ఒక దినపత్రిక, చానల్‌ను ఏర్పాటు చేయడం అవినీతి అయితే, రెండేళ్లలోనే 2టీవీ చానళ్లు, ఒక పత్రిక.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒక దినపత్రిక, చానల్‌ను ఏర్పాటు చేయడం అవినీతి అయితే, రెండేళ్లలోనే 2టీవీ చానళ్లు, ఒక పత్రిక..

ఒక దినపత్రిక, చానల్‌ను ఏర్పాటు చేయడం అవినీతి అయితే, రెండేళ్లలోనే 2టీవీ చానళ్లు, ఒక పత్రిక..

Written By news on Sunday, April 14, 2013 | 4/14/2013

వైఎస్సార్ అండదండలతో పదవులను పొంది, ఆయన కుటుంబం తప్పితే రాష్ట్రానికి మరో దిక్కులేదని చెప్పిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోదరులు నేడు అదే కుటుంబంపై విమర్శలు గుప్పించడం ఎంతవరకు సబబని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. గడికోట శనివారమిక్కడ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్లు కష్టపడి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్సార్ ఒక దినపత్రిక, చానల్‌ను ఏర్పాటు చేయడం అవినీతి అయితే, కేవలం రెండేళ్లలోనే రెండు టీవీ చానళ్లు, ఒక పత్రికను ఏర్పాటు చేసిన సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి ఇంకెంత అవినీతికి పాల్పడ్డారో చెప్పాల్సిన బాధ్యత అధికార, ప్రతిపక్ష నేతలపై ఉందన్నారు.



మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాటలను విన్నవారు ఆయనను చీదరించుకుంటున్నారని వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఒంగోలులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మొదట డిమాండ్ చేసిన వారిలో ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారని గుర్తుచేశారు. మంత్రి కాక ముందు ఆనం ఆస్తులెంతో.. ఇప్పటి ఆస్తులెంతో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఇటీవల నెల్లూరులో జరిగిన సీఎం పర్యటన రచ్చరచ్చగా మారిందని, దీంతో తన పదవి ఊడుతుందన్న భయంతో ఆనం ఈ నీచ వ్యాఖ్యలు చేశారన్నారు. రచ్చను సోనియాగాంధీ సీరియస్‌గా తీసుకుంటే కిరణ్ పదవి పోవడం ఖాయమని, ఒకవేళ అదే జరిగితే సీఎం పదవి దక్కించుకోవాలనే ఆశతో సోనియా వద్ద మార్కులు కొట్టేయాలనే దురుద్దేశంతో వైఎస్ కుటుంబంపై ఆరోపణలు చేశారన్నారు.
Share this article :

0 comments: