త్వరలో పంచాయతీల ఎన్నికలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » త్వరలో పంచాయతీల ఎన్నికలు

త్వరలో పంచాయతీల ఎన్నికలు

Written By news on Friday, April 19, 2013 | 4/19/2013

రాష్ట్రంలోని 21,600 గ్రామ పంచాయతీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి వెల్లడించారు. పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్ వివరాలతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ జిల్లాల్లో అధికారులు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, వారికి తగిన సూచనలిచ్చేందుకు రమాకాంత్‌రెడ్డి గురువారం గుంటూరు వచ్చారు. జెడ్పీ సమావేశమందిరంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీవోలు, డీఎస్పీలు, ఆయా జెడ్పీల సీఈవోలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పు ప్రకారం రాష్ట్రంలో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 

అయితే వివిధ జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులన్నీ ముందస్తుగానే సిద్ధం చేస్తామన్నారు. ఫొటో ఎలక్ట్రికల్ రోల్స్, పోలింగ్ బూత్‌లు, బ్యాలెట్‌బాక్సుల రిపేర్లు, ఎన్నికల నియమావళి తయారు వంటి పనుల్లో ఉన్నామన్నారు. వివిధ జిల్లాల ఉన్నతాధికారులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రప్రభుత్వ యంత్రాంగంపై తనకు అపారమైన నమ్మకం ఉందనీ, ఎన్నికల్ని విజయవంతంగా జరిపే అధికారులు అన్ని జిల్లాల్లోనూ ఉన్నారన్నారు. పంచాయతీలతో పాటు రాష్ట్రంలోని 1097 మండల పరిషత్‌లకు, 22 జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించడం ఖాయమన్నారు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికలు వాయిదా పడబోవన్నారు.
Share this article :

0 comments: