ప్రజానాయకుడు ఉండవలసింది...ప్రజల మధ్యే కానీ, నిర్బంధంలో కాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజానాయకుడు ఉండవలసింది...ప్రజల మధ్యే కానీ, నిర్బంధంలో కాదు

ప్రజానాయకుడు ఉండవలసింది...ప్రజల మధ్యే కానీ, నిర్బంధంలో కాదు

Written By news on Tuesday, April 16, 2013 | 4/16/2013

భారతిగారికి ఆశీస్సులు. ‘జగన్‌కోసం’లో రాస్తూ ఆ ఆప్తులంతా ఏం చేస్తున్నారని మీరు ఎంతో ఆవేదనగా ప్రశ్నించారు. ఏం చేస్తున్నారో తెలియనిది ఎవరికి? రాజన్న కూర్చోబెట్టిన కుర్చీలను వదలలేక పదవి జారిపోకుండా గట్టిగా పట్టుకున్నారు. మీవైపు చూస్తే పదవి ఉంటుందా? పదవి లేకుండా వారు ఉండగలరా? వేలెత్తి చూపడం, వక్రీకరించడం, పక్కవాడి మీదకు సునాయాసంగా తప్పులు నెట్టి, చేతులు కడుక్కోవడం... అలా చేయకపోతే పదవి ఉండదు కదమ్మా. ఈ విశ్వాసఘాతుకత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పబోతున్నారులెండి. 

ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఇంటికి వెళ్లినా... ఎన్నికలు ఎప్పుడొస్తాయి? ఇంకా ఎప్పుడు? మనకు ఓటు ఉందా? వెంటనే వెళ్లి ఓటర్ల జాబితాను చూడాలి. ఒక్క ఓటు కూడా వృథా కాకూడదు. జగన్ బాబు దోసిట్లోకి ఓట్లు జాలువారాలి.... ఇదీ ప్రజల స్పందన. కాంగ్రెస్ అధిష్టానం, తెలుగుదేశంపార్టీ, ఎల్లో మీడియా... అంతా కుమ్మక్కై జగన్‌కు జైలుకు పంపించి, బెయిల్ రాకుండా చేస్తున్నారని ప్రజలకు స్పష్టమైంది. ఈ దుష్టకూటములన్నీ ప్రజాబలం ముందు బలాదూరే. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ప్రముఖులచేత బెయిల్‌కు సంబంధించిన చర్చలు జరిపించండి. సత్వర న్యాయం జరుగుతుంది. జగన్ బయటికి వస్తారు. ప్రజానాయకుడు ప్రజల మధ్యే ఉండాలి. నిర్బంధంలో కాదు. 

- జి.కల్పన, హైదరాబాద్

పార్టీలో ఉంటే పదవి...పార్టీ పెడితే జైలా?! 
ఇదేనా 125 ఏళ్ల కాంగ్రెస్ ఘనచరిత్ర?

జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడల్లా సమస్యలు సృష్టిస్తున్నారు. ఛార్జిషీట్లు అంటున్నారు. సాక్ష్యాలు తారుమారు అంటున్నారు. ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమౌతోంది. టీడీపీ, కాంగ్రెస్ నేతలు కుమ్మక్కై జగన్‌ని అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారు. వైయస్సార్ తన రెక్కల కష్టంతో కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల గుండెల్లో చిరస్మరణీయులయ్యారు. ఆయన తెచ్చిన అధికారంతో అందలమెక్కిన నాయకులు ఇప్పుడు ఆ మహానేత తనయుడినే అష్టకష్టాలు పెడుతున్నారు. 

ప్రజల అభిమానం పొందుతున్న జగన్‌ని చూసి కాంగ్రెస్‌పార్టీ నేతల్లో వణుకుపుడుతోందంటే ఏమనుకోవాలి? ప్రజాభిమానం పొందడం జగన్ తప్పా? ఆజాద్‌గారన్నారు, జగన్ కాంగ్రెస్‌లో ఉంటే కేంద్రమంత్రిపదవో, ముఖ్యమంత్రి పదవో ఇచ్చేవాళ్లం అని! అంటే మీ పార్టీలో ఉంటే పదవి ఇస్తారు, బయటికి వచ్చి పార్టీ పెడితే జైలుపాలు చేస్తారా? ఇదేనా మీ రాజకీయం? వీరప్పమొయిలీ ‘మా అస్త్రాలు మాకున్నాయి’ అన్నారు. మీ అస్త్రాలు అంటే సీబీఐ, ఈడీ... ఇలాంటివే కదా. మీ అధికారంతో వాళ్లని ఉపయోగించుకుని జగన్‌ని ఇబ్బందులపాలు చెయ్యడం ధర్మయుద్ధమా? దొంగ దెబ్బతీయడమా? ప్రజలు ఎన్నికలప్పుడు ఉపయోగించే ఓటు అనే అస్త్రం ఉపయోగిస్తే, మీ అస్త్రాలన్నీ పటాపంచలై డిపాజిట్లు గల్లంతై పార్టీ ఓటమిపాలు కావడం ఖాయం.

ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా జగన్‌కి భారీ మెజారిటీ రావడం తథ్యం. చంద్రబాబు పాదయాత్ర అని తెగ తిరిగేస్తున్నారు. చంద్రబాబుగారూ... పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన మీకు ఆ పార్టీలో కొనసాగే అర్హత ఎలా ఉంటుంది? మీలా... జగన్‌ని అరెస్టు చేయించామని సంతోషపడే వారందరికీ వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. బోనులో ఉన్నా, బయట ఉన్నా సింహం సింహమే. జగన్ సింహంలాంటివారు. సింహం గర్జిస్తే తోడేళ్లు తోకముడవక తప్పదు. 

- ఎం.అరుణకుమారి, నంద్యాల
Share this article :

0 comments: