషం.

గ్రీన్‌బెల్ట్‌పై ఆనాడే నిర్ణయం...

2000 మార్చిలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొన్న విధంగా గ్రీన్ బెల్డ్ ఉండేలా డెవలపర్ చూసుకోవాలని కన్సెషన్ ఒప్పందంలో చేర్చారు. దీని ప్రకారం గ్రీన్‌బెల్ట్‌కు బాబు నిర్దేశించిన భూమి 352 ఎకరాలు. దాన్లో 58.5 ఎకరాలు గోడకు లోపల, మిగిలింది ఆవల ఉంటాయి. ఈ మేరకు లే ఔట్‌ను రాంకీ ఉడాకు సమర్పించటం... అది ఆమోదించటం అన్నీ జరిగాయి. అయితే వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక ఫార్మా సిటీపై సమీక్ష సందర్భంగా అక్కడ నో డెవలప్‌మెంట్ జోన్‌గా ప్రకటించే గ్రీన్‌బెల్ట్ ఏరియా... బౌండరీ చుట్టూ గోడకు ఆవల 500, ఇవతల 500 మీటర్లు ఉంటే బాగుంటుందని భావించారు. కానీ బయటి వారి నుంచి భూముల్ని కొనకుండా కిలోమీటర్ మేర గ్రీన్‌బెల్ట్ సాధ్యం కాదని ‘ఉడా’ చెప్పటంతో... దాన్ని 250 మీటర్లకు తగ్గించాలనుకున్నారు. చివరకు గోడకు వెలుపల 250 మీటర్లు, గోడ లోపల 50 మీటర్లు ఉంటే చాలనుకున్నారు. ఇలా గ్రీన్‌బెల్ట్ 50 మీటర్లుగా ఉండటం వల్ల రాంకీ సంస్థ గోడలోపల వదలాల్సిన స్థలం 58.95 ఎకరాలు. ఇది చంద్రబాబు నాయుడి హయాంలో ప్రతిపాదించినదే. దాన్ని మార్చినందుకే వైఎస్సార్ తనయుడు జగన్‌కు చెందిన సాక్షిలో రాంకీ పెట్టుబడులు పెట్టాయనే వాదన మరి ఎంతవరకూ నమ్మొచ్చు? 


14.5 లక్షల కోట్లు ప్రభుత్వానికొస్తాయా?

ఎన్నికలకు ముందు జగన్‌పై బురద జల్లి, ఆయన ప్రజాభిమానాన్ని దెబ్బతీయటానికి ఎంత పెద్ద సంఖ్య చెబితే అంత బాగుంటుందని రామోజీ భావించారు. అందుకే తన తెలుగుదేశం మిత్రుల చేత అద్దిరిపోయే అబద్ధాలు పలికించారు. వాళ్లుకూడా రెచ్చిపోయి... జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా 17 లక్షల కోట్లు దోచుకున్నారని బీభత్సమైన ఆరోపణలు చేసేశారు. దాన్లో వాళ్లంతా కలిసి ఖమ్మం జిల్లాలోని బయ్యారం గనులకు కట్టిన విలువ ఏకంగా 14.5 లక్షల కోట్లు. అసలు ఈ రక్షణ స్టీల్స్‌తో తనకే మాత్రం సంబంధం లేదని బ్రదర్ అనిల్‌కుమార్ ఎన్నిసార్లు చెప్పినా తెలుగుతమ్ముళ్లు వినిపించుకుంటే ఒట్టు. చివరికి రక్షణ స్టీల్స్‌కిచ్చిన లీజును రద్దుచేసేశారు. తాజాగా గురువారమే దీన్ని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించారు. అంటే బాబు-రామోజీ లెక్కల ప్రకారం రూ.14.5 లక్షల కోట్ల విలువైన ఉక్కు గనుల్ని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్రభుత్వం కేటాయించినట్టే. మరి రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కు ఎంతిస్తుంది? విశాఖ ఉక్కుకు ఇనుప గనుల కొరత తీరినట్టేనా? దీనిపై విశాఖ ఉక్కుగానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ చెబితే తప్ప నిజానిజాలు తెలియవు. రామోజీ-బాబు కలిసి జగన్‌పై ఎంత బురద జల్లుతున్నారన్నది కూడా ఈజీగానే తెలుస్తుంది!!. 

ఈ ప్రశ్నలకు బదులేది?

వైఎస్ 250 మీటర్ల గ్రీన్‌బెల్ట్ ఉండాలని ప్రతిపాదించినపుడు... తాము బాబు హయాంలో కుదుర్చుకున్న కన్సెషన్ ఒప్పందం ప్రకారం 50 మీటర్లే గ్రీన్‌బెల్ట్‌కు అంగీకరించామని, దానికే పరిమితం కావాలని ముఖ్యమంత్రిని రాంకీ సంస్థ కోరే అవకాశం లేదా? అలా కోరినపుడు మునుపటి ఒప్పందమే కనక ఆమోదించవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ భావించే అవకాశం లేదా? అలాంటి సహేతుకమైన కారణాలన్నిటినీ వదిలేసి... సాక్షిలో పెట్టుబడి పెట్టారు కనకే ఈ మేలు చేశారనటం ఎంతవరకు సమంజసం?

జగన్‌మోహన్‌రెడ్డి వ్యాపార దక్షతపై నమ్మకం ఉండో, మున్ముందు ఇన్వెస్ట్‌మెంట్లు లాభిస్తాయనో, రాష్ట్రంలో బొమ్మనేకాదు... బొరుసును కూడా చూపించే పత్రిక వస్తోంది కాబట్టి దానికి మద్దతివ్వాల్సిన అవసరముందని భావించో ‘రాంకీ’ సంస్థ పెట్టుబడి పెట్టే అవకాశం లేదా? 

గ్రీన్‌బెల్ట్‌పై నిజానికి రాంకీకి వైఎస్ సంస్థ చేసిన మేలేమీ లేదు. మునుపటి ఒప్పందాన్నే పాటించింది. మరి ఈ పాటిదానికే ‘సాక్షి’లో రాంకీ రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిందన్న సీబీఐ వాదన నిజమైతే... 2,143 ఎకరాల్ని సింగిల్ టెండరు ప్రాతిపదికగా కట్టబెట్టేసిన చంద్రబాబునాయుడికి రాంకీ ఎంత ముడుపులిచ్చి ఉండాలి?
Share this article :

0 comments: