జలయజ్ఞాన్ని పట్టించుకోవట్లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జలయజ్ఞాన్ని పట్టించుకోవట్లేదు

జలయజ్ఞాన్ని పట్టించుకోవట్లేదు

Written By news on Monday, April 15, 2013 | 4/15/2013

రైతుల మేలు కోరి వైఎస్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు
కానీ వైఎస్ మరణించాక వచ్చిన సీఎంలు జలయజ్ఞాన్ని నిర్లక్ష్యం చేశారు
ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకూ గ్రహణం పట్టించారు

 హైదరాబాద్: రైతుల కడగండ్లను శాశ్వతంగా దూరం చేయాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన బృహత్తరమైన ‘జలయజ్ఞం’ కార్యక్రమాన్ని ప్రస్తుత సర్కారు మూలన పడేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విమర్శించారు. ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టాలని కోరుతూ పాదయాత్ర పూర్తి చేసిన ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట(తూర్పుగోదావరి) ప్రాంతాల రైతులు పెద్దసంఖ్యలో ఆదివారం మధ్యాహ్నం విజయమ్మను ఆమె నివాసంలో కలిశారు. తమ నాలుగు నియోజకవర్గాలకు ఎంతో మేలు చేకూర్చే ఏలేరు ఆధునికీకరణ పనులకు దివంగత వైఎస్ శంకుస్థాపన చేశారని, ఆయన మరణించాక దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆమె దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. ‘‘రైతులకు ఆత్మాభిమానం చాలా ఎక్కువని, తినడానికి తిండి లేనిరోజుల్లోనూ ఒకరి ముందు చేయిచాచే మనస్తత్వం వారిది కాదని వైఎస్ చెప్పేవారు. వారికోసం ఎంత చేసినా తక్కువేనని నాతో అనేవారు. అందుకే ముఖ్యమంత్రి కాగానే 2004లో తొలి సంతకంద్వారా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలులోకి తెచ్చారు. చంద్రబాబు హయాంలో పేరుకుపోయి.. రైతుల్ని వేధించడానికి కారణమైన కరెంటు బకాయిలను పూర్తిగా రద్దు చేశారు. రైతులకు శాశ్వతంగా మేలు చేయాలంటే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే సరైన పరిష్కారమని భావించి తన ఐదేళ్ల పాలనలో రూ.51 వేల కోట్ల మేరకు జలయజ్ఞంపై ఖర్చు చేశారు. 

ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణకూ రూ.138 కోట్ల వ్యయంతో 2009 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. కానీ ఆయన మరణం తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు దేనినీ పట్టించుకోవట్లేదు. వారి వైఖరి వల్లనే ప్రస్తుతం జలయజ్ఞం మూలనపడింది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంతో ఎంతవరకు ఏలేరు ఆధునికీకరణ పనులు చేయించగలుగుతామో తెలియదుగానీ రాబోయే సాధారణ ఎన్నికల తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వీటిని పూర్తి చేయిస్తామని రైతులకు ఆమె హామీఇచ్చారు. పార్టీ సీజీసీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, జరిగినన్ని రోజులు జరుపుకుని దిగిపోదామనే ఆలోచనతో పాలన సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయిన ఏడాదిలోగా ఈ పనులను పూర్తి చేయిస్తామని ప్రకటించారు. సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. ఏలేరు ఆధునికీకరణ పనులు చేపట్టాలని కోరుతూ గత నెల 22 నుంచి 28వ తేదీ వరకూ తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేశామని, సమస్య ప్రాధాన్యతను ప్రజలకు వివరించి పరిష్కారంకోసం విజయమ్మను కలిశామని వివరించారు. 
Share this article :

0 comments: